E-Paper
Advertisement

Xiaomi 17T Pro: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు.. 8,500mAh బ్యాటరీతో వస్తోన్న షియోమీ 17T ప్రో!

Xiaomi 17T Pro: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు.. 8,500mAh బ్యాటరీతో వస్తోన్న షియోమీ 17T ప్రో!
Advertisement

Xiaomi 17T Pro: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ తన పవర్‌ఫుల్ T సిరీస్‌లో భాగంగా మార్చి నెలలో భారత మార్కెట్లోకి Xiaomi 17T Proను విడుదల చేయనున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది వచ్చిన షావోమీ 15T ప్రోకి ఇది అప్‌గ్రేడ్‌గా ఉండబోతోంది. ముఖ్యంగా చైనాలో పాపులరైన Redmi K90 Ultra మోడల్‌ను రీబ్రాండ్ చేసి మన ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం.

మూడు స్పీకర్ల మ్యాజిక్..

ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. దీని ఆడియో సెటప్. సాధారణంగా స్మార్ట్‌ఫోనుల్లో రెండు స్పీకర్లు ఉండటం చూస్తుంటాం. కానీ షావోమీ మరో అడుగు ముందుకేసి ఏకంగా 3 స్పీకర్లను పరిచయం చేస్తోంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ BOSE సహకారంతో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫోన్ వెనుక భాగంలోని కెమెరా ఐలాండ్‌లో ఒక స్పెషల్ స్పీకర్‌ను సీక్రెట్‌గా అమర్చడం విశేషం. దీంతో సినిమా చూసినా, పాటలు విన్నా థియేటర్ ఫీల్ కలుగుతుంది.

Advertisement

Also Read: వివో నుంచి కేక పుట్టించేలా ‘ప్యాషన్ రెడ్’ వేరియంట్.. ఈ ఫోన్ స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేరు!

భారీ బ్యాటరీతో సంచలనం..

ఈ Xiaomi 17T Pro ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. తద్వారా గేమింగ్, మల్టీటాస్కింగ్  చాలా స్మూత్‌గా సాగిపోతుంది. మరో విశేషం ఏమిటంటే.. దీనిలో ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీంతో ఈ మొబైల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల వరకు ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. అలాగే ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ధర వివరాలు(అంచనా):

Advertisement

ఇకపోతే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. అలాగే ఫోన్ మన్నిక కోసం IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. iaomi 17T Pro  ధర విషయానికి వస్తే.. గత మోడల్ ధర రూ.77,000 ఉండగా, ఈ కొత్త ఫీచర్ల వల్ల Xiaomi 17T Pro ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read: రూ.13 వేలకే శాంసంగ్ 5G ఫోన్.. లెదర్ ఫినిష్ లుక్‌తో గెలాక్సీ F70e భారత్‌లో లాంచ్!

 

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×