E-Paper
Advertisement

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!
Advertisement

Apple Foldable Phone: యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo కోసం ఎదురుచూస్తున్న వారికి మరో షాక్ తగిలేలా ఉంది. అక్టోబర్ 23న ఈ ఫోన్ అమ్మకాలు మొదలుకానుండగా.. ముందుగా బుకింగ్ చేసుకోని వారికి స్టోర్లలో ఫోన్ దొరకకపోవచ్చని ఓ నివేదిక చెబుతోంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్ సమయంలో ఫోన్ బుక్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న కస్టమర్లకు ఈ వార్త నిరాశ కలిగిస్తోంది.

వాక్-ఇన్ కొనుగోళ్లకు బ్రేక్?

MacRumors నివేదిక ప్రకారం.. అక్టోబర్ 23న యాపిల్ స్టోర్లకు వచ్చే కస్టమర్లకు ముందస్తు బుకింగ్ లేకుండా iPhone Duo కొనడం కుదరదని సిబ్బంది చెప్పాలని కంపెనీ సూచించినట్లు సమాచారం. లాంచ్ రోజున నేరుగా వచ్చి ఫోన్ కొనాలనుకునే వారికి స్టాక్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అందుకే ముందుగా బుక్ చేసుకోని వారు కొనుగోలు కోసం స్టోర్లకు రావద్దని సిబ్బంది సూచించనున్నట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

Also Read: రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బుకింగ్ చేసినా ఆలస్యమే..

ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16న ప్రారంభమయ్యాయి. అయితే చాలామందికి వెంటనే డెలివరీ తేదీ దొరకలేదు. కొందరికి నవంబర్‌లో డెలివరీ చూపించగా, మరికొందరి ఆర్డర్లు 2027 జనవరి వరకు వాయిదా పడ్డాయి. ఇప్పటికే బుక్ చేసుకున్నవారు కూడా తమ ఫోన్ ఎప్పుడు చేతికి వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 24 నుంచి స్టోర్ పికప్ అవకాశాలను చెక్ చేసుకోవాలని కొందరు కస్టమర్లకు సూచించినట్లు సమాచారం.

భారత్‌లో పరిస్థితి ఏంటి?

Advertisement

భారత్‌లో ప్రస్తుతం బుకింగ్ చేసుకునేవారికి జనవరి 23, 2027న డెలివరీ ఉంటుందని కథనంలో పేర్కొన్నారు. మరోవైపు, క్రోమా వంటి రిటైలర్లు 256GB మోడల్‌కు అక్టోబర్ 29 డెలివరీని అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ తేదీలు స్టాక్, అందుబాటును బట్టి మారవచ్చు. కాబట్టి.. కొనుగోలు చేసే ముందు అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత రిటైలర్ వద్ద వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఉత్పత్తిలో సమస్యలే కారణమా?

యాపిల్ కఠినమైన నాణ్యత ప్రమాణాల కారణంగా ఫోన్ తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని గత నివేదికలు తెలిపాయి. సెప్టెంబర్ మధ్యలో ఫైనల్ అసెంబ్లీ సమయంలో తయారైన ఫోన్లలో 60 శాతానికి కొద్దిగా ఎక్కువ మాత్రమే నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణమైనట్లు సమాచారం. ఫోల్డబుల్ ఫోన్ తయారీ యాపిల్ సరఫరాదారులకు కొత్త కావడంతో ఈ సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. అయితే లాంచ్ రోజున స్టాక్‌పై కంపెనీ నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

Tags

Related News

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..

Big Stories

Advertisement
×