Apple AirPods 5: టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయంటే.. టెక్ ప్రియుల్లో పట్టలేని సంతోషం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘యాపిల్ ఎయిర్‌పాడ్స్ 5’ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వాళ్లకోసం కంపెనీ ఈసారి చాలా మార్పులు చేసింది. ముఖ్యంగా ఇందులో ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. సామాన్యులు కూడా కొనగలిగేలా తక్కువ ధరకే ఈ కొత్త ఎయిర్‌పాడ్స్ తీసుకొచ్చింది.
ఈ కొత్త ఎయిర్‌పాడ్స్ రెండు రకాల్లో మార్కెట్లోకి వచ్చాయి. బేసిక్ మోడల్ ఎయిర్‌పాడ్స్ ధర రూ.14,900 కాగా, వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌తో వచ్చే మోడల్ ధర రూ.17,900గా నిర్ణయించారు. రోజూ వాడే వాళ్లకు బేసిక్ మోడల్ చాలు. ఒకవేళ మరింత సౌకర్యం, వైర్‌లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే రెండో ఆప్షన్ను ఎంచుకోవచ్చు. దీని ప్రీ-ఆర్డర్లు కూడా మొదలైపోయాయి. సెప్టెంబర్ 18 నుంచి స్టోర్లలో ఇవి నేరుగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
Also Read: యాపిల్ బిజినెస్ స్ట్రాటజీ.. iPhone 18 రాకతో పాత ఫోన్ల రేట్లను రూ.65,000 వరకు పెంచేసింది!
గతంలో వచ్చిన మోడల్‌తో పోలిస్తే.. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ సుమారు 50 శాతం వరకు మెరుగుపడింది. అంటే బయట ఎంత రద్దీగా ఉన్నా, మన చుట్టూ ఉన్న శబ్దాలు పెద్దగా వినిపించవు. కొత్త అకౌస్టిక్ సెటప్ వల్ల పాటలు చాలా స్పష్టంగా, రిచ్‌గా వినిపిస్తాయి. అలాగే కాల్ మాట్లాడుతుంటే ఆటోమేటిక్‌గా సౌండ్ తగ్గే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈసారి ఎయిర్‌పాడ్స్ 5 లో పెద్ద హైలైట్ ఏంటంటే.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు. Siriని మరింత స్మార్ట్ చేశారు. మనం తల ఊపడం ద్వారానే కాల్స్ కట్ చేయడం లేదా లిఫ్ట్ చేయడం లాంటివి చేయవచ్చు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్. దీని ద్వారా వేరే భాషల్లో మాట్లాడే వాళ్లతో మనం రియల్ టైమ్‌లో ఈజీగా మాట్లాడవచ్చు. మన ఇయర్‌బడ్స్ ద్వారానే భాషలు అర్థం చేసుకోవడం చాలా సులభమైపోయింది.
బ్యాటరీ విషయానికి వస్తే ఒకసారి ఛార్జ్ చేస్తే ANC ఆన్‌లో ఉంటూ దాదాపు 5 గంటల పాటు నిరంతరం వాడొచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి అయితే ఏకంగా 22 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక ఈ డివైజ్ తయారీలో పర్యావరణానికి హాని జరగకుండా రీసైకిల్ చేసిన మెటీరియల్స్ ఎక్కువగా వాడారు. దుమ్ము, చెమట, నీటి నుంచి రక్షణ ఉండేలా దీన్ని చాలా గట్టిగా తయారు చేశారు.
Also Read: iPhone 18 Pro వచ్చేసింది భయ్యా.. ఏకంగా 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో యాపిల్ సంచలనం!