టెక్ దిగ్గజం సామ్ సంగ్.. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే పలు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ కు పరిచయం చేసింది కూడా. త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందించబోతోంది. Galaxy S26 Ultra పేరుతో త్వరలో దేశీ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద బ్యాటరీతో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. Galaxy S24 Ultra 5,000mAh యూనిట్‌ను కలిగి ఉండగా, S26 Ultra దానిని మించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంకా స్పెసిఫికేషన్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
సామ్ సంగ్ Galaxy S26 Ultra కోసం 5,000mAh కంటే ఎక్కువ బ్యాటరీని టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియకపోయినా, సామ్ సంగ్ హైడెన్సిటీ కలిగిన సెల్స్ తో మల్టీ పోటోటైప్స్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ లో పెద్ద బ్యాటరీ తీసుకొచ్చినట్లు అయితే, 2021 తర్వాత అల్ట్రా సిరీస్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడం ఇదే తొలిసారి అవుతుంది. అటు ఆన్ డివైస్ AI ఫంక్షన్లు, మెరుగైన కూలింగ్ వ్యవస్థ, నెక్ట్స్ జెనరేషన్ హై ఎఫిషియెన్సీ డిస్ ప్లేలకు సపోర్టు ఇచ్చేలా ఉండబోతోంది. S26 అల్ట్రా కొత్త స్టాక్డ్ బ్యాటరీ డిజైన్ కు కూడా మారవచ్చని భావిస్తున్నారు.
గెలాక్సీ S26 అల్ట్రాలో డిస్ ప్లే, కెమెరా సెటప్ మరింత మెరుగ్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన పలు లీకుల ప్రకారం, మరింత ఆకట్టుకునే AMOLED ప్యానెల్, తగ్గించిన బెజెల్స్, లోలైట్ ఇమేజింగ్, మెరుగైన జూమ్ తో కూడిన కెమెరా పనితీరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: రూ. 50 వేల స్మార్ట్ టీవీ జస్ట్ రూ. 30 వేలకే, అమెజాన్ అదిరిపోయే ఆఫర్!
గెలాక్సీ S26 అల్ట్రాలో AI-ఆధారిత ఫీచర్లు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఆన్ డివైస్, హైబ్రిడ్ AI ప్రాసెసింగ్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. క్వాల్ కామ్, కొత్త 3nm చిప్ సెట్లపై ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పని చేస్తున్నందున, పెద్ద బ్యాటరీని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సామ్ సంగ్ సాధారణంగా జనవరిలో అల్ట్రా మోడళ్లను విడుదల చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే Galaxy S26 అల్ట్రా జనవరి 2026లో దేశీ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంటుంది. లాంచింగ్ వివరాలు కూడా అంచనా ప్రకారం చెప్పినవే తప్ప, ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also: రియల్ మీ స్మార్ట్ టీవీపై 60% తగ్గింపు, ఫ్లిప్ కార్ట్ లో భలే చౌక బేరం!