E-Paper
Advertisement

Coffee Shop: కొండంచున కాఫీ షాపు.. అక్కడ హెల్మెట్ తప్పనిసరి, లేకపోతే..

Coffee Shop: కొండంచున కాఫీ షాపు.. అక్కడ హెల్మెట్ తప్పనిసరి, లేకపోతే..
Advertisement

Coffee Shop: చాలామంది చెప్పే సాధారణ అడ్వైస్ ఏమిటంటే.. రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్ పెట్టుకో అంటుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశంలో కమ్మటి కాఫీని ఆస్వాదించాలంటే మాత్రం కచ్చితంగా హెల్మెట్ ఉండాల్సిందే. ఎందుకంటే.. ఈ కాఫీ షాప్‌కు వెళ్లడం అనేది డేరింగ్ టూర్ లాంటిది. ఎంచక్కా కారు లేదా బైకు వేసుకుని వెళ్లి కాఫీ తాగి వచ్చేస్తా అంటే కుదరదు. నిజం చెప్పాలంటే.. ఈ దారి కాఫీ కోసం చేసే జర్నీలా అనిపించదు. ఏదో సాధించడానికి సాహసం చేస్తున్నట్లే ఉంటుంది.

సాహసానికి కేరాఫ్ ఈ కాఫీ షాప్:

చైనాలోని యాంగ్హువో కౌంటీలో ఉన్న ఈ వింతైన కాఫీ షాపుకు దారి పొడవునా.. ట్రెక్కింగ్‌లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇలా టాస్క్‌లు చేసుకుంటూ వస్తేనే కాఫీ ఇస్తాం అని షాపు నిర్వహుకులు ఏమీ చెప్పడం లేదు. ఆ కాఫీ షాపు ఉండటమే ఓ ఎత్తైన గుహలు, కొండల మధ్యన. కాబట్టి.. ఈ కాఫీ షాప్ సాహసానికి కేరాఫ్‌గా మారిపోయింది.

ఈ కాఫీ ప్రత్యేకత ఏమిటి?

Advertisement

యాంగ్హువో కౌంటీలో ఉన్న కాఫీ షాపుకు చేరుకోవడం అంతలా కష్టంగా ఉన్నా కూడా.. ప్రజలు ఎందుకు అక్కడికి వెళ్తున్నారనే సందేహం మీలో కూడా రావొచ్చు. ఎందుకంటే.. ఆ కాఫీని ఆస్వాదించడం అంత తేలిక కాదు అంటున్నారు నిర్వహకులు. ఈ జర్నీనే ‘ఎర్త్‌కోర్ ఎక్స్‌ప్లోరేషన్’ అని పిలుస్తారు. మొదట ఈ ప్రయాణం ఒక గుహ నుంచి మొదలవుతుంది. గుహ దాటితే కాఫీ షాప్ మనకు కనిపించదు. ముఖ్యంగా సాహసాలంటే ఇష్టపడే పర్యాటక ఔత్సాహికులకు ఈ కాఫీ షాప్‌ తెగ నచ్చుతుంది. ఎందుకంటే.. ఇక్కడకు చేరుకోవాలంటే.. అడుగడుగున ఓ సాహాసం చేయాల్సిందే.

అడుగడుగునా సాహసమే:

ఈ జర్నీలో ఎన్నో టాస్క్‌లు, ఎత్తులు, గుహలు ఔత్సాహికులను ఇబ్బందికి గురిచేస్తాయి. కాఫీ కోసం వెళ్తున్నామా లేదా కొండ ఎక్కడానికి ట్రెక్కింగ్‌ చేస్తున్నామా అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలగవచ్చు. అంతేకాదు.. ఈ గుహ దారి పొడవునా.. హెల్మెట్‌‌తో పాటు సురక్షితమైన బూట్లు తప్పనిసరి. గుహ గుండా గట్లు, చాలా ఇరుగ్గా ఉన్న మార్గాలు, లోతైన ప్రదేశాలు ఉంటాయి. కొన్నిచోట్ల అయితే తాడు పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మరికొన్ని చోట్ల.. భయంకరమైన చీకటి అలుముకుంటుంది. అయినా సరే టార్చ్ సాయంతో వంతెనలు ఎక్కాల్సి ఉంటుంది. ఇన్ని సాహసాలు చేశాకే.. కాఫీ కేఫ్‌కి చేరుకోగలరు.

ఆహ్లాదకరమైన వాతావరణం:

Advertisement

ఈ ప్రయాణంలో ఎదురైన అన్ని అడ్డంకులను దాటుకుంటూ.. కాఫీ షాపుకు చేరుకున్నాక.. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తుంది. సున్నపురాయి నిర్మాణాలు, మంచులా కనిపిం పైకప్పులు, పాలరాతి వెలుతురులా ఉండే ఆ లైటింగ్‌తో మరో ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతిని పొందవచ్చట. ఆ అందాలను ఆస్వాదించడానికి కాఫీ షాప్ నిర్వహకులు కూర్చోడానికి అన్ని సెటప్‌‌లు చేసి ఉంటారట. భూగర్భ శాస్త్రాన్ని కాఫీ సంస్కృతితో కలుపుతున్నట్లుగా ఉంటుందట అక్కడి వాతావరణం.

ఆ కిక్కే వేరబ్బా..

మామూలు కాఫీ తాగేస్తే మజా ఏముంటుంది చెప్పండి.. ఇలా కాఫీ కోసం ఎంతో శ్రమపడి వెళ్లి హాయిగా కాఫీలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తేనే అసలైన మజా. కప్పు కాఫీ కోసం డేరింగ్‌ ఫీట్లు చేసుకుంటూ వెళ్లి, కాఫీ తాగడంలోని కిక్కే వేరబ్బా అంటారు పర్యాటక ఔత్సాహికులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మీరూ చూసేయండి మరి..

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×