E-Paper
Advertisement

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!
Advertisement

Longest National Highway In India: దేశంలో రోడ్డు మార్గం ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించడం చాలా కామన్. దేశంలోని ప్రధాన నగరాలు, రాష్ట్రాలను కలుపుతూ బోలెడు జాతీయ రహదారులు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన రహదారుల్లో జాతీయ రహదారి 44 ఒకటి. ఇది దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిగా గుర్తింపు పొందింది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఈ రహదారి విస్తరించి ఉంది.

శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు

NH-44 ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి ప్రారంభమై, దేశానికి దక్షిణ చివరన ఉన్న తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగుతుంది. అంటే దేశంలోని దాదాపు ఒక చివర నుంచి మరో చివర వరకు ప్రయాణించేలా ఈ జాతీయ రహదారి ఏర్పాటైంది. ఈ రహదారి ద్వారా ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు కీలక ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ లభిస్తోంది. సుదూర ప్రయాణాలు, సరకు రవాణా, వాణిజ్య కార్యకలాపాల్లో కూడా NH-44 కీలక పాత్ర పోషిస్తోంది.

11 రాష్ట్రాల మీదుగా ప్రయాణం

Advertisement

NH-44 మొత్తం పొడవు దాదాపు 4,112 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత దూరాన్ని కలుపుతూ ఉండటంతో NH-44 దేశంలోని అత్యంత కీలకమైన రహదారి మార్గాల్లో ఒకటిగా నిలిచింది. ఒకే జాతీయ రహదారి ద్వారా ఇన్ని ప్రాంతాలు అనుసంధానం కావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. NH-44 ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. ఇది మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా సాగుతుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభమయ్యే ఈ మార్గం పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా తమిళనాడుకు చేరుతుంది. ఈ మార్గంలో దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు అనుసంధానమవుతాయి. అందుకే రవాణా పరంగా కూడా ఈ రహదారికి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది.

ఒకప్పుడు NH-7గా ఉన్నా..  

ప్రస్తుతం మనకు NH-44గా తెలిసిన ఈ రహదారికి గతంలో NH-7 ఉండేది. జాతీయ రహదారుల సంఖ్యలను మార్చిన తర్వాత పలు పాత రహదారులను కలిపి ప్రస్తుత NH-44 రూపుదిద్దుకుంది. ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించిన NH-44 భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మంచు పర్వత ప్రాంతాల నుంచి మైదానాలు, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం వరకు ఈ రహదారి ప్రయాణిస్తుంది. అందుకే NH-44 కేవలం ఒక పొడవైన రహదారి మాత్రమే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాలను రవాణా పరంగా కలిపే ముఖ్యమైన జాతీయ మార్గంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది.

Advertisement

Read Also: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!

Tags

Related News

భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!

రైళ్లలో ఇక చెత్తబుట్టలు నిండిపోవు.. ఇండియన్ రైల్వే సూపర్ ప్లాన్!

వర్షాల దెబ్బకు కుంగిన రైల్వే ట్రాక్.. ఏకంగా 14 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

Big Stories

Advertisement
×