E-Paper
Advertisement

మీ ఫోన్‌లోనూ హిడెన్ యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోండి!

మీ ఫోన్‌లోనూ హిడెన్ యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోండి!
Advertisement

Hidden Apps: స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన ఆ టెక్ యుగంలో ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఎవరికీ కనిపించకూడదనో, పిల్లలు పొరపాటున ఓపెన్ చేయకూడదనో కొంతమంది కొన్ని యాప్స్‌ను ఫోన్లో దాచిపెడుతుంటారు. అయితే ఇంట్లో పిల్లలు ఫోన్ వాడుతున్నప్పుడు, ఏయే యాప్స్ ఉన్నాయో తెలుసుకోవడం తల్లిదండ్రులకు కాస్త కష్టంగానే ఉంటుంది. అంతేకాదు.. మనకు తెలియకుండా ఫోన్లో ఏదైనా అనుమానాస్పదమైన యాప్ ఇన్‌స్టాల్ అయిందేమోనని అనిపించినా వెంటనే చెక్ చేయాల్సిందే. అయితే ఇందుకోసం పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఫోన్లో దాచిన యాప్స్ ఎక్కడ ఉన్నాయో కొన్ని సింపుల్ స్టెప్స్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు.

ప్లే స్టోర్‌లో వెతకడం:

ఫోన్ హోమ్ స్క్రీన్ మీద కనిపించకుండా హైడ్ చేసిన యాప్స్ అన్నీ కూడా ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ లోనూ, ఐఫోన్ అయితే యాప్ స్టోర్ లోనూ కచ్చితంగా కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి మేనేజ్ యాప్స్ ఆప్షన్లోకి వెళ్తే అన్ని యాప్స్ లిస్ట్ వస్తుంది. ఐఫోన్లలో అయితే యాప్ స్టోర్‌లో మీ ప్రొఫైల్ పిక్ పై నొక్కి పర్చేస్ హిస్టరీలోకి వెళ్తే డౌన్లోడ్ చేసిన ప్రతి యాప్ సులభంగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సెట్టింగ్స్‌లో చెక్ చేయడం:

యాప్ స్టోర్స్ కాకుండా నేరుగా ఫోన్ సెట్టింగ్స్ ద్వారా కూడా సీక్రెట్ యాప్స్‌ని పట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్ లిస్ట్ ఓపెన్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ పేరు కనిపిస్తుంది. ఐఫోన్లలో అయితే యాప్ లైబ్రరీలో చివరగా ఉండే హిడెన్ యాప్స్ ఫోల్డర్ ద్వారా వీటిని కనుగొనవచ్చు. అయితే ఐఫోన్లలో ఈ యాప్స్ ఓపెన్ చేయాలంటే ఫేస్ ఐడీ లేదా పాస్‌కోడ్ మాత్రం తప్పనిసరిగా అవసరం అవుతుంది.

అనుమానాస్పద యాప్స్:

Advertisement

కొన్నిసార్లు యాప్స్ కేవలం హైడ్ చేయడమే కాకుండా.. చూడటానికి వేరేలా కనిపిస్తాయి. ఉదా: సాధారణ కాలిక్యులేటర్, క్లాక్ లేదా ఫోన్ డీలర్ లాగా కనిపిస్తుంటాయి. అందుకే మీ ఫోన్ యాప్స్ లిస్ట్ చెక్ చేస్తున్నప్పుడు మీకు తెలియని లేదా అనుమానాస్పదంగా ఉన్న ఏ ఐకాన్ కనిపించినా వెంటనే దాని వివరాలు ఓపెన్ చేసి అసలు సంగతి ఏంటో చెక్ చేయడం చాలా ముఖ్యం.

Also Read: ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Tags

Related News

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!

మానవ వ్యర్థాలతో.. అత్యంత బలమైన కాంక్రీట్‌.. శాస్త్రవేత్తల నెవర్ బిఫోర్ ప్రయోగం!

జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Big Stories

Advertisement
×