Vivo V40e 5G Price Cut: స్మార్ట్‌ఫోన్ యూజర్లలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వివో V40e 5G ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తోంది. పవర్‌ఫుల్ ఫీచర్లు ఉండి, బడ్జెట్ మాత్రం కాస్త అటూఇటూగా ఉండాలనుకుంటున్న వారి కోసం ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అసలు ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు ధర కాస్త ఎక్కువే ఉన్నా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో దీని రేటు బాగా తగ్గింది. ఇప్పుడీ Vivo V40e 5Gపై ఎంత డిస్కౌంట్ ఉంది? దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలు తెలుసుకుందాం.
Vivo V40e 5G మార్కెట్లోకి వచ్చిన కొత్తలో రూ.28,999 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కేవలం రూ.24,991కే లిస్ట్ అయింది. అంటే ఎలాంటి కూపన్లు లేకుండానే నేరుగా రూ.4,000 వరకు ఆదా అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం మరో రూ.1,250 వరకు అదనంగా తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్లతో కలిపి చూస్తే ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే వస్తుంది. క్రెడిట్ కార్డు లేనివాళ్లు ఈఎంఐ ఆప్షన్‌ని కూడా ఎంచుకోవచ్చు. నెలకు రూ.8,553 చెల్లించేలా ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!
ఈ Vivo V40e 5G చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలో 6.77 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా తడి చేతులతో ఫోన్ ముట్టుకున్నా స్క్రీన్ రెస్పాండ్ అయ్యేలా మంచి ఫీచర్ కూడా ఉంది. ఇక లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్ ఇచ్చారు. రోజూవారీ యాప్స్ వాడటానికి, వీడియోలు చూడటానికి, మల్టీటాస్కింగ్ చేయడానికి ఈ ఫోన్ ఏ మాత్రం లాగ్ అవ్వకుండా చక్కగా పనిచేస్తుంది.
ఫొగెలు బాగా తీసేవాళ్లకు ఈ వివో ఫోన్ చాలా నచ్చుతుంది. వెనకవైపు 50MP సోనీ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. దీనివల్ల చేతులు వణికినా ఫొటోలు బ్లర్ కాకుండా స్పష్టంగా వస్తాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు కూడా 50MP కెమెరానే ఇచ్చారు. మరో విశేషం ఏంటంటే ముందు వెనకా రెండు వైపులా 4K వీడియోలు రికార్డు చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5500mAh బ్యాటరీ ఉంది. దీనికి తోడు 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటంతో నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది.
మొత్తానికి.. రూ.30,000 లోపు ప్రీమియం లుక్ ఇచ్చే కర్వ్‌డ్ డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరాలు, రోజంతా వచ్చే బ్యాటరీ కావాలనుకునే వాళ్లకు ఈ Vivo V40e 5G మంచి ఆప్షన్. చిన్నపాటి వాటర్ స్లాష్‌లు, దుమ్ము నుంచి కాపాడుకోవడానికి IP64 రేటింగ్ కూడా దీనికి ఉంది. కేవలం 183 గ్రాముల బరువుతో చేతిలో తేలికగా అనిపిస్తుంది. ఆన్‌లైన్ ధరలు అప్పుడప్పుడు మారుతుంటాయి కాబట్టి.. ఆర్డర్ చేసే ముందు స్టాక్, ఆఫర్ల వివరాలను ఒక్కసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.
Also Read: బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!