E-Paper
Advertisement

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?
Advertisement

Best Malayalam Thriller Movies: మలయాళం సినిమాలకు తెలుగులో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ యాక్షన్, స్టార్ హీరోల కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు మాలీవుడ్ నుంచి వస్తుంటాయి. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఫాలోయింగ్ పెరిగింది. కొత్త కాన్సెప్ట్, సహజమైన నటన, చివరి వరకు అంచనా వేయలేని ట్విస్టులు ఉంటే చాలు… భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు వాటిని వెతికి మరీ చూస్తున్నారు. ఇప్పుడు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న మూడు మలయాళం సినిమాలు కూడా ఇలాంటి ఆసక్తికరమైన కథలతోనే వచ్చాయి. హారర్ నుంచి సైకలాజికల్ మిస్టరీ వరకు, క్రైమ్ థ్రిల్లర్ నుంచి మాఫియా కుట్రల వరకు ఒక్కో సినిమా ఒక్కో తరహా అనుభూతిని ఇస్తుంది. ఇప్పటికే వీటిలో కొన్ని మీ వాచ్‌లిస్ట్‌లో ఉండొచ్చు. మరి ఈ మూడు సినిమాల్లో మీరెన్ని చూశారో ఓసారి చెక్ చేసుకోండి.

1. అనంతన్ కాడు (Ananthan Kaadu)

హారర్, మిస్టరీ అంశాలను కలిపి తెరకెక్కిన మలయాళం సినిమా ‘అనంతన్ కాడు’. కథకు అడవి నేపథ్యం కావడంతో మొదటి నుంచే ఒక తెలియని భయం వెంటాడుతుంటుంది. అడవిలోకి వెళ్లిన తర్వాత చోటుచేసుకునే పరిణామాలతో అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న మొదలవుతుంది. అక్కడ వినిపించే కథలు నిజమేనా ? లేక వాటి వెనుక ఇంకేదైనా కారణం ఉందా ? అనే అనుమానాలు ప్రేక్షకుడిలో పెరుగుతూనే ఉంటాయి. సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ ఒక్కో రహస్యం బయటపడటంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. హారర్‌తో పాటు మిస్టరీ, థ్రిల్ ఉన్న ఈ సినిమా Amazon Prime Video, Simply South, Lionsgate Play, ManoramaMAX నాలుగు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

2. ఉన్మాదం (Unmadham)

Advertisement

ఒక పాత హత్య కేసు ఫైల్ చేతికి వస్తే… అది ఒక పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్నే మార్చేస్తే ఎలా ఉంటుంది ? ఇదే ఆసక్తికరమైన పాయింట్‌తో సాగుతుంది ‘ఉన్మాదం’. షెల్లీ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. అయితే అతడికి సినిమాలకు కథలు రాయాలనే కోరిక ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా కథ రాయలేకపోవడంతో రైటర్స్ బ్లాక్‌తో ఇబ్బంది పడుతుంటాడు. ఇలాంటి సమయంలో అతడి చేతికి ఆరేళ్లుగా పరిష్కారం కాని ఓ హత్య కేసుకు సంబంధించిన పాత ఫైల్ వస్తుంది. ఆ కేసు గురించి తెలుసుకుంటున్న కొద్దీ అక్కడ ఒక వింత నమ్మకం ఉన్నట్టు షెల్లీకి తెలుస్తుంది. ఆ హత్య వెనుక శాపం ఉందనే ప్రచారం కూడా ఉంటుంది. దానిని తన కథకు ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన తర్వాత అతడి జీవితంలో ఊహించని సంఘటనలు మొదలవుతాయి. షెల్లీ ఎదుర్కొంటున్నవి నిజంగానే అతీంద్రియ శక్తుల ప్రభావమా ? లేక అతడి మనసే అతడిని భయపెడుతోందా ? సినిమా ఈ రెండు కోణాల మధ్య ప్రేక్షకుడిని తిప్పుతూ ముందుకు సాగుతుంది. Sony LIVలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ చూడొచ్చు.

3. పగిడ కాళి (Pagida Kali)

ఒక హత్య కేసు కేరళలో కలకలం రేపుతున్న సమయంలోనే 26 మంది పిల్లలు కనిపించకుండా పోతే… పరిస్థితి ఎలా ఉంటుంది? ‘పగిడ కాళి’ (Pagida Kali) కథ ఇలాంటి క్రైమ్ మిస్టరీతోనే ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకుంటుంది. పిల్లలు అదృశ్యమైన కేసు వెనుక అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో కథ మరింత చీకటి కోణంలోకి వెళ్తుంది. ముఖ్యంగా ఇద్దరు నేరస్థులు ఆ 26 మంది పిల్లల్లో ఒకరిని మాత్రమే వెతుక్కుంటూ బయలుదేరడంతో ఆసక్తి మరింత పెరుగుతుంది. ఆ చిన్నారి కోసం వాళ్లు ఎందుకు అంతగా ప్రయత్నిస్తున్నారు? మిగతా పిల్లలతో పోలిస్తే అతడికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అనే ప్రశ్నలు కథకు కీలకంగా మారతాయి. వాళ్ల వేట కొనసాగుతున్న కొద్దీ దీని వెనుక సాధారణ కిడ్నాప్ వ్యవహారం కాదని అర్థమవుతుంది. ఒక భారీ మాఫియా నెట్‌వర్క్, రాజకీయ ప్రయోజనాలు, నేర ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాలు బయటపడతాయి. దీంతో మొదట చిన్న క్రైమ్ కేసులా కనిపించిన కథ క్రమంగా పెద్ద కుట్రగా మారుతుంది. ManoramaMAXలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement

మొత్తంగా చూస్తే ఈ మూడు సినిమాలు మూడు విభిన్నమైన జానర్లలో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ‘అనంతన్ కాడు’ హారర్, మిస్టరీతో భయపెడితే… ‘ఉన్మాదం’ మైండ్ గేమ్‌తో ఆసక్తి పెంచుతుంది. ఇక ‘పగిడ కాళి’ క్రైమ్ మిస్టరీతో చివరి వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచుతుంది.

Read Also: బహుమతుల బాక్సుల్లో నరికేసిన మనుషుల చేతులు… కళ్లు తిప్పుకోనివ్వని సైకో కిల్లర్ వేట

Related News

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 లిస్ట్… మొత్తం సిరీస్లదే హంగామా

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×