BigTV English

Gaza conflict: హమాస్ VS ఇజ్రాయెల్.. గాజాలో శాంతి నెలకొంటుందా?

Gaza conflict: హమాస్ VS ఇజ్రాయెల్.. గాజాలో శాంతి నెలకొంటుందా?


Gaza conflict: గాజా గుండెకు గాయాలెన్నో అయ్యాయి. హమాస్ – ఇజ్రాయెల్ పోరులో కొన్నాళ్లుగా బలవుతున్నది సామాన్యులే. అయితే ఇన్నాళ్లకు హమాస్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంతో కథ మారుతోంది. బందీల అప్పగింతలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ కొనసాగుతోంది. జనానికి ఫుడ్ అందుతోంది. మరి ఇది మూన్నాళ్ల ముచ్చటేనా? శాంతి శాశ్వతంగా కొనసాగుతుందా?

ఇజ్రాయెల్-పాలస్తీనా పవర్ గేమ్


చరిత్ర ఒక గొప్ప బోధకురాలు. గొప్ప ఉపశమనకారి కూడా. ఇజ్రాయెల్, పాలస్తీనా పవర్ గేమ్‌లో నలిగిపోయిన వారెందరో. ఆధిపత్యం, ఆక్రమణలు, అపనమ్మకం, అనుమానాలు.. అభద్రతాభావం, గుర్తింపు, రాజకీయం.. ఇలాంటి ఎన్నెన్నో సంఘర్షణల మధ్య గేమ్ నడిచింది. అటు ఇజ్రాయెల్, ఇటు పాలస్తీనియన్ల పవిత్ర భూమి చుట్టూ రక్తపుటేర్లు పారాయి. చివరికి ఎవరూ ఏమీ సాధించలేకపోయారు. ఈ చదరంగంలో సమిధలైంది సాధారణ జనమే. గాజా స్ట్రిప్ పాలస్తీనా భూభాగంలో ఒక చిన్న భాగం. 365 చదరపు కిలోమీటర్ల ప్రాంతమిది. 41 కిలోమీటర్ల పొడవు, 6-12 కిలోమీటర్ల వెడల్పు, మధ్యదరా సముద్ర తీరం. 21 లక్షల మంది జనం. చెప్పాలంటే ఇది ఓపెన్ ఎయిర్ జైలు లాంటిదే. బయటకు వెళ్లలేరు. లోపలికి రాలేరు. గాజా ఇంతే. కానీ గుండెల్లో జరిగిన గాయాలెన్నో. హమాస్, ఇజ్రాయెల్ ఆధిపత్య పోరాటంలో చివరి విజేతలు అంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్లకైనా ఇక్కడ శాంతి ఒప్పందం కుదిరింది. భవిష్యత్ పై ఎంతో ఆశలతో కథ ముందుకు వెళ్తోంది.

67,194 మంది మరణాలు, 2 లక్షల మందికి గాయాలు..

2023 అక్టోబర్ నుండి గాజా- ఇజ్రాయెల్ యుద్ధంలో కనీసం 67,194 మంది మరణించారు, 2 లక్షల మంది దాకా గాయపడ్డారు. ధ్వంసమైన భవనాల శిథిలాల కింద వేలాది మంది సజీవ సమాధై ఉంటారు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల సమయంలో ఇజ్రాయెల్‌లో మొత్తం 1,139 మంది చనిపోయారు. అప్పుడు 200 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అది గతం. ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి పవనాలు వీస్తున్నాయక్కడ. భవిష్యత్ పై ఆశలు చిగురిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు వెనక్కు తగ్గాయి. గాజాలో చెల్లాచెదురైన వారు తమ సొంత భవనాల దగ్గరికి వెళ్తున్నారు. ఇదీ ఇప్పటి పరిస్థితి. గాజాలోకి ప్రవేశించే అన్ని మార్గాలను వెంటనే తెరవాలని యునైటెడ్ నేషన్స్ కు చెందిన అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్‌ను కోరాయి. అలా చేయడం ద్వారా గాజాలోని జనానికి వెంటనే అవసరమైన మానవతా సహాయం అందుతుందన్నారు. ఇజ్రాయెల్ రెండేళ్ల యుద్ధంలో జరిగిన యుద్ధ నేరాలు, మారణహోమంపై తక్షణ దర్యాప్తు ప్రారంభించడానికి స్వతంత్ర, అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని గాజా అధికారులు పిలుపునిస్తున్నారు.

రెండేళ్ల మారణహోమానికి ముగింపు పలుకుతున్నట్లేనా? శాంతి పవనాలు అనుమానాస్పదంగా మారే అవకాశం లేదు కదా? ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా మళ్లీ సీన్ మొదటికే వస్తుంది. ఇజ్రాయెల్, ఇటు హమాస్ రెండువైపులా అనుమానాల మధ్య శాంతికి శ్రీకారం చుడుతున్నాయి. మరి ఇది కంటిన్యూ అవ్వాలంటే జరగాల్సింది ఏంటి?

దళాలను ఉపసంహరించుకుంటున్న ఇజ్రాయెల్

గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్నారు. అయితే మొన్నటిదాకా అది ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేశారన్న వెర్షన్ వినిపించింది. ఏదైతేనేం.. ఒక స్టెప్ తీసుకున్నారు. అటు హమాస్ ను, ఇటు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహును ఒప్పించి కూర్చోబెట్టి 20 పాయింట్ ఫార్ములా ప్రతిపాదించి.. ప్రశాంతంగా ఉండండి అని సూచించారు. అందులో భాగంగా తొలి అడుగు పడింది. కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. 72 గంటల్లో హమాస్‌ చెరలోని 48 మంది బందీల విడుదల జరగబోతోంది. ఇందులో 20 మంది బతికే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 2 వేల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ రిలీజ్ చేయనుంది. కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో గత రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా సౌత్ గాజాకు తరలివెళ్లి టెంట్లల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు నార్త్ గాజాకు తరలి వస్తున్నారు. చాలా మంది కాలినడకనే వస్తున్నారు.

గాజాను ఎవరు పాలించాలన్న సందేహాలు

గాజా, ఇజ్రాయెల్ పీస్ డీల్ తో చాలా హ్యాపెనింగ్స్ వరుసగా జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ప్రారంభమైనా, యుద్ధం ముగింపుపై పలు డౌట్లు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆయుధాలు విడిచిపెట్టడంపై హమాస్‌ ఇంకా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మరోవైపు గాజాను ఎవరి పరిపాలించాలన్న విషయాలపైనా డౌట్లు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఓ మాటన్నారు. హమాస్‌ ను నిరాయుధీకరణ చేస్తామని ప్రకటించారు. ఈ పనిని తాము ఈజీ చేయలేకపోతే కఠిన మార్గంలోనైనా చేస్తామని చెప్పారు. అంటే సంఘర్షణ ఇంకా అలాగే ఉంది. కాల్పుల విరమణ కుదరడానికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు నెతన్యాహు థాంక్స్ తెలిపారు. బందీలందరినీ తీసుకొస్తానని ఇజ్రాయెల్‌ ప్రజలకు తానిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు. అటు ట్రంప్‌ అక్టోబర్ 13న ఇజ్రాయెల్‌ లో పర్యటించి ఆ దేశ పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడుతారు. ఏం మాట్లాడుతారన్నది కూడా కీలకంగానే మారింది.

మార్వాన్ బర్కూటీని రిలీజ్ చేయాలన్న హమాస్

తాము విడుదల చేయనున్న 250 మంది పాలస్తీనా ఖైదీల లిస్ట్ ను ఇజ్రాయెల్‌ ఆర్మీ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురిని తూర్పు జెరూసలెంలో, 100 మందిని వెస్ట్‌బ్యాంక్‌లో విడిచిపెట్టనుంది. 145 మందిని వేరే దేశాలకు తరలించనుంది. ఈ జాబితాలో కీలక నేత మార్వాన్బర్కూటీ పేరు చేర్చాలన్న హమాస్‌ డిమాండ్‌ను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. బర్కూటీకి పాలస్తీనా మండేలాగా పిలుస్తారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ సైన్యం చాలా ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గుతోంది. అయితే గాజా నుంచి పూర్తిగా తరలివెళ్లడం లేదు. చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. అలా చేసినా.. 50 శాతంపైగా గాజా భూభాగం ఇజ్రాయెల్‌ కంట్రోల్ లోనే ఉండనుంది. అదే ట్విస్ట్. రోజుకు 600 ట్రక్కుల సాయానికి ఇజ్రాయెల్‌ అనుమతించింది. దాదాపు 1,70,000 టన్నుల ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ ఇలాంటివి గాజాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని UNO అంటోంది.

అటు గాజా, ఇటు ఇజ్రాయెల్‌లో పండగ వాతావరణం

ట్రంప్‌ శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇజ్రాయెల్, హమాస్‌ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారు. మారణహోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటామన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నగరంలోనూ ఇజ్రాయెలీలో సంబరాలు చేసుకున్నారు. హమాస్ చెరలో ఉన్న తమ వారి రాకకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామంటున్నారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య అనుమాన మేఘాలు

సో ఇప్పుడు రెండువైపులా గేమ్ కంప్లీట్ కాలేదు. ఇజ్రాయెల్ కు కొంచెం సందు ఇచ్చినా రెచ్చిపోతుందని హమాస్ కు తెలుసు. అందుకే ఆయుధాలు వీడేందుకు ఇష్టపడడం లేదు. అదే సమయంలో హమాస్ కు గ్యాప్ ఇస్తే రెబల్స్ అవుతారని ఇజ్రాయెల్ కు తెలుసు. సో రెండు వైపులా నీలి నీడల మధ్యే శాంతి ఒప్పందం తొలి దశ ముందుకు కదిలింది. గాజా తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. గాజాలోని బఫర్‌ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది. గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది. అప్పుడే శాంతి ఒప్పందంలో మిగితా దశలు కంప్లీట్ అవుతాయంటున్నారు.

2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి

నిజానికి హమాస్ ఓవరాక్షన్ వల్లే రెండేళ్లుగా గాజా నలిగిపోయింది. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా చేసుకుని గాజాకు బలవంతంగా తరలించి, సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్‌ పౌరులతో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. భారత్ నుంచి ఒకరు ఉన్నారు. హమాస్‌ చేసిన ఈ పనితో ఇజ్రాయెల్‌ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. సైన్యం వెంటనే రియాక్టై హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది. మొన్నటికి మొన్న ఖతార్ లోనూ హమాస్ లీడర్లను డ్రోన్ అటాక్ తో లేపేసింది. ఇప్పటిదాకా వచ్చింది.

Also Read: ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

ట్రంప్‌ పీస్‌ ప్లాన్‌ ఇజ్రాయెల్‌హమాస్‌ మధ్య మూడో కాల్పుల విరమణ ఒప్పందం. 2023 నవంబర్‌లో రెండువైపలా తొలి పీస్ డీల్ కుదిరింది. అప్పట్లో 100 మందికిపైగా బందీలను హమాస్‌ రిలీజ్ చేసింది. అందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండో ఒప్పందం కుదిరింది. హమాస్‌ మిలిటెంట్లు 25 మంది ఇజ్రాయెల్ బందీలను వదిలేశారు. మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్‌ ప్రభుత్వం 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. సో తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన ట్వంటీ పాయింట్ ఫార్ములా గాజాను ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.

Story By Vidya sagar, Bigtv

Related News

Telangana Politics: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Big Stories

×