Laptop Battery Tips: ల్యాప్‌టాప్ ఛార్జింగ్ విషయంలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్లో ఇదొకటి. ఛార్జర్‌కు కనెక్ట్ చేసినా బ్యాటరీ 80% లేదా 90% దగ్గరే ఆగిపోతుంది. ఎంతసేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచినా ఒక్క శాతం కూడా పెరగదు. దీంతో బ్యాటరీ పాడైందేమోనని కంగారు పడుతుంటారు. వెంటనే కొత్త బ్యాటరీ కొనాలా అనే సందేహం కూడా వస్తుంది. అయితే, ఇక్కడే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి సమస్య లేకపోయినా 100% ఛార్జ్ కాకపోవచ్చు. దీని వెనుక బ్యాటరీ లైఫ్‌ను కాపాడే ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉండొచ్చు. అసలు ఆ ఫీచర్ ఏంటి? మళ్లీ 100% ఛార్జింగ్ రావాలంటే ఏం చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో వస్తున్న యాపిల్ మ్యాక్‌బుక్స్, విండోస్ ల్యాప్‌టాప్స్‌లో ‘ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్’ లేదా ‘స్మార్ట్ ఛార్జింగ్’ అనే ఫీచర్లు ఉంటున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు ఎక్కువగా 100 శాతం ఛార్జ్ అవ్వడం వల్ల త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే ల్యాప్‌టాప్ సాఫ్ట్వేర్ మీ డైలీ వాడకాన్ని అర్థం చేసుకుని, ఛార్జింగ్‌ను కొంత శాతానికే పరిమితం చేస్తుంది. మీ ల్యాప్‌టాప్‌ను ఎప్పుడు ఫుల్ ఛార్జ్ చేయాలో అదే డిసైడ్ చేస్తుంది.
Also Read: వాట్సప్‌లో ఇప్పటివరకు రాని క్రేజీ ఫీచర్.. ఇది తెలిస్తే గాల్లో తేలిపోతారు!
మీకు అత్యవసరంగా 100 శాతం ఛార్జింగ్ కావాలనుకుంటే ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేయవచ్చు. మ్యాక్‌బుక్ వాడుతున్నట్లయితే సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఉన్న ‘ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్’ని ఆఫ్ చేసుకోవచ్చు. విండోస్ ల్యాప్‌టాప్‌లలో కూడా ‘పవర్ అండ్ బ్యాటరీ’ సెట్టింగ్స్ నుంచి లేదా సంబంధిత బ్రాండ్ యాప్ ద్వారా స్మార్ట్ ఛార్జింగ్‌ను ఈజీగా ఆపేయవచ్చు.
స్మార్ట్ ఛార్జింగ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ ఫుల్ కాకపోతే.. కొన్ని ప్రాథమిక తనిఖీలు చేయాలి. ముందుగా ల్యాప్‌టాప్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయండి. అడాప్టర్, ఛార్జింగ్ పోర్ట్ దెబ్బతిన్నాయేమో పరిశీలించండి. విండోస్ డివైజ్ మేనేజర్‌లోకి వెళ్లి ‘బ్యాటరీ డ్రైవర్లను’ అప్డేట్ చేయడం లేదా అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ రీస్టార్ట్ చేయడం ద్వారా చిన్న చిన్న సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దవచ్చు.
కొన్నిసార్లు బ్యాటరీని క్యాలిబ్రేట్ చేయడం వల్ల సమస్య తీరుతుంది. దీనికోసం ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి, ఆ తర్వాత బ్యాటరీ మొత్తం డ్రెయిన్ అయి ల్యాప్‌టాప్ ఆఫ్ అయ్యే వరకు వాడాలి. కొన్ని గంటల తర్వాత మళ్లీ అవాంతరం లేకుండా ఫుల్ ఛార్జ్ చేయాలి. ఇవన్నీ చేసినా ల్యాప్‌టాప్ త్వరగా డ్రెయిన్ అవ్వడం లేదా అకస్మాత్తుగా ఆఫ్ అయిపోతుంటే మాత్రం పాత బ్యాటరీ స్థానంలో కొత్తది మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి.
Also Read: అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!