Flip Phones Discount| స్టైలిష్, యూనిక్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి ఇప్పుడు రెండు గొప్ప ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 (Samsung Galaxy Z Flip7 FE 5G), మోటోరోలా రేజర్ 60 అల్ట్రా (Motorola Razr 60 Ultra) ఫోల్డబుల్ ఫోన్లపై అమెజాన్ ఇండియాలో భారీ తగ్గింపులు ఇస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ బోనస్‌లతో ఫైనల్ ధర మరింత తగ్గుతుంది. పాత ఫోన్ కండిషన్, ఎక్స్‌చేంజ్ పాలసీ బట్టి తగ్గింపు మారుతుంది. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.79,999కి లభిస్తోంది. ఫిబ్రవరి 28 వరకు ఈ ఫోన్ రూ.10,500 ఫ్లాట్ డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. అదనంగా రూ.3,999 వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.41,100 వరకు తగ్గుతుంది. ఈ ఆఫర్లతో ఫైనల్ ధర చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో 6.96 ఇంచ్ FlexView 1.5K pOLED LTPO మెయిన్ డిస్‌ప్లే ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 4 ఇంచ్ QuickView pOLED LTPO కవర్ డిస్‌ప్లే కూడా 165Hz సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో హై-పెర్ఫామెన్స్ ఉంటుంది.
50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4,700mAh పెద్ద బ్యాటరీ ఉంది. 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE 5G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.89,999 లిస్టెడ్ ధరలో ఉంది. ఫిబ్రవరి 28 వరకు రూ.10,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ.4,499 వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. ఎక్స్‌చేంజ్‌తో రూ.49,100 వరకు తగ్గుతుంది.
6.7 ఇంచ్ ఫుల్ HD+ డైనమిక్ ఆమోలెడ్ 2X మెయిన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 3.4 ఇంచ్ సూపర్ ఆమోలెడ్ కవర్ డిస్‌ప్లే, 60Hz రేట్ ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. Exynos 2400 చిప్‌సెట్‌తో సూపర్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.
Also Read: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. ఏది కొనాలి? మీ బెడ్‌రూమ్‌కు ఏది బెస్ట్?
50MP మెయిన్ కెమెరా, 2MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలకు 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Android 16 ఆధారిత One UI 8తో వస్తుంది. స్టీరియో స్పీకర్లు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఉన్నాయి.
రెండు ఫోన్లు ప్రీమియం ఫోల్డబుల్ డిజైన్‌తో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. Motorola పర్‌ఫామెన్స్, కెమెరా పవర్, ఫాస్ట్ ఛార్జింగ్‌పై దృష్టి పెట్టింది. శాంసంగ్ మెరుగైన డిస్‌ప్లే, రిఫైన్డ్ సాఫ్ట్‌వేర్, ట్రస్టెడ్ ఎకోసిస్టమ్ ఇస్తుంది. మీ డిజైన్ ప్రిఫరెన్స్, పర్‌ఫామెన్స్ అవసరాలు, బడ్జెట్ బట్టి ఎంచుకోండి. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే కాబట్టి త్వరగా చూసి కొనుగోలు చేయడం మంచిది.