E-Paper
Advertisement

iPhone 17 Resale Value: ఐఫోన్ 17 సిరీస్‌లో ఈ ఫోన్ అసలు కొనొద్దు.. రీసేల్ వ్యాల్యూ ఢమాల్

iPhone 17 Resale Value: ఐఫోన్ 17 సిరీస్‌లో ఈ ఫోన్ అసలు కొనొద్దు.. రీసేల్ వ్యాల్యూ ఢమాల్
Advertisement

iPhone 17 Resale Value| ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్స్ ప్రతిష్టాత్మక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఐఫోన్ పాతదైనా సరే అందులో క్వాలిటీ, సెకూరిటీ ఫీచర్లు ఉండడంతో మంచి రీసేల్ వ్యాల్యూ లభిస్తుంది. ఈ క్రమంలో 2025లో కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సిరీస్ లో అన్ని మోడల్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కానీ ఒక మోడల్ కు మాత్రం డిమాండ్ తగ్గిపోతోంది. దాని రీసేల్ వ్యాల్యూ కూడా పడిపోయింది. అదే ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air).

ఇది ఐఫోన్ 17 ఎయిర్ కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. SellCell అనే కంపెనీ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫోన్ ధర రీసేల్ మార్కెట్లో భారీగా క్షీణించింది. కేవలం 10 వారాల్లోనే 40.3% నుంచి 47.7% వరకు తగ్గిపోయింది. అంటే సగటున 44.3% తగ్గింది. ఒక వేళ ఐఫోన్ ఎయిర్ ని మీరు ఇప్పటికే కొనుగోలు చేసిఉంటే.. మరికొన్ని రోజుల్లో లేదా 2026లో ఈ ఫోన్ రీసేల్ వ్యాల్యూ సగం లేదా ఇంకా తక్కువకే పడిపోవచ్చని అంచనా.

మిగతా ఐఫోన్ 17 మోడల్స్ వ్యాల్యూ

Advertisement

iPhone 17 Air కంటే మిగతా మోడల్స్ రీసేల్ వాల్యూ చాలా బెటర్ గా ఉంది.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB వ్యాల్యూ కేవలం 26.1% తగ్గింది (బెస్ట్)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512GB వేరియంట్ 30.3% తగ్గింది
ఐఫోన్ 17 ప్రో 256GB వేరియంట్ వ్యాల్యూ 31.9% తగ్గింది
ఐఫోన్ 17 ఎయర్ 256GB వ్యాల్యూ 40.3% తగ్గింది
ఐఫోన్ 17 ఎయర్ 1TB వ్యాల్యూ అన్నింటికంటే ఎక్కువగా 47.7% తగ్గింది (వరస్ట్)
మొత్తంగా చూస్తే ఐఫోన్ 17 ఎయర్ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో చిల్లర ధరకు వచ్చేస్తుంది.

Advertisement

జైపూర్‌లోని పాత ఫోన్ల డీలర్ల దగ్గర చెక్ చేస్తే.. iPhone 17 Air (ఓపెన్ బాక్స్, పూర్తి వారంటీ, 100% బ్యాటరీ హెల్త్) కేవలం రూ.90,000కే దొరుకుతోంది. ఇండియాలో దీని MRP ధర సుమారు రూ.1,20,000. అంటే 25% కంటే ఎక్కువ తగ్గింది. కండీషన్ మరింత దారుణంగా ఉంటే ధర మరింత పడిపోతుంది.

iPhone 17 Proతో పోల్చితే ఏముంది?

అదే షాపుల్లో iPhone 17 Pro బేస్ మోడల్ రూ.1,20,000కి దొరుకుతోంది. దీని MRP ధర రూ.1,35,000. అంటే కేవలం 11% మాత్రమే తగ్గింది. iPhone 17 Air కంటే iPhone 17 Pro రీసేల్ వాల్యూ చాలా బాగుంది.

ఐఫోన్ 17 ఎయర్ డిమాండ తగ్గడానికి కారణం ఏంటి?

ఐఫోన్ 17 ఎయర్ మోడల్ సేల్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆపిల్ కూడా ఐఫోన్ 17 ఎయర్ తయారీని తగ్గించినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆపిల్ ఈ ఫోన్ తయారీ ప్లాన్స్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 18 సిరీస్ లో కూడా ఐఫోన్ ఎయిర్ కొత్త మోడల్ విడుదల అయ్యే ఛాన్సులు తక్కువ.

ఏం చేయాలి?

iPhone 17 Air కొనాలనుకుంటే రీసేల్ వాల్యూ గురించి బాగా ఆలోచించండి
స్లిమ్ ఐఫోన్ కావాలి.. ఎక్కువ కాలం వినియోగించాలంటే ఓకే, కానీ కొంతకాలం ఉపయోగించి రీసేల్ చేయాలనుకుంటే మాత్రం నష్టమే
రీసేల్ వాల్యూ ముఖ్యమైతే ఐఫోన్ 17 ప్రో లేదా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ కొనుగోలు చేయడం బెటర్.

ఐఫోన్ 17 ఎయర్ స్లిమ్ డిజైన్, తక్కువ బరువు ఉన్నా రీసేల్ మార్కెట్‌లో దీనికి డిమాండ్ తక్కువగా ఉంది. మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.

Also Read: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×