E-Paper
Advertisement

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Indiramma Houses: హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. GHMC పరిధిలో స్థలాల కొరత కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. జీహెచ్‌ఎంసీ, క్యూర్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్ష ఇళ్లను నిర్మించి అందించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మొదటి విడతగా స్థలాలు సేకరించిన 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున మొత్తం 7,680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాల బ్రోచర్‌ను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా విడుదల చేశారు.

పక్కా ప్రణాళికతో బహుళ అంతస్తులు
గ్రేటర్ పరిధిలో భూముల కొరతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఇళ్లను బహుళ అంతస్తుల రూపంలో నిర్మించనున్నారు. వాస్తు నియమాలను పాటిస్తూ తూర్పు, పడమర ముఖ ద్వారాలతో ఈ ఫ్లాట్లను రూపుదిద్దుతున్నారు. ప్రతి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విస్తీర్ణం 528 చదరపు అడుగులు ఉండగా, కార్పెట్ విస్తీర్ణం 400 చదరపు అడుగులుగా నిర్ధారించారు. లబ్ధిదారులకు ద్విచక్ర వాహనాల పార్కింగ్ సదుపాయం మాత్రమే కల్పిస్తున్నారు. ముఖ్యంగా, దళారుల బారిన పడకుండా, నిరుపేదలకే ఈ ఇళ్లు శాశ్వతంగా చెందేలా చూసేందుకు, ఇల్లు పొందిన లబ్ధిదారులు రాబోయే 10 ఏళ్ల వరకు దానిని విక్రయించడానికి వీలులేకుండా కఠిన నిబంధన విధించారు.

Advertisement

లబ్ధిదారుల వాటా ఎంత? చెల్లింపుల షెడ్యూల్ ఎలా ఉంటుంది?
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల భారీ సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన లబ్ధిదారుల వాటా సుమారు రూ. 6 లక్షలుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు ఒకేసారి కాకుండా, నిర్మాణ దశలను బట్టి విడతలవారీగా చెల్లించే వెసులుబాటు కల్పించారు

కేటాయింపు సమయంలో: రూ. 1,00000
ఆర్సీసీ (RCC) స్లాబ్ నిర్మాణం వద్ద: రూ. 2,00000
ఫినిషింగ్ (ముగింపు) దశలో: రూ. 2,00000
తాళాలు అప్పగించే సమయంలో: మిగిలిన బ్యాలెన్స్ మొత్తం చెల్లించాలి.

Advertisement

తొలి విడత ఇళ్ల నిర్మాణం జరిగే 16 నియోజకవర్గాలు ఇవే!
ప్రస్తుతానికి ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభిస్తున్న 16 ప్రధాన నియోజకవర్గాలు, వాటి పరిధిలోని ప్రాంతాలు ఇవే:

రాజేంద్రనగర్ (మైలార్‌దేవ్‌పల్లి), మహేశ్వరం (జల్పల్లి), శేరిలింగంపల్లి (రాయదుర్గం), ఇబ్రహీంపట్నం (బండ్లగూడ ఎల్‌ఐజీ కాలనీ), మల్కాజ్‌గిరి (కౌకూర్), నాంపల్లి (రెడ్‌హిల్స్ వాటర్ బోర్డు పక్కన, నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో), ఖైరతాబాద్ (హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలో), కార్వాన్ (కుల్సుంపురా), బహదూర్‌పురా (సంది ముసలిగూడ), అంబర్‌పేట (సిటీ పోలీస్ లైన్స్), కూకట్‌పల్లి (కేపీహెచ్‌బీ కాలనీ), మేడ్చల్ (పోచారం ఎల్‌ఐజీ కాలనీ), కుత్బుల్లాపూర్ (గాజులరామారం), సనత్‌నగర్ (పాటిగడ్డ), సికింద్రాబాద్ కంటోన్మెంట్ (మారేడ్‌పల్లి, మహేంద్రహిల్స్), మలక్‌పేట (గడ్డిఅన్నారం ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్). మిగతా 10 నియోజకవర్గాల్లోనూ త్వరలోనే స్థలాలను సేకరించి పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు & నిబంధనలు
ఈ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే నిరుపేదలు కొన్ని ప్రాథమిక అర్హతలను కలిగి ఉండాలి:
బాధితులు లేదా దరఖాస్తుదారులు కనీసం 10 ఏళ్లుగా క్యూర్/జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసిస్తూ ఉండాలి.
సొంతంగా ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాటు ఉండకూడదు. గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి గృహ నిర్మాణ ప్రయోజనం పొంది ఉండకూడదు.
దరఖాస్తుదారు ప్రస్తుతం తాము నివసిస్తున్న నియోజకవర్గ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కుటుంబ వార్షిక రాబడి రూ. 6 లక్షల లోపు ఉండాలి.

రిజర్వేషన్లు: ఎస్సీ (14%), ఎస్టీ (5%), బీసీ (16%), దివ్యాంగులు (5%), అవుట్‌సోర్సింగ్/4వ తరగతి/పారిశుద్ధ్య కార్మికులకు (10%) కేటాయించారు. ఈ అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 30% ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50% సీట్లు జనరల్ విభాగానికి చెందుతాయి.

• దరఖాస్తు విధానం, చివరి తేదీ వివరాలు
లబ్ధిదారులు అత్యంత సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.
దరఖాస్తు మార్గాలు: మీ-సేవా కేంద్రాలు, మీ-సేవా అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రత్యేక వాట్సప్ నంబర్ (80969 58096) ద్వారా ఆధార్ కార్డు వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు వివరాలు: దరఖాస్తు రుసుము రూ. 100 (తిరిగి ఇవ్వబడదు). టోకెన్ అడ్వాన్స్ కింద రూ. 10,000 చెల్లించాలి. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఈ రూ.10,000 రీఫండ్ చేస్తారు. ఇల్లు కేటాయిస్తే లబ్దిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.
చివరి తేదీ: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఆగస్టు 10.

హైదరాబాద్ మహా నగరంలో తమకంటూ ఒక నీడను ఏర్పరచుకోవాలనుకునే పేద కుటుంబాలకు ఇది ఒక గొప్ప అవకాశం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కలెక్టరేట్ల వద్ద గుంపులుగా క్యూ కట్టకుండా, ఇంట్లోనే ఉండి వాట్సప్ లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

Related News

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×