E-Paper
Advertisement

Black Friday Sale 2025: రూ.50 వేల లోపు స్మార్ట్‌ ఫోన్లపై బెస్ట్ డీల్స్, మరీ ఇంత తగ్గింపా?

Black Friday Sale 2025: రూ.50 వేల లోపు స్మార్ట్‌ ఫోన్లపై బెస్ట్ డీల్స్, మరీ ఇంత తగ్గింపా?
Advertisement

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ మెగా బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ను నిర్వహిస్తుంది. నవంబర్ 20 నుంచి  డిసెంబర్ 1 వరకు ఈ సేల్ ను నిర్వహిస్తుంది. ఆన్‌ లైన్ తో పాటు స్టోర్లలోనూ అందుబాటులో ఉంచింది. ఈ సేల్‌ లో స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందిస్తుంది. EMI ఆప్షన్ ను కూడా తీసుకొచ్చింది. రూ. 50,000 లోపు ధరలో ఉన్న టాప్ మోడల్స్‌ పై ఫోకస్ చేస్తూ, బెస్ట్ డీల్స్ అందిస్తుంది.

విజయ్ సేల్స్‌ లో రూ. 50 వేల లోపు స్మార్ట్‌ ఫోన్లపై బెస్ట్ డీల్స్

బ్లాక్ ఫ్రైడే సేల్ వేళ విజయ్ సేల్స్‌ లో సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్లపై ఎమ్మార్పీల కంటే తక్కువ ధరలకు హ్యాండ్‌సెట్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందే వెసులుబాటు కల్పిస్తుంది.  విజయ్ సేల్స్ దేశ వ్యాప్తంగా తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సేల్ ఈవెంట్‌ లో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు, గృహోపకరణాలతో సహా బోలెడు ఎలక్ట్రానిక్ వస్తువులపై క్రేజీ ఆఫర్లు అందిస్తుంది. వినియోగదారులు వారి విష్ లిస్ట్ నుంచి భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కొత్త స్మార్ట్‌ ఫోన్ కోసం షాపింగ్ చేస్తుంటే, బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ. 50,000 లోపు స్మార్ట్‌ ఫోన్లపై మంచి డీల్స్ ఉన్నాయి.

భారీ తగ్గింపు ధరల్లో స్మార్ట్ ఫోన్లు లభ్యం

Advertisement

డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు ఎమ్మార్పీ కంటే కంటే తక్కువ ధరలకు హ్యాండ్‌ సెట్లను కొనుగోలు చేయడానికి బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్ తో చెల్లింపులు చేస్తే  ఫ్లాట్ రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది. అదే ఆఫర్ EMI లావాదేవీలపై కూడా అందుబాటులో ఉంది. Google Pixel 9a ఈ కామర్స్ ప్లాట్‌ ఫామ్‌లో రూ. 49,999 అందుబాటుల ఉండగా, విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఏకంగా 10 శాతం తగ్గింపుతో హ్యాండ్‌ సెట్‌ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్, HDFC బ్యాంక్, HSBC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ క్రెడిట్ కార్డులపై కూడా డిస్కౌంట్లు అందిస్తుంది.

ఆయా స్మార్ట్ ఫోన్లపై అందిస్తున్న తగ్గింపు  

⦿ Google Pixel 9a  ఎమ్మార్పీ రూ. 49,999 ఉండగా రూ. 44,999కే లభిస్తుంది.

Advertisement

⦿  Vivo V60 ఎమ్మార్పీ రూ. 50,999 ఉండగా,  రూ. 45,999కే అందిస్తుంది.

⦿ Oppo Reno 14 5G ఎమ్మార్పీ రూ. 47,999 ఉండగా,  రూ. 44,999కే లభిస్తుంది.

⦿  Samsung Galaxy A56 5G అసలు ధర రూ. 47,999 కాగా, రూ. 44,999కే అందిస్తుంది.

⦿ రియల్‌ మీ జిటి 7 5జి ధర రూ. 42,999 కాగా, సేల్ లో రూ. 39,999కే అందిస్తుంది.

⦿ వన్‌ ప్లస్ 13ఆర్ 5జి ధర రూ. 44,999 కాగా, రూ. 39,999కే అందిస్తుంది.

⦿ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ36 5జి ధర రూ. 38,999 ఉండగా, సేల్ లో రూ. 35,990కే లభిస్తుంది.

⦿ ఒప్పో ఎఫ్31 ప్రో+ 5జి అసలు ధర రూ. 39,999 కాగా, రూ. 32,999కే అందిస్తుంది.

Read Also: పెద్ద బ్యాటరీతో సామ్ సంగ్ నెక్ట్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×