Resume Building Free AI Tools| చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కావాలనుకుంటే ముందుగా మంచి రెజ్యూం రెడీ చేయాలి. జాబ్ ఇంటర్‌వ్యూలో ముందుగా మీ రెజ్యూం చూస్తారు. ఆ రెజ్యూమ్ ఉద్యోగస్తులకు మీ తొలిపరిచయం లాంటింది. అందుకే రెజ్యూమ్ తయారు చేయడం చాలా ముఖ్యం.
ఉద్యోగం కోసం ప్రయత్నించే మిగతా అప్లికెంట్ల కంటే మీరు భిన్నంగా కనిపించాలంటే రెజ్యూమ్ చాలా స్పెషల్ గా ఉండాలి. అయితే చాలా మందికి రెజ్యూమ్ రాయడం కష్టమనిపిస్తుంది. 2025లో ఆధునిక AI టూల్స్ ఈ పనిని సులువు చేస్తున్నాయి. ఈ AI అసిస్టెంట్లు రెజ్యూమ్‌ను తయారు చేయడం, ఫార్మాట్ చేయడం, ఎడిట్ చేయడం చాలా ఈజీగా చేస్తాయి. ఇవన్నీ చాలావరకు ఉచితమే. బెస్ట్ రెజ్యూమ్ బిల్డర్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం.
ఓపెన్‌ఏఐ ఇండియాలో ఉచిత ప్రమోషనల్ ప్లాన్ ఇస్తోంది. చాట్‌బాక్స్‌లో మీ అవసరాన్ని వివరించండి. కొన్ని సెకన్లలో పూర్తి, ప్రొఫెషనల్ రెజ్యూమ్ టెక్స్ట్ వస్తుంది. ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రారంభం. రెజ్యూమ్ లో ఏదైనా భాగం నచ్చలేదు.. దాన్ని మార్చమంటే మళ్లీ రాయిస్తుంది.
గూగుల్ జెమినీ మీకోసం ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుంది. మీ విద్య అర్హత, జాబ్ ఎక్స్‌పీరియన్స్, మీ నైపుణ్యాల గురించి ఆకర్షణీయమైన సారాంశాలు, బులెట్ పాయింట్లు రాస్తుంది. మీ రెజ్యూమ్ లోని లోపాలను తొలగించి అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. మీ రంగానికి సరిపడా స్పష్టత, ప్రభావం కల్పిస్తుంది. ఇది మీ అప్లికేషన్‌ను హైలైట్ చేస్తుంది.
మెటా AI వాట్సాప్ వంటి యాప్స్‌లో ఉంటుంది. స్పష్టమైన, చిన్న రెజ్యూమ్ డ్రాఫ్ట్ చేస్తుంది. మీ అనుభవం, కీలక స్కిల్స్‌ను సంక్షిప్తంగా, స్పష్టంగా చూపిస్తుంది. మీ ఉపయోగించే భాష నుంచి ప్రొఫెషనల్ భాషకు రెజ్యూమ్ ను స్టైలిష్‌గా మారుస్తుంది. ఇందులో రాయడం సులువు, సహజంగా అనిపిస్తుంది.
మైక్రోసాఫ్ట్ కో-పైలట్ మీ సమస్యను క్షణాల్లో పరిష్కరిస్తుంది! మైక్రోసాఫ్ట్ వర్డ్, పవర్‌పాయింట్‌లో కో-పైలట్ ఏఐ బెస్ట్‌గా పని చేస్తుంది. మీ కెరీర్‌కు సరిపడా రెజ్యూమ్ తయారు చేస్తుంది. ATS (అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్) స్కోర్ పెంచుతుంది. స్కోర్ ఎక్కువైతే మీ రెజ్యూమ్ ఎక్కువ కంపెనీలకు కనిపిస్తుంది.
ఎక్స్ (ట్విట్టర్) గ్రోక్ AI కూడా రెజ్యూమ్‌ని ఆకర్షణీయంగా తయారు చేస్తుంది. ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ భాష బాగా రాస్తుంది. ఆకర్షణీయ సారాంశాలు ఇస్తుంది. చివరికి స్వచ్ఛమైన, పాలిష్ చేసిన ప్రొఫెషనల్ రెజ్యూమ్ అందిస్తుంది. రియల్ టైమ్‌లో సమాధానాలు ఇచ్చి వేగంగా సహాయం చేస్తుంది!
ఇంకెందుకు ఆలస్యం రెజ్యూమ్ టెన్షన్ పక్కన పెట్టి.. ఉద్యోగం కోసం సిద్ధం కండి. ఈ ఉచిత ఆన్‌లైన్ టూల్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.
Also Read: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి