E-Paper
Advertisement

Gaming Laptops: 2025లో బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్.. గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్‌ కోసం ఇవి పర్ఫెక్ట్

Gaming Laptops: 2025లో బెస్ట్ గేమింగ్ ల్యాప్ టాప్స్.. గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్‌ కోసం ఇవి పర్ఫెక్ట్
Advertisement

Gaming Laptops| ఈ రోజుల్లో ఆన్ లైన్ వర్క్, ఇతర ఉపయోగాల కోసం ప్రతి ఒక్కరూ లాప్ టాప్స్ వినియోగిస్తున్నారు. అయితే సాధారణ ల్యాప్ టాప్స్ కంటే గేమింగ్ లాప్‌టాప్స్ భిన్నం. ఈ ల్యాప్ టాప్స్ లో హై కాన్ఫిగరేషన్ ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్, స్టోరేజ్ అన్నీ భారీ స్థాయిలో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్స్ కేవలం గేమ్స్ ఆడడానికి మాత్రమే కాదు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, 3D ఆర్టిస్టులు, గేమ్స్ టెస్టింగ్ చేసే సీరియస్ గేమర్లు, ఇతర క్రియేటర్లకు కూడా పర్ఫెక్ట్ వర్క్‌స్టేషన్‌లు.

ఇవి చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు, సూపర్ GPUలు, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌లు కలిగి ఉంటాయి. అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌లతో కూడా వస్తాయి. గంటలకొద్దీ గేమ్ ఆడినా లేదా హెవీ సాఫ్ట్‌వేర్ రన్ చేసినా హీట్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తాయి.

Advertisement

గేమింగ్ లాప్‌టాప్‌లో ముఖ్యంగా NVIDIA RTX సిరీస్ గ్రాఫిక్స్ కార్డ్ ఉండాలి, ఎందుకంటే అది గేమ్స్‌ను హై సెట్టింగ్స్‌లో ల్యాగ్ లేకుండా రన్ చేస్తుంది. అలాగే ఫాస్ట్ ప్రాసెసర్, 144Hz లేదా అంతకంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మంచి కూలింగ్ సిస్టమ్ ఉంటే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుంది. వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో వంటి ప్రోగ్రామ్‌లు కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. ప్రస్తుతం 2025లో హై ఎండ్ గేమింగ్ ల్యాప్ టాప్స్ టాప్ 5 ఇవే..

1. Acer SmartChoice ALG – పోర్టబుల్, తేలికైన ల్యాప్ టాప్

ఈ సూపర్ ఫాస్ట్ ల్యాప్ టాప్ వెయిట్ కేవలం 1.99 కేజీలు మాత్రమే, కాలేజీ స్టూడెంట్స్ లేదా ట్రావెల్ చేసేవాళ్లకు బెస్ట్ సూటెబుల్. 15.6 ఇంచుల 144Hz డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్, NVIDIA RTX 3050 GPU, 16GB RAM, 512GB SSD. హై సెట్టింగ్స్‌లో PUBG, Valorant, GTA V వంటి గేమ్స్ ల్యాగ్ లేకుండా ఆడొచ్చు.

2. Dell SmartChoice G15-5530 – ఆల్ రౌండర్, బెస్ట్ వాల్యూ

Advertisement

ఇది మార్కెట్‌లో బెస్ట్ ఓవరాల్ గేమింగ్ లాప్‌టాప్. 13వ జెనెరేషన్ ఇంటెల్ కోర్ i5, RTX 3050 GPU, 15.6 ఇంచుల 120Hz FHD స్క్రీన్, 16GB RAM + 1TB SSD స్టోరేజ్. బిల్డ్ క్వాలిటీ బాగుంది, RGB బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంది. గేమింగ్ + ఎడిటింగ్ టాస్క్‌లు రెండూ బాగా చేస్తుంది.

3. ASUS TUF F15 – ఎక్కువ కాలం నిలిచే డ్యూరబుల్ మెషిన్

ఈ సిరీస్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో ఫేమస్. 11th Gen i5 ప్రాసెసర్, RTX 2050 GPU, 144Hz డిస్‌ప్లే, 16GB RAM, 512GB SSD. రఫ్ యూజ్ చేసేవాళ్లకు ఈ ల్యాప్‌టాప్ పర్ఫెక్ట్.

4. Lenovo LOQ – పవర్ + కూలింగ్‌లో టాప్

12th Gen i5, RTX 3050 GPU, 144Hz IPS డిస్‌ప్లే. ప్రత్యేకమైన హైపర్‌చాంబర్ కూలింగ్ సిస్టమ్ వల్ల గంటలు ఆడినా ల్యాప్ టాప్ హీట్ అయ్యే సమస్య ఉండదు. దీని వేరియంట్ 16GB DDR5 RAM + 512GB SSD.

5. HP Victus – స్టైలిష్ లుక్ + హై పెర్ఫామెన్స్

చాలా అందంగా కనిపించే డిజైన్. 12th Gen i5, 4GB RTX 3050, 144Hz FHD IPS స్క్రీన్, 16GB DDR5 RAM, 512GB SSD. స్టైల్ + పవర్ రెండూ కావాల్సిన గేమర్స్‌కి ఇది బెస్ట్.

కొనేముందు గమనించాల్సిన కీ ఫీచర్స్

ప్రాసెసర్: Intel Core i5 (12th Gen లేదా అంతకంటే లేటెస్ట్)
GPU: NVIDIA RTX 3050 లేదా అంతకంటే బెటర్
డిస్‌ప్లే: 144Hz లేదా 165Hz FHD/ QHD
RAM: కనీసం 16GB (DDR5 బెటర్)
స్టోరేజ్: SSD (512GB+)
కూలింగ్: అడ్వాన్స్‌డ్ వేపర్ ఛాంబర్ లేదా లిక్విడ్ మెటల్

గేమింగ్ లాప్‌టాప్ ఎందుకు కొనాలి?

డెస్క్‌టాప్ పవర్‌ను పోర్టబుల్‌గా తీసుకెళ్లొచ్చు. హై-ఎండ్ గేమ్స్ (Cyberpunk, Call of Duty, Fortnite) స్మూత్‌గా ఆడొచ్చు. అదే లాప్‌టాప్‌తో Adobe Premiere, After Effects, Blender వంటి ప్రో సాఫ్ట్‌వేర్ కూడా ఈజీగా రన్ అవుతాయి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 4-5 ఏళ్లు టెన్షన్ లేకుండా ఉపయోగించొచ్చు.

Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×