E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డిజైన్స్ విషయంలో స్వప్నను బకరాను చేయనున్న రాహుల్ 

Brahmamudi Serial Today December 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డిజైన్స్ విషయంలో స్వప్నను బకరాను చేయనున్న రాహుల్ 
Advertisement

Brahmamudi serial today Episode: రూంలోకి వెళ్లిన అప్పు రేణుక గురించి ఆలోచిస్తుంది. కళ్యాణ్‌ వచ్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు రేణుక గురించి ఆలోచిస్తున్నాన.. రేణుక మాటలు నమ్మాలనిపిస్తుంది. మరోపక్క జనం చెప్పిన మాటలు నమ్మాలా వద్దా అనిపిస్తుంది అని చెప్పగానే.. పొట్టి ముందు నువ్వు నిజాలు అబద్దాలు పక్కన పెట్టు కాస్త ప్రశాంతంగా ఆలోచించూ.. నీ మనసు ఏం చెప్తుందో అదే నమ్ము అని కళ్యాణ్‌ చెప్పగానే.. రేణుక చెప్పిన మాటలు నిజం అనిపిస్తుంది. తనలో తన ఆవేదనలో ఒ తల్లి బాధ స్పష్టంగా కనిపిస్తుంది అని అప్పు చెప్పగానే.. అలాంటప్పుడు డాక్టర్‌ను కన్సల్ట్ అయితే తనేంటో తెలిసిపోతుందా కదా పొట్టి అని కళ్యాణ్‌ చెప్పగానే.. ఇన్ని రోజులుగా తన ప్రవర్తన చూశాక డాక్టర్‌ ను కన్సల్ట్‌ అయ్యారు. డాక్టర్‌ కూడా తాను నార్మల్‌ అని చెప్పింది.

అలాంటప్పుడు ఇందులో అనుమానపడాల్సింది ఏముంది…? కన్ఫీజ్‌ అవ్వడానికి ఏముంది. తన మాటలు నిజమని ముందుకు వెళితే సరిపోతుంది. అవును పొట్టి నువ్వు నమ్మిందే చేయ్‌.. ఎక్కడ నీకు అనుమానం వచ్చినా ఆవిడ చెప్పింది అబద్దం అని తేలితే ఇన్వెస్టిగేషన్‌ ఆపేయ్‌.. ఒకవేళ నీ అనుమానం నిజమైతే కేసు గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్‌ చేయ్‌..నీలాంటి ధైర్యం గల ఆఫీసర్‌ కన్ఫీజ్‌లో ఉండకూడదే.. క్లారిటీతో ఉండాలి.. నువ్వు ముందడుగు వేయ్‌.. అని చెప్పగానే.. వేస్తాను కూచీ ముందడుగు వేస్తాను. నా అనుమానం తీరేదాకా..? ఆ తల్లి ఆవేదనకు అర్థం తెలిసే దాకా అందులో ఉన్న నిజానిజాలు గుర్తించేదాకా వెళ్తాను. ఈ కేసును మాత్రం వదిలిపెట్టను.. అని అప్పు చెప్పగానే.. అది మా పొట్టి అంటే.. అంటాడు కళ్యాణ్‌.

Advertisement

మరోవైపు నిద్ర పోతున్న నటిస్తున్న కావ్యను నిద్ర లేపి టెంపుల్‌కు తీసుకెళ్తాడు రాజ్‌. మరోవైపు రాహుల్‌ ఒక డిజైనర్‌ను తీసుకొచ్చి రాజ్‌, కావ్య వాళ్లు వేసిన డిజైన్స్‌ యాజ్‌టీజ్‌గా వేయిస్తుంటాడు. డిజైనర్‌ ఒక చిన్న మిస్టేక్‌ చేయగానే.. రాహుల్‌ కోపంగా ఏయ్‌ ఆగు.. ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు.. మీరు ఇచ్చిన ఈ డిజైన్స్‌ గీస్తున్నాను సార్‌ అని చెప్పగానే.. ఈ వర్జినల్‌ డిజైన్‌ లో అక్కడ ఒక డైమండ్‌ ఉంది.. అది ఎందుకు మిస్‌ చేస్తున్నావు నువ్వు అని రాహుల్‌ అడగ్గానే.. సార్‌ అది అసలు ప్రాబ్లమే కాదు సార్‌ ఏం పర్వాలేదు సార్‌ అని డిజైనర్‌ చెప్పగానే.. నో వర్జినల్‌కు దీనికి ఒక చిన్న తేడా కూడా ఉండకూడదు.. యాజ్‌ టీజ్‌గా ఉండాలి. అలాగే గీయాలి. చిన్న డైమండ్‌ కానీ ముత్యం కానీ అక్కడ ఎలా ఉంటే అలాగే ఉండాలి. సైజు కూడా మారకూడదు అని రాహుల్ చెప్పగానే.. ఒకేసార్‌ బట్‌ సొంతంగా డిజైన్‌ చేయగలను సార్‌. మీరు సాటిఫై అయ్యే విధంగా కొత్త డిజైన్స్‌ ఇవ్వగలను సార్‌ అంటాడు.

దీంతో రాహుల్‌ కోపంగా వద్దు నీ క్రియేటివీ నీ టాలెంట్‌ నాకు వద్దు నాకు జస్ట్‌ ఇది కాఫీ చేసి ఇస్తే చాలు అని రాహుల్‌ చెప్పగానే.. డిజైనర్‌ ఓకే సార్‌ అంటూ డిజైన్స్‌ గీస్తుంటాడు. ఇంతలో సతీష్‌ అనుమానంగా సార్‌ కావ్య గారి డిజైన్స్‌ ను ఇంత కష్టపడి ఎంత కాఫీ కొట్టినా క్లయిట్స్‌ మనవే అని నమ్ముతారా సార్‌.. అని అడగ్గానే.. ప్రపంచం అంతా నమ్మక్కర్లేదు.. ఫస్ట్‌ నా భార్య నమ్మితే చాలు కథను అదే నడిపిస్తుంది. అని రాహుల్‌ చెప్పగానే.. సతీష్‌ అనుమానంగా అదేంటి సార్‌ అని అడుగుతాడు. అంతా నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్‌గా చూస్తూ ఉండు.. అని చెప్పి రాహుల్ ముందు స్వప్నకు ఫోన్‌ చేద్దామని పక్కకు వెళ్లిపోతాడు. స్వప్నకు కాల్‌ చేసి భోజనం చేశావా..? అని అడుగుతాడు. చేయలేదని నీ కోసమే వెయిట్‌ చేస్తున్నానని స్వప్న చెప్పగానే.. నేను ఈ రోజు రాలేనని చాలా వర్క్ ఉందని నువ్వు భోజనం చేయ్‌ అని చెప్తాడు రాహుల్‌. అయితే నేనే క్యారియర్‌ తీసుకుని ఆఫీసుకు వస్తాను అని స్వప్న చెప్పి కాల్‌ కట్‌ చేస్తుంది.

Advertisement

రిసార్ట్‌ లో ఉన్న రాజ్‌, కావ్య దగ్గరకు చనిపోయిన వ్యక్తి గురించి వివరాలు తెలుసుకునేందుకు ఒక వ్యక్తి వెళ్లి డీటెయిల్స్‌ అడుగుతుంటే.. రాజ్‌ కోప్పడుతుంటాడు. దూరం నుంచి గమనిస్తున్న రౌడీలు రాజ్‌, కావ్యను అనుమానిస్తారు. మరోవైపు డిజైనర్‌ కావ్య డిజైన్స్‌ను కాఫీ కొట్టడం కూడా రావడం లేదని కోప్పడుతుంటాడు. ఇంతలో స్వప్న రాగానే.. రాహుల్‌ సొంతంగా డిజైన్స్‌ కోసం కష్టపడుతున్నట్టు నటిస్తాడు. డిజైన్స్‌ కోసం తాను బాగా కష్టపడుతున్న బిల్డప్‌ ఇస్తాడు రాహుల్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×