E-Paper
Advertisement

AirPods Pro Camera: చెవిలో కెమెరా.. ఎయిర్‌పాడ్స్ ప్రోలో షాకింగ్ ఫీచర్ తీసుకురానున్న ఆపిల్

AirPods Pro Camera: చెవిలో కెమెరా.. ఎయిర్‌పాడ్స్ ప్రోలో షాకింగ్ ఫీచర్ తీసుకురానున్న ఆపిల్
Advertisement

AirPods Pro Camera| ఈ ఏడాది అంటే 2026 చివర్లో Apple కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో లాంచ్ చేయవచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ మోడల్‌లో ఎవరూ ఊహించని పెద్ద మార్పు ఉంటుంది. వీటి లోపల ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉండవచ్చు. ఇది ఇప్పటివరకు వచ్చిన ఏ ఎయిర్‌పాడ్స్ మోడల్ లోని లేని అత్యంత స్మార్ట్ ఫీచర్. బయటి డిజైన్ మాత్రం ప్రస్తుత మోడల్‌లాగే ఉంటుంది. కానీ లోపల హార్డ్‌వేర్‌లో కెమెరా సెన్సార్లు చేర్చి ముఖ్య మార్పులు చేస్తారు.

కెమెరాలు ఫోటోలు తీయవు

ఈ కెమెరాలు.. స్మార్ట్‌ఫోన్ కెమెరాలాగా ఫోటోలు తీయడానికి లేదా వీడియో రికార్డ్ చేయడానికి కాదు. ఇవి చుట్టూ ఉన్న పరిసరాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. దగ్గర్లో ఉన్న వస్తువులు, మూవ్‌మెంట్స్, దూరాలను గుర్తిస్తాయి. దీంతో స్పేషియల్ ఆడియో, అడాప్టివ్ నాయిస్ కంట్రోల్ ఫీచర్లు మరింత మెరుగవుతాయి. భవిష్యత్తులో Apple Intelligence, AI ఫీచర్లకు కూడా ఉపయోగపడతాయి.

Apple డివైస్‌లతో మరింత మెరుగైన ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఈ కెమెరా డేటా.. iPhone కెమెరా, ఆపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్‌లతో ఇంటిగ్రేట్ అవుతుంది. దీంతో మరింత స్మార్ట్, కాంటెక్స్ట్-అవేర్ ఫీచర్లు వస్తాయి. ఉదాహరణకు.. చుట్టూ ఉన్న పరిసరాల ఆధారంగా సౌండ్ అడ్జస్ట్ అవుతుంది. హెడ్ మూవ్‌మెంట్స్ ఆధారంగా ఆడియో మారుతుంది. గేమ్స్, వీడియోల్లో ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కాల్స్, వాయిస్ కమాండ్స్‌లో కూడా స్మార్ట్ రెస్పాన్స్ ఇస్తుంది.

ఫాస్ట్ అప్‌డేట్ సైకిల్ లీక్

ప్రసిద్ధ టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్, లీకర్ Kosutami ఈ కెమెరా ఫీచర్ గురించి తొలిసారి సమాచారం ఇచ్చారు. “ఎయిర్‌పాడ్స్ చుట్టూ ప్రపంచాన్ని చూస్తాయి” అని పోస్ట్ చేశారు. ఇది కెమెరా ఇంటిగ్రేషన్‌ను స్పష్టంగా సూచిస్తోంది. Apple సాధారణంగా ఎయిర్‌పాడ్స్ ప్రోను మూడేళ్లకు ఒకసారి అప్‌డేట్ చేస్తుంది. కానీ ఈసారి అంతకంటే త్వరగా లాంచ్ చేయవచ్చు.

అనలిస్ట్, పేటెంట్‌లు కూడా సపోర్ట్ 

Advertisement

జూన్ 2024లో అనలిస్ట్ Ming-Chi Kuo కూడా ఎయిర్‌పాడ్స్‌లో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉండవచ్చని చెప్పారు. ఇవి స్పేషియల్ ఆడియోను మెరుగుపరుస్తాయని అన్నారు. జులై 2025లో ఆపిల్‌కు కెమెరా-ఆధారిక వేరబుల్ డివైస్‌లపై పేటెంట్ వచ్చింది. దగ్గర్లో ఉన్న వస్తువులను గుర్తించడానికి కెమెరాలు ఎలా ఉపయోగపడతాయో వివరించింది. ఇది కెమెరా ఫీచర్ రావడానికి బలమైన సూచన.

ధర మారకపోవచ్చు

లీక్స్ ప్రకారం.. ధర ప్రస్తుత ఎయిర్‌పాడ్స్ ప్రోతో దాదాపు సమానంగా ఉండవచ్చు. ఇండియాలో ప్రస్తుత మోడల్ ధర సుమారు రూ.25,900. కొత్త టెక్నాలజీ వచ్చినా ధర పెంచకపోవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న యూజర్లకు అప్‌గ్రేడ్ చేయడానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

Also Read: మనుషుల కంటే వేగంగా పరుగులు తీసే రోబో.. ఒక్క సెకనులో 10 మీటర్ల స్పీడ్

రెండు మోడల్స్ రావొచ్చు

ఈసారి రెండు రకాల ఎయిర్‌పాడ్స్ ప్రో వేరియంట్స్ రావచ్చు. రెండూ బయటి నుంచి ఒకేలా కనిపిస్తాయి. కానీ ఫీచర్లలో తేడా ఉంటుంది. ఒకటి ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో ప్రీమియం వేరియంట్ కావచ్చు. మరొకటి సాధారణ ఫీచర్లతో చవక ధరలో ఉండవచ్చు.

ఒకవేళ ఈ లీక్స్ నిజమైతే ఎయిర్‌పాడ్స్ ప్రో కేవలం ఆడియో డివైస్‌లు మాత్రమే కాకుండా స్మార్ట్ సెన్సార్‌లుగా మారతాయి. Apple ఎకోసిస్టమ్‌లో మరింత స్మార్ట్ ఫీచర్లు వస్తాయి. పర్సనల్ ఆడియో, గేమింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాలు మెరుగవుతాయి. ఇంటెలిజెంట్, అడాప్టివ్ లిజెనింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అధికారిక ప్రకటన తర్వాతే ఫైనల్ ఫీచర్లు తెలుస్తాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×