E-Paper
Advertisement

4k SmartTV Fake: మార్కెట్లో నకిలీ 4k స్మార్ట్‌టీవీలు.. మోసపోతున్న కస్టమర్లు.. ఎలా గుర్తించాలంటే

4k SmartTV Fake: మార్కెట్లో నకిలీ 4k స్మార్ట్‌టీవీలు.. మోసపోతున్న కస్టమర్లు.. ఎలా గుర్తించాలంటే
Advertisement

4k SmartTV Fake| ఇప్పుడు ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎంత అవసరమో ఇంట్లో స్మార్ట్ టీవీ కూడా అంతే ముఖ్యమైపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్, టీవి సీరియల్స్, స్పోర్ట్స్, న్యూస్ వంటివి ఎక్కువ శాతం ప్రజలు స్మార్ట్ టీవీలలోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ మీటింగ్స్, ప్రెజెంటేషన్స్ కూడా స్మార్ట్ టీవీలతో చేస్తారు.

ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్లలో చాలా తక్కువ ధరలకు స్మార్ట్ టీవీలు దొరుకుతున్నాయి. చౌక ధరలు చూసి చాలా మంది 4K స్మార్ట్ టీవీలు కొంటున్నారు. కానీ తక్కువ ధర వెనక క్వాలిటీ సమస్యలు దాగి ఉండవచ్చు. చాలా సందర్బాల్లో 4K స్మార్ట్ టీవీ అని కొనుగోలు చేసి అది తక్కువ క్వాలిటీ, నకిలీ విడిభాగాలతో తయారు చేయబడిందని తెలిసి కస్టమర్లు తాము మోసపోయామని ఫిర్యాదులు చేస్తున్నారు.

నకిలీ 4K టీవీ అంటే ఏమిటి?

Advertisement

చాలా కంపెనీలు తమ టీవీలను 4K స్మార్ట్ టీవీలుగా ప్రకటిస్తాయి. కొందరు అన్ని 4K టీవీలు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ఇస్తాయని అనుకుంటారు. కానీ నిజంగా అన్నీ అలా ఉండవు. కొన్ని టీవీలు కేవలం పేపర్ మీద 4K రెజల్యూషన్ చూపిస్తాయి. అంతర్గత హార్డ్‌వేర్ నిజమైన 4K కంటెంట్‌ని సరిగ్గా ప్రాసెస్ చేయలేవు. నిజమైన 4K టీవీకి.. 4K స్క్రీన్‌తో పాటు బలమైన హార్డ్‌వేర్ అవసరం. లేకపోతే HD కంటెంట్‌తో పెద్ద తేడా కనిపించదు.

నకిలీ 4K టీవీలతో సమస్యలు

నకిలీ 4K టీవీల్లో.. 4K కంటెంట్ చూపిస్తాయి కానీ కలర్ ప్రాసెసింగ్ సరిగా ఉండదు. చిత్రాలు వాష్ అవుట్‌గా, డెప్త్ లేకుండా కనిపిస్తాయి. మోషన్ స్మూత్‌గా లేకుండా బ్లర్ అవుతుంది. సినిమాలు, స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా తెలుస్తుంది. డబ్బు ఖర్చు చేసిన తర్వాత చాలా మంది మోసపోయినట్టు ఫీల్ అవుతారు. అప్పటికి దాని రిటర్న్ లేదా రీప్లేస్‌మెంట్ కష్టమవుతుంది. అందుకే కొనుగోలు చేయడానికి ముందు బాగా రీసెర్చ్ చేయాలి.

నిజమైన 4K స్మార్ట్ టీవీ ఎలా గుర్తించాలి?

Advertisement

నిజమైన 4K టీవీకి రెజల్యూషన్ మాత్రమే కాదు, ఇతర ఫీచర్లు కూడా ముఖ్యం. ముందుగా రిఫ్రెష్ రేట్ చూడాలి. 90Hz లేదా 120Hz ఉంటే మోషన్ స్మూత్‌గా ఉంటుంది. MEMC (మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కాంపెన్సేషన్) టెక్నాలజీ ఉంటే ఫాస్ట్ సీన్స్‌లో బ్లర్ తగ్గుతుంది. కలర్ డెప్త్ కూడా చూడాలి. బిలియన్స్ ఆఫ్ కలర్స్ సపోర్ట్ ఉంటే స్కిన్ టోన్స్, ల్యాండ్‌స్కేప్స్ నేచురల్‌గా కనిపిస్తాయి.

ఇతర ముఖ్య ఫీచర్లు

HDR ఫార్మాట్స్ సపోర్ట్ ఉంటే బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మెరుగవుతాయి. బలమైన ప్రాసెసర్ ఉంటే 4K కంటెంట్ స్మూత్‌గా రన్ అవుతుంది. వీక్ ప్రాసెసర్ ఉంటే లాగ్, పేలవమైన స్కేలింగ్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా ముఖ్యం. మంచి స్పీకర్లు సినిమాలు, స్పోర్ట్స్ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచుతాయి. చౌక టీవీల్లో సౌండ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది.

Also Read: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. ఏది కొనాలి? మీ బెడ్‌రూమ్‌కు ఏది బెస్ట్?

క్వాలిటీ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు భరించాలి

నిజమైన 4K స్మార్ట్ టీవీలు కొంచెం ఎక్కువ ధర అవుతాయి. అయితే ధరకు తగినట్లుగా నిజమైన 4K ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. కలర్స్ రిచ్‌గా, మోషన్ స్మూత్‌గా, షార్ప్‌గా ఉంటాయి. కంటెంట్ క్రియేటర్లు ఉద్దేశించిన విధంగా చూడవచ్చు. ఈ టీవీలు ఎక్కువ కాలం మన్నికనిస్తాయి. క్వాలిటీ టీవీలు కొనుగోలు చేయడం వల్ల తర్వాత విచారం చేయాల్సిన అవసరం ఉండదు.

కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బాగా చూడండి. మార్కెటింగ్ లేబుల్స్‌ని చూసి పూర్తిగా నమ్మకూడదు. ఆ టీవీ రివ్యూస్ చదవండి. ఇతర బ్రాండ్ల టీవీలతో పోల్చి చూడండి. చౌకగా ఉన్నాయని 4K మోడల్స్‌ని బ్లైండ్‌గా కొనవద్దు. కొంచెం రీసెర్చ్ చేస్తే డబ్బు, మనశ్శాంతి రెండూ ఆదా అవుతాయి. క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వండి.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×