E-Paper
Advertisement

Congress vs BJP : వారి వల్లే బీజేపీకి ప్లస్..కాంగ్రె‌స్‌కు మైనస్..బీ కేర్ ఫుల్!

Congress vs BJP : వారి వల్లే బీజేపీకి ప్లస్..కాంగ్రె‌స్‌కు మైనస్..బీ కేర్ ఫుల్!
Advertisement

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గడానికి బీజేపీకి పెరగడానికి గల కారణాలపై జాతీయ కాంగ్రెస్ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓటర్లతో పాటు మైనార్టీ ఓటర్లు సైతం అండగా ఉండేవారు. ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు(ముస్లిం) ఓటర్లు క్రమంగా తగ్గుతున్నట్టు ఆ పార్టీ అంతర్గత సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. అందుకు గల కారణాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. ఇకమీదట జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మైనార్టీలు పార్టీకి దూరం కాకుండా తీసుకునే చర్యలపై ప్రస్తుతం అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.

బీజేపీకి బీ టీమ్..

కాంగ్రెస్ పార్టీకి దక్కే మైనార్టీ ఓట్లు గత ఐదేండ్లుగా హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం ఖాతాలోకి వెళ్తున్నట్టు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తించినట్టు తెలిసింది. నిన్న జరిగిన ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇదే విషయాన్ని ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టంచేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత రెండు టర్ముల్లో ఎంఐఎం పార్టీకి కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ క్రమంగా సీట్లు పెరుగుతున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో పెద్దగా ప్రభావం లేకపోయినా అసెంబ్లీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటుతూ వస్తున్నది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు సమాచారం.

పొత్తు లేకుండా వెళ్లండి..

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీ మధ్య పొత్తు పొడిచింది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కొన్ని చోట్ల సహకరించుకున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలను సైతం భాగస్వామ్యంతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణలోని బైంసా, నిజామాబాద్, కరీంనగర్‌లో మజ్లిస్ పార్టీ పెద్దఎత్తున కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకోగా..ఆ పార్టీ సాయంతోనే నిజామాబాద్‌లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇదే విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ..దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఎంఐఎం ముస్లిం ఓట్లను చీలుస్తుందని.. ఫలితంగా కాంగ్రెస్ కు రావాల్సిన ఓట్లను ఎంఐఎం దక్కించుకోవడంతో బీజేపీ గెలవడం, కాంగ్రెస్‌కు మైనస్ అవుతుందని రాహుల్ గాంధీ.. రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్టు తెలిసింది. పొత్తు లేకుండా సొంతంగా పార్టీకి మైనార్టీ ఓట్లు వచ్చేలా చూడాలని సీఎం రేవంత్‌‌కు సూచించినట్టు తెలుస్తోంది.

Cm Revanth : మంచి మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్..

బిహార్, మహారాష్ట్రలో లాస్..

Advertisement

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఎంఐఎం పార్టీ అక్కడకు వెళ్లి పోటీచేయడంతో ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లకు గండి పడుతున్నది. బీజేపీకి మెజార్టీ ఓట్లు రావడంతో ఆ పార్టీ అధిక స్థానాలు గెలుస్తున్నది. గతంలో బిహార్‌లో ఎంఐఎం 5 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 100 వరకు సీట్లు గెలుపొందినట్టు సమాచారం.అందువల్లే కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అవుతోందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి సహాయం చేస్తున్నదని రాహుల్ గాంధీ, ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించినట్టు తెలిసింది. ఇక మీదట ఆ పార్టీ మద్దతు లేకుండానే ఎన్నికల్లో బరిలో దిగే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు తెలిసింది.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×