E-Paper
Advertisement

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!
Advertisement

Rapido Pink Bike: హైదరాబాద్‌లో రోజూ కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు, ఆఫీసులకు వెళ్లే మహిళలు ఎదుర్కొనే పెద్ద సమస్యల్లో రవాణా ఒకటి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బైక్ టాక్సీల్లో వెళ్లాలంటే ఎంతో కొంత భయం ఉండటం సహజం. ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ రాపిడో ఒక మంచి ఆలోచనతో మన ముందుకొచ్చింది. అదే ‘పింక్ బైక్’ సర్వీస్. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఈ సేవలు.. నగర మహిళలకు ఎంతో ఊరటనివ్వడమే కాకుండా, స్వతంత్రంగా సంపాదించుకునే ఒక చక్కటి అవకాశాన్ని కూడా అందిస్తున్నాయి.

సురక్షితమైన ప్రయాణం..

మహిళల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఈ పింక్ బైక్ సేవలను ప్రారంభించారు. దీనిలో ప్రయాణించే ప్యాసింజర్ మాత్రమే కాదు.. బైక్ నడిపే కెప్టెన్ కూడా మహిళే అయి ఉంటారు. ముఖ్యంగా లేట్ నైట్ డ్యూటీలు ముగించుకుని ఇంటికి తిరిగొచ్చే ఉద్యోగినులకు, రాత్రి వేళల్లో ప్రయాణించే యువతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

Advertisement

Also Read: 90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

స్వేచ్ఛగా సంపాదన..

ఈ సర్వీస్ కేవలం ప్రయాణానికే పరిమితం కాలేదు. సొంతంగా నిలబడాలనుకునే మహిళలకు మంచి ఉపాధి మార్గంగా మారింది. దీనికోసం ప్రత్యేకంగా ఖచ్చితమైన పని గంటలు లేదా లాగిన్ నిబంధనలు ఏమీ లేవు. మహిళలు తమ వీలును బట్టి, ఖాళీగా ఉన్న సమయంలో రైడ్స్ చేసుకోవచ్చు. గృహిణులు, పార్ట్ టైమ్ వర్క్ వెతుక్కునే విద్యార్థినులకు తమ రోజువారీ పనులకు భంగం కలగకుండా ఆదాయం పొందేందుకు ఇది సరైన వేదిక.

మంచి ఆదాయం..

Advertisement

పింక్ బైక్ కెప్టెన్లుగా మారే మహిళలకు రాపిడో మంచి వేతనాన్ని అందిస్తోంది. రోజుకు రెండు గంటలు కేటాయిస్తే సుమారు రూ.400, నాలుగు గంటలు పనిచేస్తే రూ.800 వరకు సంపాదించుకోవచ్చని సంస్థ చెబుతోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇందులో రాపిడో ఎలాంటి కమిషన్ తీసుకోదు. అంటే.. కెప్టెన్లకు వచ్చే పూర్తి ఆదాయం వారికే దక్కుతుంది. ఇది మహిళలకు ఎంతో ప్రోత్సాహకరమైన విషయం.

ప్రత్యేక ఆఫర్లు..

ఆదాయంతో పాటు కొత్తగా చేరే మహిళా కెప్టెన్ల కోసం కంపెనీ పలు రకాల ఇన్సెంటివ్‌లను కూడా ప్రకటించింది. ప్రారంభంలో చేరిన వారికి రూ.5,000 వరకు జాయినింగ్ బోనస్ లభిస్తుంది. ఇవే కాకుండా రోజువారీ, వారపు టార్గెట్లపై అదనపు బోనస్‌లు కూడా ఉంటాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే మహిళలు ‘రాపిడో కెప్టెన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. భద్రతతో పాటు ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చే ఈ పింక్ బైక్స్ నిజంగా నగర మహిళలకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

Also Read: వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

Tags

Related News

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

Big Stories

Advertisement
×