E-Paper
Advertisement

Budget Gaming Phones: 2025లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్.. మిడ్ రేంజ్‌లో మంచి ఆప్షన్స్ ఇవే

Budget Gaming Phones: 2025లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్.. మిడ్ రేంజ్‌లో మంచి ఆప్షన్స్ ఇవే

Budget Gaming Phones| 2025లో మొబైల్ గేమింగ్ చాలా అడ్వాన్స్ అయింది. శక్తివంతమైన ప్రాసెసర్లు, అధునాతన డిస్‌ప్లే కలిగిన గేమింగ్ ఫోన్స్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో లో గేమర్లు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కొనాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్ లెవెల్ గేమింగ్ పనితీరు ఇస్తున్నాయి. ఇవి భారీ గేమ్‌లను ఓవర్‌హీటింగ్ లేదా ఫ్రేమ్ డ్రాప్‌లు లేకుండా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా గేమ్స్ ప్లే చేయవచ్చు. అందకే 2025లో బెస్ట్ బడ్జెట్ గేమింగ్ ఫోన్‌ల జాబితా మీ కోసం.

ఒప్పో K13 టర్బో ప్రో: పవర్, ఎండ్యూరెన్స్ కలిసిన ఫోన్

భారత్‌లో ఒప్పో K13 టర్బో ప్రో ధర రూ.39,999. ఇది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్థిరమైన ఫ్రేమ్ రేట్లతో అద్భుతమైన గేమింగ్ పనితీరు ఇస్తుంది. 7000mAh పెద్ద బ్యాటరీతో లాంగ్ గేమింగ్ సెషన్లకు అనువుగా ఉంది. 80W ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీని త్వరగా రీఫ్యూల్ చేస్తుంది. 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ గేమింగ్ ఫోన్ వన్ బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో బయట కూడా క్లియర్ విజువల్స్ లభిస్తాయి. బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యం ఇచ్చే గేమర్లకు ఈ ఫోన్ బెస్ట్.

iQOO నియో 10 5G: హై రిఫ్రెష్ రేట్ గేమింగ్ ఫోన్

iQOO నియో 10 5G ధర రూ.36,999. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉంది. డిమాండింగ్ గేమ్‌లను స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ వన్ బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో అల్ట్రా-స్మూత్ గేమింగ్ విజువల్స్ లభిస్తాయి. ఆండ్రాయిడ్ 15, ఫన్‌టచ్ OS 15తో పనిచేస్తుంది. 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

రియల్‌మి GT 7: బ్రైట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్

భారత్‌లో రియల్‌మి GT 7 ధర రూ.36,999. మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4nm ఆర్కిటెక్చర్‌తో గేమింగ్ ఎఫిషియెన్సీ, థర్మల్ కంట్రోల్ మెరుగ్గా ఉన్నాయి. 7000mAh బ్యాటరీ, 120W బ్లేజింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. వన్ బిలియన్ కలర్స్, 120Hz రిఫ్రెష్ రేట్. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

వివో T4 అల్ట్రా: బ్యాలెన్స్‌డ్ గేమింగ్ పనితీరు ఫోన్

వివో T4 అల్ట్రా ధర రూ.35,999. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో బలమైన గేమింగ్ పనితీరు ఇస్తుంది. 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో బయట కూడా మంచి విజిబిలిటీ. ఆండ్రాయిడ్ 15, ఫన్‌టచ్ OS 15 ఉన్నాయి. 5500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాలెన్స్‌డ్ పనితీరు కావాలనుకునే గేమర్లకు సరిపోతుంది.

షావోమి 14 సివి: కాంపాక్ట్, పవర్‌ఫుల్ ఫోన్

షావోమి 14 సివి ధర రూ.24,249 నుంచి మొదలవుతుంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ పనితీరు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 6.55 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 68 బిలియన్ కలర్స్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. షావోమి హైపర్‌OS ఉంది. 4700mAh బ్యాటరీ, 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్. బడ్జెట్ గేమర్లకు పర్ఫెక్ట్.

బడ్జెట్ గేమింగ్ ఫోన్‌లు ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ పనితీరు ఇస్తున్నాయి. తక్కువ ధరలో స్మూత్ గేమ్‌ప్లే లభిస్తుంది.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×