BigTV English

Lover Sent Parcel Bomb: గుజరాత్‌లో దారుణం.. ప్రియురాలి కోసం పార్సిల్ బాంబ్.. ఏం జరిగిందంటే..?

Lover Sent Parcel Bomb: గుజరాత్‌లో దారుణం.. ప్రియురాలి కోసం పార్సిల్ బాంబ్.. ఏం జరిగిందంటే..?

Lover Sent Parcel Bomb: ప్రియురాలిని చంపేందుకు స్కెచ్ వేశాడు ఆమె ప్రియుడు. తన చేతికి మట్టి అంటుకోకుండా 20 ఏళ్ల కిందట వచ్చిన తెలుగు సినిమాలను ఫాలో అయిపోయాడు. సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. కాకపోతే ప్రియురాలి మిస్సయి.. ఆమె భర్త, కూతురు చనిపోయారు. సంచలనం రేపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.


గుజరాత్‌కి చెందిన 31ఏళ్ల జయంత్ భాయ్.. ఓ యువతిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. ఆమెకి దగ్గరగా కూడా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయికి మరో వ్యక్తి జీతూభాయ్‌తో పెళ్లయ్యింది. వారికి ముగ్గురు ఆడపిల్లులు పుట్టారు. తన ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టు కోలేకపోయాడు. ఆమెని చంపాలని నిర్ణయానికి వచ్చేవాడు. ఎలా చంపాలని పలుపలు విధాలుగా ఆలోచించాడు. చివరకు పార్సిల్ బాంబు అయితే బెటరని ఓ నిర్ణయానికి వచ్చేశాడు.

Also Read: Australian MP Molested| ఆస్ట్రేలియా మహిళా ఎంపీపై లైంగిక దాడి


ప్లాన్ ఓకే.. మరి బాంబుకు మెటీరియల్ ఎక్కడ అన్నది ఆలోచించాడు. గుజరాత్‌లో అయితే ఎవరికైనా అనుమానం వస్తుందని భావించాడు జయంత్. పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి అందుకు కావాల్సిన మెటీరియన్ తెచ్చుకున్నాడు. జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు, టేప్ రికార్డును కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి మళ్లీ గుజరాత్‌కు వచ్చేశాడు. బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. అయితే ప్రియురాలికి బాంబుని ఎలా అందజేయాలన్నది అసలు ప్రశ్న.

కొరియర్ ద్వారా పంపిస్తే అడ్డంగా దొరికిపోతామని భావించాడు జయంత్ భాయ్. దీనికి ఆటోడ్రైవర్ అయితే బెటరనే  నిర్ణయానికి వచ్చేశాడు. ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. ఆటోడ్రైవర్‌తో పార్శిల్ బాంబును తన ప్రియురాలి ఇంటికి పంపాడు జయంత్. పార్శిల్ వచ్చిన సమయంలో జయంత్ ప్రియురాలు ఇంట్లో లేదు. దాన్ని ఆమె భర్త పార్శిల్‌ను తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో టేప్ రికార్డర్ ఉంది. దాన్ని ఆన్ చేయగానే భారీ శబ్దంతో పేలిపోయింది. స్పాట్‌లో జీతాభాయ్ చనిపోయాడు. 12 ఏళ్ల పెద్ద కుమార్తె భూమికకు తీవ్రగాయాలయ్యాయి. ఇరుగుపొరుగువారు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మార్గమధ్యలోనే చనిపోయింది.

Also Read: రేపే నీట్ ఎగ్జామ్.. విద్యార్థులూ వీటిని మరచిపోకండి..

ఈ కేసు పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. చివరకు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన సమయంలో ప్రియురాలు ఇంట్లో లేకపోవడంతో ఖాకీలకు అనుమానం వచ్చింది. ఇందులో ప్రియురాలి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×