Mappls immobiliser| గూగుల్ మ్యాప్‌కు పోటీగా వచ్చిన ఇండియన్ యాప్ మ్యాప్‌ల్స్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులోని కొత్త కొత్త ఫీచర్లు.. ప్రయాణాలు చేసే సమయంలో ఎంతో సులువుగా, ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే ఈ ఫీచర్ల జాబితాలో ఒక సూపర్ ఫీచర్ ఉంది. ఇది కారు యాంటి-థెఫ్ట్ టూల్ గా ఉపయోగపడుతుంది.
మ్యాప్‌ల్స్ యాప్‌లో కొత్తగా జోడించి బడిన ‘ఇమ్మోబిలైజర్’ ఫీచర్ ద్వారా మీరు మీ వాహనాన్ని సుదూరంగా ఉంటూనే సురక్షితంగా ఉంచవచ్చు. కారు దొంగలకు చెక్ పెట్టవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మీ కారు ఇంజిన్ ను పనిచేయకుండా ఆపేయవచ్చు. ఈ ఆధునిక టెక్నాలజీ కారు దొంగలకు కొత్త సవాలుగా నిలుస్తుంది.
ముందుగా మీ కారుకు అనుకూలమైన జీపీఎస్ ట్రాకర్ ను ఇన్‌స్టాల్ చేయాలి. ఈ పరికరం మీ కారు ఎలక్ట్రికల్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇది కారు, అంతర్గత భద్రతా వ్యవస్థతో నేరుగా లింక్ అవుతుంది. మ్యాప్‌ల్స్ మొబైల్ యాప్ ద్వారా మీరు దీన్ని రిమోట్ గా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఈజీ సెటప్ తర్వాత, సిస్టమ్ ఉపయోగానికి సిద్ధంగా ఉంటుంది.
మీ మొబైల్ ఫోన్ లో మ్యాప్‌ల్స్ యాప్ ను తెరవండి. యాప్ లో ఇమ్మోబిలైజర్ ఫీచర్ ను వెతకండి. మీ పాస్ వర్డ్ లేదా ఓటీపీని నమోదు చేయాలి. వాహనాన్ని డిజేబుల్ చేయడానికి ఆర్డర్ నిర్ధారించండి. దీంతో ఇంజిన్ కు ఇంధన సరఫరాను వెంటనే నిలిచిపోతుంది.
ఆధునిక వాహనాలలో ఎలక్ట్రానిక్ ఇమ్మోబిలైజర్ సిస్టమ్ ఉంటుంది. మీ కారు కీ లోపల ఒక ప్రత్యేక ట్రాన్స్పాండర్ చిప్ ఉంటుంది. ఈ చిప్ కారు కంప్యూటర్ సిస్టమ్ కు ఒక ప్రత్యేక కోడ్ ను పంపుతుంది. ఈ కోడ్ ఆధారంగా మాత్రమే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కువ మందికి తెలియని ముఖ్యమైన ఒక భద్రతా ఫీచర్.
మ్యాప్‌ల్స్ జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల తయారీదారులతో సహకరిస్తుంది. ఇంజిన్ ను ఆపగల ట్రాకర్లు ఈ సేవకు అనుకూలంగా ఉంటాయి. ట్రాకర్ యాప్ కు పంపిన ఆదేశాలు కారు ఇమ్మోబిలైజర్ సిస్టమ్ కు అందజేయబడతాయి. ఈ సురక్షితమైన పద్ధతి అత్యంత ప్రభావవంతమైన భద్రతను అందిస్తుంది.
మీ కారు దొంగతనం చేయబడినా లేదా ఎవరైనా ప్రయత్నించినా యాప్ వెంటనే అలర్ట్ మెసేజ్ పంపుతుంది. మ్యాపింగ్ ఇంటర్ఫేస్ లో మీ కారు లైవ్ లొకేషన్ చూడవచ్చు. ఎవరైనా మీ వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో మీరు వేగంగా స్పందించవచ్చు. వాహనం దొంగతన జరగకముందే మీరు చర్య తీసుకోవచ్చు.
ఒక్కసారి ఆపేసిన కారుని తిరిగి ప్రారంభించడం చాలా సులభం. మ్యాప్‌ల్స్ యాప్ ను తెరిచి, సురక్షితంగా లాగిన్ అవ్వండి. ఇమ్మోబిలైజర్ కంట్రోల్స్‌కు తిరిగి వెళ్లండి. ఇంజిన్ ను రీ స్టార్ట్ బటన్ నొక్కండి. ఇప్పుడు మీ కారు మళ్లీ రన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.
ఈ వ్యవస్థ కారు ఓనర్లకు పూర్తి భద్రతా భావాన్ని ఇస్తుంది. మీరు మీ కారుని సుదూరంగా ఉంటూనే నియంత్రించగలరు. ట్రాకర్ ఇన్‌స్టాల్ చేయబడిన ఏ కారులో నైనా ఇది పనిచేస్తుంది. ఈ విధానం చాలా సులభమైనది, ప్రభావవంతమైనది.
Also Read: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు