E-Paper
Advertisement

Tanveer Ahmed: తూచ్ అంతా ఛీటింగే..ఫ‌స్ట్ ఇన్నింగ్ త‌ర్వాత టీమిండియాకు అనుకూలంగా పిచ్ మార్చేశారు

Tanveer Ahmed: తూచ్ అంతా ఛీటింగే..ఫ‌స్ట్ ఇన్నింగ్ త‌ర్వాత టీమిండియాకు అనుకూలంగా పిచ్ మార్చేశారు
Advertisement

Tanveer Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament) భాగంగా పాకిస్తాన్ జట్టుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది టీం ఇండియా. 23 ఏళ్ల తర్వాత మరోసారి శివరాత్రి రోజున పాకిస్తాన్ జట్టుకు కాలరాత్రి మిగిల్చింది టీం ఇండియా. కొలంబో వేదికగా నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఏకంగా 61 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి… పాకిస్తాన్ పరువు తీసింది. అయితే పాకిస్తాన్ పై వన్ సైడ్ విక్టరీ టీం ఇండియా సాధించడంతో, పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు విష ప్రచారం చేస్తున్నారు. అసలు ఇండియాది గెలుపే కాదని.. చీటింగ్ చేసి గెలిచారని తాజాగా మాజీ క్రికెటర్ త‌న్వీర్ అహ్మాద్ ( Tanveer Ahmed ) హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

టీమిండియా చీటింగ్ చేసి గెలిచింది.. వాళ్లది గెలుపే కాదు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ పైన విజయం సాధించిన ఇండియాను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed). ఈ మ్యాచ్ లో కచ్చితంగా ఇండియా చీటింగ్ చేసిందని బాంబు పేల్చారు. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా చేసినప్పుడు పిచ్ ఒకలాగా ఉందని.. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చేసేటప్పుడు మరోలా మారిందని ఆరోపణలు చేశారు. ఇన్నింగ్స్ బ్రేక్ నేపథ్యంలో కొలంబో ప్రేమ దాస పిచ్ ( R.Premadasa Stadium, Colombo )  స్వరూపం మార్చి ఇండియాకు అనుకూలంగా చేశారని సంచలన ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. దాంతో పాకిస్తాన్ ప్లేయర్లు హిట్టింగ్ ఆడలేకపోయారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ బౌలింగ్ చేసినప్పుడు కేవలం స్పిన్నర్లకు అనుకూలించిన బంతి, ఇండియన్స్ బౌలింగ్ వేసినప్పుడు పేసర్లకు కూడా పిచ్ అనుకూలించడం పైన అనుమానాలు వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మ‌ద్. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలోనే కుట్రలు జరిగాయని, అందుకే పాకిస్తాన్ ప్లేయర్లు బ్యాటింగ్ చేయలేకపోయారని మండిపడ్డారు. దీనిపై ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్.

సూప‌ర్ 8లోకి టీమిండియా, పాకిస్తాన్ డౌట్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా టీమ్ ఇండియాకు బంపర్ ఆఫర్ తగిలింది. వరుసగా మూడు విజయాలు నమోదు చేసుకున్న ఇండియా సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది. మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఖాతాలోకి ఆరు పాయింట్లు దక్కాయి. ఈ దెబ్బకు గ్రూప్ ఏ లో ఉన్న టీమిండియా మొదటగా సూపర్ 8 లోకి దూసుకెళ్లింది. అలాగే పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్ల‌లో ఒకటి సూపర్ 8 కు వెళ్లే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ తన తర్వాతి మ్యాచ్ న‌మీబియాతో ఆడనుంది. అందులో గెలిస్తేనే పాకిస్తాన్ సూపర్ 8కు వెళ్తుంది. లేకపోతే ఇంటి దారి పట్టాల్సిందే అని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Advertisement

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

 

 

?utm_source=ig_web_copy_link

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×