E-Paper
Advertisement

Animals: సఫారీ వెహికిల్స్ మీద జంతువులు అటాక్ చేయవు, ఎందుకో తెలుసా?

Animals: సఫారీ వెహికిల్స్ మీద జంతువులు అటాక్ చేయవు, ఎందుకో తెలుసా?
Advertisement

జనరల్ గా అటవీ జంతువులు.. ముఖ్యంగా సింహం, పులి, చిరుత, ఏనుగు లాంటి జంతువులు మనుషులు కనిపిస్తేనే దాడి చేస్తాయి. ఏనుగు లాంటివి మనుషులను తొక్కి చంపేస్తే, పులి, సింహం చంపి తినేస్తాయి. కానీ, ఆశ్చర్యకరంగా సఫారీ వాహనాల మీద ఈ క్రూర మృగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేయవు. చేయాలనే ఆలోచన కూడా చేయవు. ఎందుకో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సఫారీ వాహనాలపై జంతువులు దాడి ఎందుకు చేయవంటే?

పర్యాటకులు సఫారీ వాహనాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు దగ్గరగా ఉన్నా, సింహాలు, ఇతర అటవీ జంతువులు దాడి చేయవు. ప్రమాదకర జంతువులకు అంత దగ్గరగా వచ్చినా, ఎందుకు దాడి చేయడం లేదని చాలా మంది ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు దాడి చేసిన సంఘటనలు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం దాడి చేయవు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అడవిలో చాలా జంతువులు మనుషుల పట్ల దూకుడు స్వభావాన్ని కలిగి ఉండవు. తమ మనుగడను కొనసాగించే విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెడతాయి. ఆహారాన్ని సంపాదించుకోవడం, తిని హ్యాపీగా ఉండటం గురించి ఆలోచిస్తాయి. తాము ఉండే ప్రాంతం సేఫ్ గా ఉంచుకోవడం, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం మీదే ఆలోచన ఉంటుంది. మనుషులను ఎరగా భావించవు. మనుషులతో కొట్లాటకు మొగ్గు చూపవు.

సఫారీ వాహనాలను ప్రమాదకరంగా భావించవు!

Advertisement

చాలా జంతువులు సఫారీ వాహనాలను నిత్యం చూస్తూ ఉంటాయి. వాటికి అలవాటు పడుతాయి. వాటిని ముప్పుగా భావించవు. సఫారీ నిర్వాహకులు పాటించే కఠినమైన రక్షణ జాగ్రత్తలు, గైడ్ లైన్స్ కారణంగానూ కొంత వరకు ఈ వాహనాల మీద దాడి చేసేందుకు జంతువులు ప్రయత్నించవు. అదే సమయంలో సఫారీ వాహనాలను నడిపే వ్యక్తులు జంతువులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సఫారీ గైడ్‌లు సాధారణంగా జంతువులు కారులో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రత్యేక వ్యక్తులుగా చూడవని చెప్తుంటారు. అవి   వాహనాన్ని ప్రెడేటర్ లేదంటే వేటాడబడని ఒక పెద్ద వస్తువుగా మాత్రమే చూస్తాయంటారు. ల్యాండ్ క్రూయిజర్ లాంటి సఫారీ వాహనాలు చెట్టులాగా సహజ ప్రకృతి దృశ్యంలో భాగంగా కనిపించేలా ఉంటాయి. అందుకే వాటిని జంతువులు పెద్దగా పట్టించుకోవు. అదే సమయంలో  వాహనాలు సాధారణంగా దాడి చేసే జంతువుల కంటే పెద్దవిగా ఉంటాయి.

సఫారీలో సేఫ్ గా ఉండాలంటే ఎలా?

సఫారీలో ఎంజ్ చేసే సమయంలో సేఫ్ గా ఉండేందుకు కొన్ని రూల్స్ పాటించాలి. ముఖ్యగా గైడ్ చెప్పే మాటలు వినాలి. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండాలని,  కూర్చోమని, కదలకుండా ఉండమని చెప్తారు. జంతువులు దాడి చేయకుండా ఆపడానికి, పర్యాటకుల అల్లరి జంతువులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా టూర్ సమయంలో వన్యప్రాణులను ఇబ్బంది పెట్టకూడదు. వాహనం లోపల ఉండి జంతువులను నిశ్శబ్దంగా, వాటి పనులకు ఇబ్బంది కలిగించకుండా చూసి ఎంజాయ్ చేయాలి. గట్టిగా అరవడం, చేతులు ఊపడం, చప్పట్లు కొట్టడం, వస్తువులను విసరడం లాంటి పనులు చేయకూడదు. మీ చేతులు, కాళ్ళను వెహికిల్ లోపలే ఉండేలా చూసుకోవాలి. జంతువులను తాకడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదు. గైడ్ సూచనలు పాటించి సేఫ్ గా సఫారీ టూర్ ను ఎంజాయ్ చేయాలి.

Advertisement

Read Also: బైక్ మీద పొగమంచులో జర్నీ చేస్తున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×