iPhone Duo: యాపిల్ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ గురించి టెక్ ప్రియుల్లో ఎప్పటినుంచో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ ఫోన్‌ను iPhone Ultra అని పిలుస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ ప్రీమియం ఫోల్డబుల్ డివైజ్‌కి యాపిల్ iPhone Duo అనే పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త పేరు వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు Ultra కంటే Duo అనే పేరే సెట్ అవుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా యాపిల్ తమ ఉత్పత్తులకు Pro, Max, Air వంటి చిన్న పేర్లను ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఈ ఫోల్డబుల్ ఫోన్ రెండు స్క్రీన్లతో రాబోతోంది. మడతపెట్టినప్పుడు చిన్న స్క్రీన్, విప్పినప్పుడు పెద్ద స్క్రీన్ అనుభూతిని ఇస్తుంది. ఈ రెండు స్క్రీన్ల అనుభవానికి ‘డ్యూయో’ అనే పేరు సరిపోతుందనేది ప్రధాన ఆలోచన.
Also Read: 13.3 అంగుళాల భారీ డిస్‌ప్లే.. 3 నానోమీటర్ చిప్.. షియోమీ కొత్త టాబ్లెట్ ఫీచర్లు ఇవే!
సాధారణంగా యాపిల్ Ultra పేరును అత్యుత్తమ ఫీచర్లు ఉన్న డివైజ్‌లకే వాడుతుంది. కానీ రాబోయే ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఫేస్ ఐడీ, టెలిఫోటో కెమెరా వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫీచర్లు లేనప్పుడు దానికి Ultra అని పేరు పెట్టడం సరికాదని, అందుకే యాపిల్ ఈ పేరును పక్కన పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
యాపిల్‌కి ‘డ్యూయో’ అనే పేరు కొత్తేమీ కాదు. గతంలో పవర్ బుక్ డ్యూయో, మేగ్ సేఫ్ డ్యూయో వంటి ఉత్పత్తులకు ఈ పేరును ఇప్పటికే ఉపయోగించింది. కాబట్టి తమ మొదటి ఫోల్డబుల్ ఫోన్‌కు కూడా ఇదే పేరును ఖరారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం అల్ట్రా లేదా ఫోల్డ్ అని పిలవడం కంటే డ్యూయో అని పిలిస్తే వినియోగదారులకు సరికొత్తగా, ప్రత్యేకంగా అనిపిస్తుందని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న లీకులు, రూమర్లు మాత్రమే. కంపెనీ ఇప్పటివరకు ఈ పేరుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యాపిల్ అంతర్గతంగా Ultra అనే పేరునే పరిశీలిస్తోందని కొందరు అంటుంటే.. ఈ లీకులు మాత్రం Duo వైపు మొగ్గు చూపుతున్నాయి. సెప్టెంబర్ 9న జరగబోయే ఈవెంట్‌లో యాపిల్ ఈ సస్పెన్స్‌కు తెరదించే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ కొత్త పేరు టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేపుతూనే ఉంటుంది.
Also Read: పాత క్లాసిక్ డిజైన్‌కు బ్లూటూత్ 6.0 పవర్.. సోనీ లవర్స్ అయితే ఈ పిక్స్ చూడాల్సిందే!