iPhone Air Discount| ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా అత్యంత స్లిమ్ డిజైన్ తో లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ కొన్ని వారాల వ్యవధిలోనే డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ ఆఫర్ అమెజాన్ లో మాత్రమే ఉంది. ఈ ఆఫర్ HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ కు మాత్రమే. ఈ డిస్కౌంట్ ద్వారా మీరు భారీ మొత్తాన్ని సేవింగ్స్ చేయవచ్చు. ఒక స్లిమ్ ఐఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ మంచి అవకాశం.
ఐఫోన్ ఎయిర్ 256GB వేరియంట్ రూ1,19,900 ధరకు లిస్ట్ అయింది. HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. EMI పై కొనుగోలు చేస్తే ₹6,750 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విధంగా ఫైనల్ ధర ₹1,13,150 అవుతుంది. నాన్-EMI పై కొనుగోలు చేసినా ₹6,250 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ కొత్త ఆఫర్ లాంచ్ ఓఫర్ కంటే మెరుగైనది. మొదటి ఆఫర్ లో కేవలం ₹5,000 డిస్కౌంట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మీరు అదనంగా ₹1,750 అదనంగా సేవ్ చేసుకోవచ్చు. మీరు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి.
ఐఫోన్ ఎయిర్ టెక్నాలజీలో ఒక మార్పు జరిగింది. ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కంటే సన్నగా తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఈ డివైస్ కేవలం eSIM ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫిజికల్ SIM కార్డ్ స్లాట్ లేదు. అందుకే ఇండియాలో కొంతమంది వినియోగదారులకు ఇబ్బంది కలిగించవచ్చు.
ఈ డివైస్ లో కొన్ని ట్రేడ్-ఆఫ్స్ ఉన్నాయి. ఇందులోని కెమెరా సిస్టమ్ ఇతర మోడల్స్ లాగా సోఫిస్టికేటెడ్ గా లేదు. అదేవిధంగా స్పీకర్ క్వాలిటీ కూడా ఐఫోన్ 17 మోడల్స్ కంటే భిన్నంగా ఉంది. లైన్ లోని ఇతర మోడల్స్ తో పోలిస్తే బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం తక్కువ. ఈ స్లిమ్ డిజైన్ మీకు ఇష్టమైతే మీరు ఈ ఆఫర్ ని వదులుకోవద్దు.
ఐఫోన్ ఎయిర్ టాప్-నాచ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది వీడియో వ్యూయింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. స్క్రీన్ చాలా లైవ్ ల్లీగా, రంగురంగులలో ఉంటుంది. అయితే దీని ఆడియో సాధారణ స్థాయిలోనే ఉండడంతో సూపర్ సౌండ్ అశించే వారు నిరాశచెంద వచ్చు.
స్లిమ్ ఫోన్, తక్కువ బరువు గల ఫోన్ కోరుకునే వారికి మాత్రమే ఈ ఫోన్ పరగణించాలి. ఫోన్ చాలా తేలికగా ఉండడం వల్ల పోర్టబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కరోజు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే వస్తుంది. సూపర్ ఫోటోగ్రఫీ కోసం ఇందులో కెమెరాలు ఉపయోగకరం కాదు. ఫోటోలు సాధారణంగానే ఉంటాయి. మీరు తరచుగా SIM మారుస్తుంటే, ఇది సౌకర్యవంతంగా ఉండదు.
అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్ ను ఉపయోగించండి. 256GB స్టోరేజ్ తో ఐఫోన్ ఎయిర్ ను సెర్చ్ చేయండి. చెక్అవుట్ సమయంలో HDFC బ్యాంక్ ఆఫర్ వివరాలను చూసి ఎంచుకోండి. EMI లేదా నాన్-EMI ఆప్షన్ ఎంచుకోండి. మీ లావాదేవీ పూర్తి అయిన తరువాత కన్ఫర్మ్ బటన్ ని క్లిక్ చేయండి.
ఇది ప్రమోషన్ ఆఫర్.. ఎక్కువ కాలం అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటువంటి ఆకర్షణీయమైన డీల్స్ త్వరగానే ముగిసిపోతాయి. ఎక్కువ సేవింగ్స్ కావాలనుకుంటే మీరు ఈ అవకాశాన్ని కోల్పోకుండా త్వరగా నిర్ణయించుకోండి.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే