E-Paper
Advertisement

IND vs PAK Handshake: నో షేక్ హ్యాండ్ వివాదం పెద్ద డ్రామా..పైకి మాత్రమే శ‌త్రువులు, లోప‌ల మాత్రం దోస్తులే

IND vs PAK Handshake: నో షేక్ హ్యాండ్ వివాదం పెద్ద డ్రామా..పైకి మాత్రమే శ‌త్రువులు, లోప‌ల మాత్రం దోస్తులే
Advertisement

IND vs PAK Handshake:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ పైన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ( india vs pakistan handshake) ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 టోర్నమెంటు సందర్భంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ నో షేక్ హ్యాండ్ ( IND vs PAK Handshake ) వివాదం పైన తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలస్టేర్ కుక్ (alastair cook) సంచలన వ్యాఖ్యలు చేశారు. నో షేక్ హ్యాండ్‌ వివాదం అనేది పెద్ద డ్రామా అంటూ బాంబు పేల్చారు. పైకి మాత్రం శత్రువులు… డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం అందరూ కలిసే తింటారని సంచలన వ్యాఖ్యలు చేశారు అలస్టేర్ కుక్. దీంతో అలస్టేర్ కుక్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

నో షేక్ హ్యాండ్ వివాదం పెద్ద డ్రామా.. అలస్టేర్ కుక్ సంచ‌ల‌నం

Advertisement

ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( india vs pakistan) మధ్య మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్ ( Operation Sindhur) తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోయాయి. అంతకు ముందు ఇరు జట్ల ప్లేయర్లు, టాస్ సందర్భంగా కెప్టెన్లు షేక్ హాండ్స్ ఇచ్చుకునేవారు. కానీ ఆపరేషన్ సింధూర్ అనంతరం షేక్ హాండ్స్ మొత్తం బ్యాన్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. బిసిసిఐ ఆదేశాల మేరకు సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

అయితే ఈ అంశంపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలస్టేర్ కుక్ (alastair cook) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలను మోసం చేసేందుకు ఈ షేక్ హ్యాండ్ వివాదం జరుగుతోందని మండిపడ్డారు. పైకి షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోయినా.. లో లోపల మాత్రం వాళ్ళందరూ మిత్రులేనని బాంబు పేల్చారు. డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ అలాగే టీమ్ ఇండియా ప్లేయర్లు కలిసే తింటారని ఫైర్ అయ్యారు. కానీ మైదానం లోకి వచ్చేసరికి నో షేక్ హ్యాండ్‌ అంటూ రెండు దేశాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వ్యూయ‌ర్‌ షిప్ పెంచేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారని పైరయ్యారు.

Advertisement

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి (alastair cook)

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×