Best Gaming Mobiles: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఒకే సందేహం ఏ ఫోన్ కొనాలి? అని. మార్కెట్లో ప్రతిరోజూ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి, ప్రతి కంపెనీ తమ ఫోన్‌నే బెస్ట్ అని చెబుతోంది. కానీ నిజంగా ఏది పనితీరు పరంగా, బ్యాటరీ లైఫ్ పరంగా, గేమింగ్‌లో ఏది బెస్ట్ తెలుసుకోవడం కాస్త కష్టమే. ప్రస్తుతం మార్కెట్లో వచ్చిన కొత్త మోడళ్లలో గేమర్లను దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన పనితీరు చూపిస్తున్న ఫోన్లు ఎన్నో ఉన్నాయి. ఈ ఫోన్లు కేవలం గేమింగ్‌కే కాకుండా కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే పనితీరు, చిప్‌సెట్ శక్తి పరంగా కూడా స్మార్ట్‌ఫోన్లలో టాప్ రేంజ్‌లో ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్‌మి పి3 5జి – ధర సుమారు రూ.18,999
మొదటగా రియల్‌మి పి3 5జి గురించి మాట్లాడితే, ఈ ఫోన్ గేమర్లకు నిజంగా పర్‌ఫెక్ట్ అని చెప్పాలి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 5జి చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 750కె అంటుటు స్కోర్ సాధించింది అంటే దీని గేమింగ్ పనితీరు ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. 6000mAh టైటాన్ బ్యాటరీతో 8.5 గంటల వరకూ నిరంతరంగా బిజిఎంఐ లేదా COD ఆడవచ్చు. ఈ ఫోన్ ఐపి69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి గేమింగ్ సెషన్‌లో నీరు తగిలినా సమస్య ఉండదు. ధర సుమారు రూ.18,999. గేమింగ్ కోసం ల్యాగ్ లేకుండా, ఫోన్ వేడి ఎక్కకుండా స్మూత్‌గా ఆడటానికి ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఐక్యూ జెడ్ 10ఎక్స్ – ధర రూ.17,009
ఐక్యూ జెడ్ 10ఎక్స్ కూడా గేమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ ఉంది. ధర రూ.17,009 మాత్రమే. ఇందులో 6500mAh భారీ బ్యాటరీ ఉండటం వల్ల రోజంతా గేమ్స్ ఆడినా బ్యాటరీ పూర్తిగా ఖాళీ కావడం కష్టం. 50ఎంపి కెమెరా, ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉండటం దీని బలమైన అంశాలు. ఐక్యూ ఫోన్లు సాధారణంగా గేమింగ్‌లో హై పెర్ఫార్మెన్స్ ఇస్తాయని పేరుంది. ఫ్రేమ్ డ్రాప్‌లు లేకుండా స్మూత్ అనుభవం ఇవ్వడం దీని ప్రత్యేకత.
రియల్‌మే నార్జో 70 టర్బో 5జి – ధర కేవలం రూ.14,528
రియల్‌మే నార్జో 70 టర్బో 5జి గేమింగ్ ప్రపంచంలో మరో అద్భుతం. దీని ధర కేవలం రూ.14,528 మాత్రమే అయినా, పరిమాణం(Dimensity) 7300 శక్తి, 5జి చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ (Stainless Steel Vapor Cooling) సిస్టమ్ ఉంది. అంటే ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కే సమస్య ఉండదు. 5000mAh బ్యాటరీతో పాటు 1080×2400 ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే గేమ్ విజువల్స్ అద్భుతంగా చూపిస్తుంది. ఈ ధరలో ఇంత మంచి ఫీచర్లతో ఫోన్ రావడం నిజంగా గేమర్లకు వరం.
వివో టి4x 5జి – ధర రూ.13,499
వివో టి4x 5జి కూడా గేమ్స్ అడుకునే వారికి అద్భుతమైన ఫోన్. రూ.13,499 ధరలో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. పరిమాణం (Dimensity) 7300 ప్రాసెసర్ ఉండటం వలన గేమ్స్‌ను సులభంగా రన్ చేస్తుంది. రెండు రోజుల పాటు బ్యాటరీ సపోర్ట్ ఇస్తుంది. ఐపి64 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ బాడీ ఉండటం దీని విశేషం. ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉన్నప్పటికీ బ్రైట్‌నెస్, కలర్స్ అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఫోన్ గేమింగ్‌తో పాటు రోజువారీ ఉపయోగంలోనూ చక్కని పనితీరు చూపించే ఫోన్.
Also Read: Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్ క్లాస్ లుక్.. రూ.8వేల స్మార్ట్‌వాచ్ జస్ట్ రూ1,799లకే
ఒప్పో కె13 5జి – ధర రూ.17,999
ఒప్పో కె13 5జి గురించి చెప్పుకుంటే, దీని ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. రూ.17,999 ధరలో 50ఎంపి కెమెరా, ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, మరియు అద్భుతమైన డిజైన్ ఉంది. దీని బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం గేమింగ్ చేయాలనుకునే వారికి ఇది చాలా సరైన ఎంపిక. ఒప్పో బ్రాండ్ అంటే స్టై, స్ట్రెంత్ రెండూ కలిపిన ప్యాక్.
ఒప్పో ఎక్స్6 ప్రో – ధర రూ.19,999
ఒప్పో ఎక్స్6 ప్రో కూడా గేమర్లకు టాప్ క్లాస్ అనుభవం ఇస్తుంది. రూ.19,999 ధరలో 64ఎంపి కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. కానీ దీని ముఖ్యమైన హైలైట్ 1220×2712 రిజల్యూషన్ ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే. దీని స్పెక్ స్కోర్ 64.8శాతం గా ఉంది. హై గ్రాఫిక్స్ గేమ్స్ చాలా స్మూత్‌గా ఆడవచ్చు. గేమ్‌ప్లేలో ఏ లాగ్ లేకుండా ఫ్రేమ్ స్టెబిలిటీ అద్భుతంగా ఉంటుంది.
లావా అగ్ని 3 5జి – ధర రూ.18,380
లావా అగ్ని 3 5జి కూడా గేమింగ్ కోసం విలువైన ఫోన్. ఇది భారతీయ బ్రాండ్ అయినా అంతర్జాతీయ స్థాయి పనితీరును ఇస్తుంది. రూ.18,380 ధరలో 50ఎంపి కెమెరా, 5000mAh బ్యాటరీ, 1200x2652px రిజల్యూషన్ కలిగి ఉంది. దీని డిస్‌ప్లే చాలా నిటారుగా ఉంటుంది. గేమ్స్, వీడియోలు రెండూ సూపర్‌గా కనిపిస్తాయి. స్పెక్ స్కోర్ 64.6శాతం ఉండటం దీనికి ప్లస్ పాయింట్.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ35 5జి – ధర రూ.17,999
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ35 5జి అంటే పేరు వింటేనే నమ్మకం వస్తుంది. రూ.17,999 ధరలో 50ఎంపి కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, స్మూత్ యూఐ, శామ్‌సంగ్ క్యూరియాసిటి కలిపి గేమింగ్ అనుభవాన్ని మరో దశకు తీసుకెళ్తాయి. దీని పనితీరు 60.4శాతం. సురక్షితమైన, గేమింగ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
రియల్‌మే నార్జో 80 ప్రో 5జి – ధర రూ.21,498
రియల్‌మే నార్జో 80 ప్రో 5జి కూడా గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. రూ.21,498 ధరలో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్, 6000mAh బ్యాటరీతో వస్తుంది. 50ఎంపి కెమెరా, ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్ టాప్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని స్పెక్ స్కోర్ 57.6శాతం అయినప్పటికీ ప్రీమియం ఫీల్ కలిగిన డిజైన్, స్మూత్ అనుభవం ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. పైన చెప్పిన వివరాల ప్రకారం, 20 వేల రూపాయలలోపు ఈ ఫోన్లు గేమింగ్‌కే కాకుండా రోజువారీ వాడకంలోనూ టాప్ స్థాయి పనితీరు చూపిస్తున్నాయి. అందుకే గేమింగ్ ప్రియులు ఈ ఫోన్లను తప్పకుండా పరిశీలించాల్సిందే.