E-Paper
Advertisement

Blackberry Clicks: బ్లాక్‌బెర్రీ లాంటి డిజైన్.. ఐఫోన్ లాంటి ఫీచర్స్.. కొత్త ఫోన్ చూశారా?

Blackberry Clicks: బ్లాక్‌బెర్రీ లాంటి డిజైన్.. ఐఫోన్ లాంటి ఫీచర్స్.. కొత్త ఫోన్ చూశారా?
Advertisement

Blackberry Clicks| ఒకప్పుడు బ్లాక్‌బెర్రీ ఫోన్లు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు అందరూ ఎగబడే వారు. ప్రొఫెషనల్స్, నిపుణులు సురక్షిత సంభాషణలు, మంచి ప్రొడక్టవిటీ కోసం బ్లాక్‌బెర్రీని అంతగా నమ్మేవారు. బ్లాక్‌బెర్రీ ఫోన్ కలిగి ఉండటం ప్రొఫెషనల్ స్టేటస్‌కు చిహ్నంగా ఉండేది. తర్వాతి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు రావడంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేశాయి. బ్లాక్‌బెర్రీ క్రమంగా మార్కెట్ నుంచి అదృశ్యమైంది.

అయితే ఇప్పటికీ ఈ ఫోన్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ క్లాసిక్ బ్లాక్‌బెర్రీ స్టైల్ డిజైన్‌ తో లాంచ్ అయింది. ఆధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ పాత లెగసీ డిజైన్ తో పాటు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

క్లిక్స్ కమ్యూనికేటర్ అనే ఈ కొత్త ఫోన్‌లో ఫిజికల్ కీబోర్డ్, ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా రన్ అవుతుంది. క్లిక్స్ కంపెనీ ఇప్పటివరకు ఐఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్ల కోసం కీబోర్డ్ కేసులు తయారు చేస్తూ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తమ మొదటి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫిజికల్ కీబోర్డ్ ఫోన్లను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్ స్థానంలో కాకుండా, సెకండరీ డివైస్‌గా ఉపయోగించేలా డిజైన్ చేశారు. చాటింగ్ ప్రెవేసీ, ప్రొడక్టివిటీకి ఈ ఫోన్ లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ధర, అందుబాటు వివరాలు

క్లిక్స్ కమ్యూనికేటర్ ధర 499 డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ.45,000. రిజర్వేషన్ కోసం 199 డాలర్లు చెల్లిస్తే ఆర్లీ బర్డ్ ధర 399 డాలర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ రిజర్వ్ చేసినవారికి మాత్రమే వర్తిస్తుంది. 2026లో షిప్పింగ్ ప్రారంభమవుతుంది.

బ్లాక్‌బెర్రీ డిజైన్, ఐఫోన్ ఫీచర్స్

Advertisement

ఈ కొత్త ఫోన్ డిజైన్ బ్లాక్‌బెర్రీ, ఐఫోన్ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో క్లాసిక్ QWERTY ఫిజికల్ కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ బ్యాక్‌లిట్‌తో వస్తుంది, చీకట్లో కూడా సులభంగా టైప్ చేయవచ్చు. టచ్ జెస్చర్లు, స్క్రోలింగ్ సపోర్ట్ ఉంది. సైడ్‌లో ప్రోగ్రామబుల్ బటన్ ఉంది, ఐఫోన్ యాక్షన్ బటన్ లాగా పనిచేస్తుంది. ఏర్‌ప్లేన్ మోడ్ కోసం స్పెషల్‌గా డెడికేటెడ్ బటన్ కూడా ఉంది.

డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్‌

డిస్‌ప్లే, బ్యాటరీ, పనితీరు బాగున్నాయి. 4.03 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది, రంగులు స్పష్టంగా కాంట్రాస్ట్ మంచిగా కనిపిస్తాయి. 4000mAh బ్యాటరీతో రోజువారీ పనులకు మంచి బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. మీడియాటెక్ 5G ప్రాసెసర్‌తో సాధారణ టాస్కులు స్మూత్‌గా రన్ అవుతాయి.

Also Read: మంచి గేమింగ్ ఫోన్ కొవాలా? కొత్త 16GB ర్యామ్‌గల గేమింగ్ ఫోన్‌‌పై డిస్కౌంట్ ఆఫర్

కెమెరా, కనెక్టివిటీ

ఫోన్‌లో కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు చాలా బాగున్నాయి. 50MP రియర్ కెమెరా, 24MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, ఒక ఫిజికల్ సిమ్, ఒక eSIM ఇందులో పెట్టుకోవచ్చు. USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రోSD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఓఎస్

సాఫ్ట్‌వేర్, కస్టమైజేషన్ ఆప్షన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది, ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాక్ కవర్లు మార్చి కస్టమైజ్ చేయవచ్చు.

క్లిక్స్ కమ్యూనికేటర్ ఫోన్ లో ఫిజికల్ కీబోర్డ్ కోరుకునేవారికి, బ్లాక్‌బెర్రీ ఫ్యాన్స్‌కు అద్భుతమైన ఛాయిస్.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×