E-Paper
Advertisement

Delhi News: ఫుల్లుగా తాగి ఆపై ర్యాపిడోలో యువతి.. రైడర్‌కు నరకం, చివరకు ఢిల్లీలో ఏం జరిగింది?

Delhi News: ఫుల్లుగా తాగి ఆపై ర్యాపిడోలో యువతి..  రైడర్‌కు నరకం, చివరకు ఢిల్లీలో ఏం జరిగింది?
Advertisement

Delhi News: దేనికైనా సమయం.. సందర్భం అనేది ఉంటుంది. అదిశృతి మించితే లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. చివరకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అఫ్ కోర్సు అందుకు కారణాలు అనేకం. ఫుల్లుగా తాగి ర్యాపిడో ఎక్కింది ఓ యువతి. బైక్ పై కూర్చోలేక కిందకు జారింది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.

ఫుల్లుగా తాగి ర్యాపిడో ఎక్కిన  యువతి

Advertisement

Advertisement

ఢిల్లీలోని నైట్ క్లబ్‌లో ఓ యువతి ఫుల్లుగా మద్యం సేవించింది. అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. మద్యం మత్తు ఎక్కువైంది. సరిగా బైక్‌పై కూర్చోలేక నానాఇబ్బందులు పడింది. వెళ్తున్న బైక్‌పై నుంచి రోడ్డుపైకి జారిపోతుండగా బైకర్ అప్రమత్తం అయ్యాడు. ఓ చేత్తో గట్టిగా పట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది.

దీంతో ఆ యువతికి పెను ప్రమాదం తప్పింది. కాకపోతే ఆ యువతి ఆ మత్తు నుంచి బయటపడటానికి దాదాపుగా రెండు మూడు గంటలు పట్టింది. అయినాసరే రైడర్ ఆ యువతిని సరిగా కూర్చోవాలని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత ఆ మహిళ చివరకు బైక్ నుండి పూర్తిగా జారిపోయింది.

బైకర్‌కు నరకం, ఢిల్లీలో ఏం జరిగింది?

ఆ సమయంలో రైడర్‌కు నరకం కనిపించింది. రాత్రివేళ నాలుగైదు రైడ్స్ చేసి రూమ్‌కి వేగంగా వెళ్లిపోవాలని రైడర్ భావించాడు. చివరకు యువతి వల్ల తన టైమ్ వృథా అయ్యిందంటూ ఇబ్బందిపడ్డాడు. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

దీనిపై నెటిజన్స్ రకరకాల ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. వీడియో చిత్రీకరణ సందర్భంగా యువతిని కింద పడనివ్వండి అంటూ మాటలు వినిపించాయి. సోషల్ మీడియా చర్చ మొదలైంది. రాత్రివేళ మహిళల భద్రత ఇది కాదా? మిడ్ నైట్‌లో ఆ విధంగా చేయడం ఏంటి? కల్చర్ పేరుతో మహిళల్లో డ్రింక్ వ్యవహారం హద్దులు దాటుతోందని అంటున్నారు.

ALSO READ: ఇండిగో సంక్షోభానికి అదే కారణం.. రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

స్పృహ లేని స్థితిలో జరిగే అవాంఛనీయ ఘటనలకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. యువతి వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. యువతి ఆ విధంగా కనిపించడానికి గల కారణాలపై చర్చించాలని అంటున్నారు కొందరు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×