E-Paper
Advertisement

Vivo 200MP Phone Discount: వివో 200MP కెమెరా ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఆఫర్ జనవరి 31 వరకే

Vivo 200MP Phone Discount: వివో 200MP కెమెరా ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఆఫర్ జనవరి 31 వరకే
Advertisement

Vivo 200MP Cameraphone Discount| ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో బ్రాండ్ లో స్పెషల్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ వివో X300 సిరీస్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ సిరీస్ కంటే అంతకుముందు వెర్షన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వివో X200 సిరీస్ ఫోన్ల హవా నడిచింది. X200 సిరీస్ లో హై ఎండ్ మోడల్ X200 ప్రో 5G చాలా పాపులర్. ఈ వివో X200 ప్రో ధర ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ భారీగా తగ్గింది.

ఈ ఫోన్‌లో అద్భుతమైన 200MP టెలిఫోటో కెమెరా ఉంది. ఈ ఆఫర్‌తో కొనుగోలుదారులు రూ.9,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే వాలిడ్ ఉంది. ఆ తరువాత ధర మళ్లీ పెరిగిపోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రీమియం ఫోన్‌ను మరింత సులభంగా సొంతం చేసుకోవచ్చు.

వివో X200 ప్రో 5G ధర, డిస్కౌంట్ ఆఫర్లు

Advertisement

అమెజాన్ ఇండియాలో 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,999గా లిస్ట్ అయింది. కస్టమర్లకు రూ.9,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ధర చాలా తగ్గుతుంది. అదనంగా రూ.4,749 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.44,450 వరకు ఆదా అవుతుంది. ఎక్స్‌ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లతో ఫోన్ మరింత అందుబాటు ధరలోకి వస్తుంది.

ప్రీమియం డిస్‌ప్లేలో అధిక బ్రైట్‌నెస్

వివో X200 ప్రోలో 6.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2800 x 1260 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్స్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ ఉండటంతో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డిస్‌ప్లే ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, స్టోరేజ్

Advertisement

ఈ ఫోన్‌లో 16GB LPDDR5x ర్యామ్ ఉంది. మల్టీటాస్కింగ్, యాప్స్ త్వరగా ఓపెన్ అవుతాయి. 512GB UFS 4.0 స్టోరేజ్‌తో ఫోటోలు, వీడియోలు, యాప్స్ పుష్కలంగా సేవ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో బలమైన పెర్ఫామెన్స్ మంచి బ్యాటరీ సామర్థ్యం లభిస్తుంది.

ఫోటోగ్రఫీ ప్రియులకు అద్భుతమైన కెమెరా సిస్టమ్

వివో X200 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP సెన్సార్. 50MP టెలిఫోటో, 200MP పవర్‌ఫుల్ టెలిఫోటో లెన్స్‌తో జూమ్ ఫోటోలు అద్భుతంగా వస్తాయి. పగలైనా, రాత్రి వేళ్ల తక్కువ లైట్‌లో కూడా స్పష్టమైన ఫోటోలు తీయవచ్చు. సెల్ఫీలకు, విడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, పోర్ట్రెయిట్స్ చాలా బాగుంటాయి.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ఈ ఫోన్‌లో 6,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. రోజంతా సులభంగా ఉపయోగించవచ్చు. 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో త్వరగా చార్జ్ అవుతుంది. హెవీ యూజర్లకు ఇది చాలా సౌకర్యవంతం.

లిమిటెడ్ టైమ్ డీల్‌ను జాగ్రత్తగా పరిగణించండి

ఈ డిస్కౌంట్‌తో వివో X200 ప్రో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఆప్షన్‌గా మారింది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ కలిసి ఉన్నాయి. ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే. ఆసక్తి ఉన్నవారు త్వరగా కొనుగోలు చేయండి, గరిష్ఠ ఆదా పొందండి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×