Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ (Hong Kong Sixes 2025 ) విజేతగా పాకిస్తాన్ నిలిచింది. అందరూ ఊహించినట్లుగానే మరోసారి హాంకాంగ్ సిక్సెస్ ఛాంపియన్ గా పాకిస్తాన్ నిలిచి, సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024 టోర్నమెంట్ లో శ్రీలంక విజేతగా నిలువగా పాకిస్తాన్ రన్నరప్ గా నిలిచింది. అయితే ఈ ఏడాది టోర్నమెంట్ లో కువైట్ రన్నరప్‌గా నిలువగా పాకిస్తాన్ ఛాంపియన్ అయింది. ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 43 పరుగుల తేడాతో కువైట్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. దీంతో ఆరోసారి టైటిల్ గెలిచింది పాకిస్తాన్. దీంతో సంబరాలు అంబరాన్ని అంటాయి.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో పసికూన కువైట్ వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Kuwait, Final) మధ్య ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ( Pakistan ) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఆరు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 135 పరుగులు సాధించింది. ఓపెనర్ అబ్దుల్ సమాద్ 42 పరుగులు చేయక కవాజా 22 పరుగులతో రాణించాడు. మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది ( Abbas Afridi) 11 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
ఇందులో ఏడు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. దీంతో 135 పరుగులు చేసింది పాకిస్తాన్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కాస్త తడబడింది పాకిస్తాన్. ఓపెనర్ అడ్నాన్ వరుసగా సిక్సర్లతో 30 పరుగులు చేసి రెచ్చిపోగా మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన కువైట్ ఓడిపోయింది. పాకిస్తాన్ పై ఛేజింగ్ చేసే క్రమంలో 5.1 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఉన్న ఆరుగురు ప్లేయర్లు వికెట్ సమర్పించుకున్నారు. దీంతో 43 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ (Hong Kong Sixes 2025 )గా పాకిస్తాన్ నిలిచిన నేపథ్యంలో ఆ జట్టుకు ఆరవ ట్రోఫీ దక్కింది. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది పాకిస్తాన్. 1992, 1997, 2001, 2002, 2011 సంవత్సరాలలో హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. 2003, 2006, 2010, 2012, 2017, 2024 టోర్నమెంట్లలో రన్నరప్‌గా పాకిస్తాన్ నిలిచింది. దీంతో హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ లో ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. అటు ఇండియాకు ఒకే ఒక్కసారి ట్రోఫీ దక్కింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి, అన్నిటిలో ఓడి, ఇంటి దారి పట్టింది టీమిండియా ( Team India). ఇక ఈ 2025 ఛాంపియన్ గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు దాదాపు 30 కోట్ల నజరానా దక్కే ఛాన్స్ ఉంది.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
PAKISTAN HAS WON THE HONG KONG SIXES 2025 TROPHY!🏆🇵🇰 pic.twitter.com/w5zChs1HB0
— junaiz (@dhillow_) November 9, 2025
Pakistan 🇵🇰 into the Hong Kong sixes final for 6th consecutive time
2010 ✅️
2011 ✅️
2012 ✅️
2017 ✅️
2024 ✅️
2025 ✅️Congratulations 🇵🇰 pic.twitter.com/Kg22QRmFI3
— Nibraz Ramzan (@nibraz88cricket) November 9, 2025