BigTV English
Advertisement

Shraddha Kapoor: కొత్త అవతారం ఎత్తిన శ్రద్ధా కపూర్.. ఏకంగా హాలీవుడ్లో!

Shraddha Kapoor: కొత్త అవతారం ఎత్తిన శ్రద్ధా కపూర్.. ఏకంగా హాలీవుడ్లో!

Shraddha Kapoor: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒకే విభాగంలో సెటిల్ కాకుండా వివిధ విభాగాలలో తమ టాలెంట్ ను నిరూపిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సింగర్ లుగా అవతారం ఎత్తితే.. మరికొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులుగా తమకంటూ ఒక గుర్తింపును అందుకుంటున్నారు. అయితే ఈ డబ్బింగ్ ఆర్టిస్టులుగా మారిన హీరోయిన్స్ తోటి నటీమణులకు డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఇప్పుడు కార్టూన్స్ కి కూడా డబ్బింగ్ చెబుతూ అతి కష్టమైన పనిని చాలా సునాయాసంగా చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.


ఇప్పటికే కీర్తి సురేష్ (Keerthy Suresh)కూడా.. ప్రభాస్(Prabhas ) నటించిన ‘కల్కి’ సినిమాలో బుజ్జి వెహికల్ కు ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పి హైలెట్గా నిలిచింది. ఇప్పుడు ఈమె బాటలోనే శ్రద్ధ కపూర్ కూడా నడుస్తోంది. అయితే ఇండియన్ భాషలలో కాకుండా హాలీవుడ్ భాషలలో ఈమె డబ్బింగ్ చెప్పడానికి సిద్ధం అయ్యింది. మరి ఏ సినిమాలో ఏ పాత్రకు శ్రద్ధా కపూర్ డబ్బింగ్ చెప్పడానికి సిద్ధం అయిందో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధ కపూర్. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించిన సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం ‘జూటోపియా 2’ త్వరలో రానున్న విషయం తెలిసిందే. జూటోపియాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పుడు డిస్నీ సంస్థ నుంచి రాబోతున్న 64వ యానిమేషన్ చిత్రం కావడంతో ఇప్పుడు దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో కీలకమైన జూడీ హోప్స్ అనే ఉత్సాహవంతులైన కుందేలు పోలీస్ అధికారి పాత్రకు హిందీలో ఈమె తను వాయిస్ ఓవర్ ను అందించబోతున్నట్లు వాల్ట్ డిస్నీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ఇండియా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. “అద్భుతమైన నటి శ్రద్ధ కపూర్ జూటోపియా 2 ఫ్యామిలీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ తెలిపింది.


ALSO READ:Jana Nayagan: ఆడియో లాంచ్ కి ముహూర్తం ఫిక్స్.. తమిళనాడులో మాత్రం కాదండోయ్!

స్పందించిన శ్రద్ధా కపూర్..

ఇకపోతే ఈ విషయంపై శ్రద్ధా కపూర్ స్పందిస్తూ.. “అద్భుతమైన జూడీ హోప్స్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పడం నాకు మరింత సంతోషంగా ఉంది. ఆమె ధైర్యవంతురాలు.. సాహసి కూడా.. చిన్నప్పటి నుంచి చాలా క్యూట్ గా ఉంటుంది. అలాంటి పాత్రకు నేను డబ్బింగ్ చెబుతున్నాను అని తెలిసి నాకు నేనే నమ్మలేకపోతున్నాను” అంటూ శ్రద్ధా కపూర్ తెలిపింది. జారెడ్ బుష్, బైరన్ హోవార్డ్ దర్శకత్వం వహించగా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ , హిందీ తో పాటు తెలుగు , తమిళ్ భాషలలో కూడా విడుదల కానుంది. ఇంకా ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాల్ట్ డిస్నీ ప్రపంచంలో శ్రద్ధ అడుగుపెట్టబోతోందని తెలిసి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

శ్రద్ధా కపూర్ సినిమాలు..

గత ఏడాది స్త్రీ 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు ఫాంటసీ త్రయం నాగిన్ సినిమాలో నటిస్తోంది. అలాగే విఠబాయి నారాయణ్‌గావ్కర్‌ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈతా అనే సినిమాలో నటిస్తోంది. అలాగే చాలా బాజ్ ఇన్ లండన్ , రిజిన్ అనే చిత్రాలలో నటిస్తోంది.

Related News

Vijay Varma: డిప్రెషన్ లో తమన్నా మాజీ లవర్… ఆమె లేకపోతే పిచ్చోడినయ్యానంటూ!

Sandeep Reddy: సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ కన్ఫర్మ్..హింట్ ఇచ్చిన డైరెక్టర్?

Bhagya Shri Borse: భాగ్యశ్రీ కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలా..రామ్ లో ఉన్నాయా?

Jana Nayagan: ఆడియో లాంచ్ కి ముహూర్తం ఫిక్స్.. తమిళనాడులో మాత్రం కాదండోయ్!

Anupama: అనుపమ మార్ఫింగ్ ఫోటోలు.. నిందితులు ఎవరో తెలిసిందంటూ పోస్ట్!

Maheshbabu : హీరోగా ఘట్టమనేని జయకృష్ణ లాంఛ్.. శ్రీనివాస్ మంగాపురం టైటిల్ తో!

Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. పశ్చాతాపడుతున్నాడా?

Big Stories

×