E-Paper
Advertisement

iPhone 17 Cheaper Model: ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత లో బడ్జెట్ ఫోన్ త్వరలోనే విడుదల.. ఫీచర్లు ఇవే

iPhone 17 Cheaper Model: ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత లో బడ్జెట్ ఫోన్ త్వరలోనే విడుదల.. ఫీచర్లు ఇవే
Advertisement

iPhone 17 Cheaper Model| టెక్ దిగ్గజం ఆపిల్ 2025లో విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ ఈ సిరిస్‌లో మరో తక్కువ బడ్జెట్ మోడల్‌ని త్వరలోనే లాంచ్ చేయనుంది. దాని పేరు ఐఫోన్ 17e. 2026 సంవత్సరం ప్రారంభంలోనే మార్కెట్‌లోకి రావచ్చు. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ప్రీమియం ఫీచర్స్ ఇవ్వాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఇటీవలే లీక్ అయ్యాయి.

డిస్‌ప్లే ఎలా ఉంటుంది?

ఐఫోన్ 17eలో LTPS OLED డిస్‌ప్లే ఉంటుంది. ఐఫోన్ 16e లాగానే ఉంటుంది.. కానీ బెజెల్స్ (సైడ్ ఫ్రేమ్) చాలా సన్నగా ఉంటాయి. అంటే స్క్రీన్ పెద్దగా, అందంగా కనిపిస్తుంది. ఈ డిస్‌ప్లేని చైనా కంపెనీ BOE సప్లై చేయనుంది. మొదటి బ్యాచ్‌లో 80 లక్షల ఫోన్లు తయారు చేయాలని టార్గెట్.

ప్రాసెసర్ పవర్‌

Advertisement

లోపల బ్రాండ్ న్యూ A19 చిప్ ఉంటుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. రోజువారీ పనులు, గేమ్స్, ఫోటో ఎడిటింగ్.. లాంటి అన్ని టాస్కులు సూప్‌స్పీడ్‌లో జరుగుతాయి. కొత్త iOS ఫీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తాయి.

కెమెరా ఎలా ఉంటుంది?

వెనుకవైపు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతో ఫోటోలు అద్భుతంగా వస్తాయి. సెల్ఫీలకు 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. వీడియో కాల్స్, పోర్ట్రెయిట్ ఫోటోలు చాలా బాగుంటాయి.

డిజైన్‌లో ఏం కొత్తగా ఉంటుంది?

Advertisement

ఐఫోన్ 16eతో పోలిస్తే.. పాత నాచ్ (ముందు గీత) పూర్తిగా పోతుంది. బదులుగా డైనమిక్ ఐల్యాండ్ వస్తుంది. దీని వల్ల నోటిఫికేషన్స్ చూడటం, కంట్రోల్ చేయడం సులువు. రెస్పాన్సివ్ నోటిఫికేషన్స్, లైవ్ యాక్టివిటీస్ లాంటి కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ కూడా ఉంటాయి.

ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఆపిల్ ఇంకా అధికారికంగా దీని లాంచ్ టైమింగ్ ప్రకటించలేదు. కానీ కొన్ని నెలల్లోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. 2026 మొదటి త్రైమాసికంలో మార్కెట్‌లో అందుబాటులోకి ఉంటుందని అంచనా.

ఐఫోన్ 17e పెద్ద హిట్ ఛాన్స్ ఎక్కువ

ధర తక్కువగా ఉండి ప్రీమియం ఫీచర్స్ ఇస్తుంది కాబట్టి అందరూ కొంటారని ఆపిల్ భావిస్తోంది. గతంలో వచ్చిన చీప్ మోడల్స్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఫోన్ 17 సిరీస్ సూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఐఫోన్ 17eతో అందరినీ ఆకర్షించాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?

ఇంకా అధికారిక ధర చెప్పలేదు కానీ ఐఫోన్ 17 సిరీస్ మిగతా మోడల్స్ కంటే ధర తక్కువగానే ఉంటుందని అంచనా. దీని ఫీచర్స్ లీక్ కావడంతో అవి చూసిన ఆపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ గురింంచి చాలా ఎక్సైట్ అయ్యారు!

చీప్ ధరలో ప్రీమియం ఐఫోన్ కావాలనుకునేవాళ్లకి ఐఫోన్ 17e మంచి ఆప్షన్. 2026 వరకు కాస్త వేచి ఉండాల్సిందే.

Also Read: ఇంటర్నెట్‌ ఓనర్ ఎవరు?.. ఒకే కంపెనీ చేతిలో పవర్

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×