Predator-Badlands OTT : గత ఏడాది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్’ (Predator Badlands) థియేటర్లలో విడుదలైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో దీనికి మేకర్స్ తెలుగు వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రపంచవ్యాప్తంగా $184 మిలియన్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా మొత్తం హోరెత్తిపోతుంది. ఏలియన్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్. ఇది ఏ ఓటీటీలోకి వస్తోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన ‘ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్’ 2025 నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఫిబ్రవరి 12 నుంచి ప్రీమియర్ అవుతుందని జియో హాట్‌స్టార్ రీసెంట్ గా ఒక ప్రకటన కూడా చేసింది. OTTplay ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో కూడా సినిమాను చూడవచ్చు. డిమిట్రియస్ షుస్టర్-కొలోమటాంగి, ఎల్లే ఫానింగ్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో దీనికి 7.5/10 రేటింగ్ కూడా ఉంది.
సినిమా కథ భవిష్యత్తులో గెన్నా అనే ఒక వేరే గ్రహం మీద జరుగుతుంది. ఇందులో హీరో మనిషి కాదు, ఒక ప్రెడేటర్. అతని పేరు డెక్. మిగతా ప్రెడేటర్ల కంటే కొంచెం చిన్నగా, బలహీనంగా ఉన్నాడని అతన్ని గుంపు నుండి బయటకు పంపేస్తారు. తను కూడా వీరుడని నిరూపించుకోవడానికి ఆ గ్రహం మీద ఉన్న అత్యంత భయంకరమైన కాలిస్క్ అనే రాక్షస మృగాన్ని వేటాడాలని నిర్ణయించుకుంటాడు.
ఈ ప్రయాణంలో డెక్‌కు థియా అనే ఒక సింథటిక్ రోబో పరిచయమవుతుంది. మామూలుగా ప్రెడేటర్లకు, మనుషులకు పడదు కానీ, ఇక్కడ డెక్, థియా ఇద్దరూ కలిసి ఒక టీమ్‌లా మారి వేట మొదలుపెడతారు. వీరికి అడ్డుగా థియా లాంటిదే ఉన్న మరో విలన్ రోబో టెస్సా కూడా వస్తుంది. ఒక పక్క క్రూరమైన జంతువులు, మరోపక్క శత్రువులు.. వీటన్నిటినీ ఎదుర్కొని డెక్ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.
Read Also : ఓటీటీలోకి కామెడీ సినిమా… నలుగురు పెళ్లాలతో పరుగులు పట్టించే సరికొత్త స్టోరీ… ఎక్కడ చూడొచ్చంటే ?