IND VS BAN: భారత క్రికెట్ నియంత్రణ మండలిపై ( Board of Control for Cricket in India ) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. బీసీసీఐ డబ్బులకు కక్కుర్తి పడిందని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హిందువులపై బంగ్లాదేశ్ టూర్ కు టీమిండియాలో పంపించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2025 సంవత్సరంలో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Team India vs Bangladesh) మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టోర్నమెంట్ రద్దయింది. అయితే ఈ సంవత్సరం గతంలో రద్దయిన టోర్నమెంటును నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కు టీమ్ ఇండియాను పంపించకూడదని కోరుతున్నారు.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Team India vs Bangladesh) మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ లో టి20లతో పాటు వన్డేలు జరగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ ఒకటవ తేదీన వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుందట. సెప్టెంబర్ ఒకటో తేదీన మొదటి వన్డే, సెప్టెంబర్ మూడవ తేదీన రెండవ వన్డే, ఆరవ తేదీన మూడవ వన్డే జరిగేలా షెడ్యూల్ కూడా ఖరారు అయిందట. ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత రెండు జట్ల మధ్య మూడు టి20 లు కూడా జరగనున్నాయట. సెప్టెంబర్ 9వ తేదీన మొదటి టీ20, 12వ తేదీన రెండవది, 13వ తేదీన మూడవ టి20 నిర్వహించనున్నారు. అంటే బంగ్లాదేశ్ తో ( Bangladesh) జరిగే 3 వన్డేలకు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగిపోతున్నారన్నమాట. ఇక్కడి వరకు అంతా బాగున్నప్పటికీ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మన టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి దేశంలో ఇండియా పర్యటించడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు. వెంటనే ఈ టోర్నమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇటీవల జరిగిన మినీ వేలం లో బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ ను ( Mustafizur Rahman) కేకేఆర్ జట్టు ( KKR Team) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 9.20 కోట్లు పెట్టి మరీ అతన్ని కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ లో ఆడించకూడదని ఇండియన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అలాంటి వ్యక్తిని కొనుగోలు చేసిన షారుక్ ఖాన్ ను ( Sharukh khan) దేశద్రోహి అంటూ ఫైర్ అవుతున్నారు.
भारतीय क्रिकेट टीम अगस्त-सितंबर में बांग्लादेश का दौरा करेगी। टूर का शेड्यूल कुछ इस तरह है👇
1st ODI – 1st September.
2nd ODI – 3rd September.
3rd ODI – 6th September.1st T20i – 9th September.
2nd T20i – 12th September.
3rd T20i – 13th September. pic.twitter.com/rnkH9mPs7h— Manraj Meena (@ManrajM7) January 2, 2026