E-Paper
Advertisement

Refrigerators for Medium Family: చిన్న ఫ్యామిలీకి.. సరిగ్గా సరిపోయే.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే!

Refrigerators for Medium Family: చిన్న ఫ్యామిలీకి.. సరిగ్గా సరిపోయే.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే!
Advertisement

Refrigerators for Medium Family: ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్న చిన్న ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోయే ఫ్రిడ్జ్ లను ఇక్కడ అందించడం జరుగుతోంది. సాధారణంగా తక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు 5 స్టార్ రేటింగ్, 200 లీటర్ల కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జ్ లు సరిగ్గా సరిపోతాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఫీచర్లు కలిగిన టాప్ – 5 ఫ్రిడ్జ్ లు ఇక్కడ పరిశీలిద్దాం.

LG 235 L 5-Star Inverter Refrigerator

ఎల్జీ కంపెనీ ఫ్రిడ్జ్ లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు లేదా నలుగురు ఉన్న ఫ్యామిలీకి LG 235 L 5-Star బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఇందులో ‘Smart Inverter Compressor’ ఉంటుంది, ఇది చాలా తక్కువ శబ్దం చేస్తుంది. ఇందులో కూరగాయల బుట్ట (21 లీటర్లు) చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే పాలు, పెరుగు, ఆహారపదార్థాలు భద్రపరుచుకునేందుకు వీలుగా షెల్ఫ్ లు కూడా ఉన్నాయి. మార్కెట్ లో ఈ ఫ్రిడ్జ్ ధర రూ.19,000-22,000 మధ్య పలుకుతోంది.

Samsung 225 L 5-Star Digi-Touch Cool

Advertisement

శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రిడ్జ్.. స్టైలిష్ లుక్ తో పాటు ఆధునిక ఫీచర్లు సైతం కలిగి ఉంది. దీని బయట వైపు ‘Digi-Touch Control’ ప్యానెల్ ఉంటుంది. దీని ద్వారా డోర్ తీయకుండానే ఉష్ణోగ్రతను మార్చుకోవచ్చు. ఇందులో బేస్ స్టాండ్ డ్రాయర్ ఉంది. అక్కడ మీరు ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటివి స్టోర్ చేసుకోవచ్చు. మార్కెట్ లో రూ.20,000-23,000 మధ్య ఈ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది.

Whirlpool 215 L 5-Star IntelliFresh

మార్కెట్ లో వర్ల్ పూల్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ లు సంతృప్తికరమైన రివ్యూలను అందుకుంటున్నాయి. 215 లీటర్ల సామర్థ్యమున్నఈ రిఫ్రిజిరేటర్.. ‘Intellisense Inverter’ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది లోపల ఉన్న లోడ్‌ను బట్టి కూలింగ్‌ను దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. పవర్ కట్ అయినప్పుడు కూడా ఇది దాదాపు 12 గంటల వరకు కూలింగ్‌ను నిలిపి ఉంచుకోగలదు. దీని ధర రూ.18,000-21,000 మధ్య ఉంది.

Haier 230 L 5-Star Direct Cool

Advertisement

తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సామర్థ్యమున్న ఫ్రిడ్జ్ ను కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ గా నిలుస్తోంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇది స్టెబిలైజర్ లేకుండానే పనిచేస్తుంది. ఈ ఫ్రిడ్జ్ డోర్ షెల్వ్స్ (Door Shelves) వెడల్పుగా ఉండి పెద్ద వాటర్ బాటిల్స్ పెట్టుకునేందుకు అనువుగా వీలు కల్పిస్తాయి. మార్కెట్ లో రూ.17,500-20,000 మధ్య ఈ ఫ్రిడ్జ్ సేల్ అవుతోంది.

Also Read: Portable AC vs Split AC: బడ్జెట్, విద్యుత్ ఆదా కోసం.. ఈ రెండు ఏసీల్లో.. ఏది కొంటే బెటర్?

Godrej 230 L 5-Star Edge Pro

దేశీయ కంపెనీ అయిన గోద్రేజ్ నాణ్యమైన, మన్నిక గల ఫ్రిడ్జ్ లకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. కంపెనీకి చెందిన Godrej 230 L ఫ్రిడ్జ్.. ‘Advanced Inverter Technology’తో పనిచేస్తుంది. కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండేలా ‘Farm Fresh’ టెక్నాలజీని ఇందులో అమర్చారు. దీనిలో షెల్ఫ్స్ Toughened Glassతో రూపొందడం వల్ల.. బరువును సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. ఈ ఫ్రిడ్జ్ రూ.18,500 – 21,500 మధ్య అందుబాటులో ఉంది.

Also Read: Washing Machine Tips: మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఈ తప్పులు చేయకండి.. చేశారో మర్నాడు షెడ్డుకే!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×