Apple Surprise and Shine: అమెరికా యాపిల్ దిగ్గజం యాపిల్.. ప్రతిఏటా సెప్టెంబర్ నెల వస్తే చాలు టెక్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటుంది. ఈసారి కూడా Apple Surprise and Shine పేరుతో భారీ ఈవెంట్‌కు రెడీ అయిపోయింది. యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 9న యాపిల్ పార్క్‌లో జరగనున్న ఈవెంట్‌లో కొత్త ఐఫోన్లతో పాటు మన ఇంటిని మరింత స్మార్ట్‌గా మార్చే హోమ్‌పాడ్స్, యాపిల్ టీవీ 4కే వంటి పరికరాలు రాబోతున్నట్లు సమాచారం.
సాధారణంగా ప్రతి ఏడాదీ బేసిక్ ఐఫోన్ మోడల్స్ లాంచ్ చేయడం యాపిల్‌కు అలవాటు. కానీ ఈసారి కంపెనీ ఒక కొత్త దారిలో వెళ్తోంది. ఈ కార్యక్రమంలో కేవలం iPhone 18 Pro సిరీస్‌తో పాటు, సరికొత్త iPhone Ultraను పరిచయం చేయబోతున్నారు. వీటితో పాటే యాపిల్ నుంచి వస్తున్న తొలి బుక్‌స్టైల్ Foldable iPhone కూడా ఈ వేదికపై మెరవబోతోంది. అయితే సాధారణ ఐఫోన్ 18 మోడల్స్ కోసం మాత్రం అభిమానులు వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు.
Also Read: బోస్ సౌండ్‌తో నోయిస్ ప్రీమియం ఇయర్‌ఫోన్స్.. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!
ఐఫోన్ల సంగతి పక్కన పెడితే.. ఈసారి ప్రధాన ఆకర్షణగా స్మార్ట్ హోమ్ డివైజ్‌లు నిలవనున్నాయి. 7 అంగుళాల డిస్ప్లేతో సరికొత్త HomePod Touch మార్కెట్లోకి రాబోతోంది. దీంతో పాటు చిన్నగా, ముద్దుగా ఉండే HomePod mini 2ను వేగవంతమైన ప్రాసెసర్, సూపర్ సౌండ్ క్వాలిటీ, సిరి ఏఐ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీనివల్ల మన ఇంట్లో పాటలు వినడం, స్మార్ట్ పరికరాలను నియంత్రించడం మరింత తేలికవుతుంది.
అలాగే టీవీ చూసే అనుభవాన్ని మార్చేందుకు నెక్స్ట్ జనరేషన్ Apple TV 4Kను కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో శక్తివంతమైన చిప్‌సెట్‌తో పాటు సిరి ఏఐ సపోర్ట్ ఇచ్చే కొత్త రిమోట్ ఉండనుంది. ఇక యాపిల్ హంగామా ఇక్కడితో ఆగదు. అక్టోబర్ నెలలో కూడా టచ్ స్క్రీన్‌తో వస్తున్న MacBook Ultra, M6 చిప్‌తో కొత్త MacBook Pro, iPad OLED మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు వేస్తోంది.
సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో Apple Watch Series 12, Apple Watch Ultra 4, AirPods 5 కూడా మెరవనున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో ఆకట్టుకునే యీపిల్.. ఈసారి కూడా స్మార్ట్ ఫోన్ల నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు ఒకే వేదికపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరచడానికి సిద్ధమైంది. మరి ఈ సరికొత్త డివైజ్‌లు టెక్ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి మరి.
Also Read: వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?