E-Paper
Advertisement

Blue Star vs Voltas vs Carrier: ఫీచర్లు, ధర, కరెంటు ఆదా.. మధ్యతరగతి ఇంటికి.. మూడింట్లో ఏది బెస్ట్?

Blue Star vs Voltas vs Carrier: ఫీచర్లు, ధర, కరెంటు ఆదా.. మధ్యతరగతి ఇంటికి.. మూడింట్లో ఏది బెస్ట్?
Advertisement

Blue Star vs Voltas vs Carrier: దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న తరుణంలో ఏసీలు విలాస వస్తువుల నుండి నిత్యావసర వస్తువులు మారిపోతున్నాయి. ఇదిలా ఉంటే మీడియం సైజ్ రూమ్‌ల కోసం చాలా మంది 1.5-టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సెగ్మెంట్ లో ‘బ్లూ స్టార్’ (Blue Star), ‘వోల్టాస్’ (Voltas), ‘క్యారియర్’ (Carrier) బ్రాండ్లు అగ్రగామిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడింటిలో సామాన్యుల ఇంటికి ఏది సరిపోతుంది? వాటిలోని ప్రధాన ఫీచర్లు ఏంటి? వంటి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

వోల్టాస్ (Voltas)

టాటా గ్రూప్‌నకు చెందిన వోల్టాస్.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఏసీ బ్రాండ్లలో ఒకటి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో ఉండటం దీని ప్రధాన ప్లస్ పాయింట్. ఫీచర్ల విషయానికి వస్తే.. తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల్లో (రూమ్ ఉష్ణోగ్రత 52°C ఉన్నా కూడా) ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ‘కన్వర్టిబుల్ మోడ్స్’ ద్వారా రూమ్‌లో ఉన్న జనాన్ని బట్టి కూలింగ్‌ను మార్చుకోవచ్చు. మరికొన్ని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా వోల్టాస్‌కు ఉన్న సర్వీస్ నెట్‌వర్క్ చాలా పెద్దది. చిన్న నగరాలు, టౌన్లలో కూడా దీని సర్వీస్ ఈజీగా దొరుకుతుంది. అయితే బ్లూ స్టార్, క్యారియర్‌లతో పోలిస్తే వోల్టాస్ ఏసీలలో కంప్రెషర్ శబ్దం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు ఆశించిన స్థాయిలో ఉండవు.

బ్లూ స్టార్ (Blue Star)

Advertisement

స్మార్ట్ ఫీచర్లు, నాణ్యమైన పనితీరును కోరుకునేవారికి బ్లూస్టార్ ఏసీలు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయి. 2026 కొత్త BEE స్టార్ రేటింగ్ నిబంధనల ప్రకారం బ్లూ స్టార్ 5 స్టార్ ఏసీలు అత్యధిక ISEER రేటింగ్‌తో రూపొందాయి. ఫలితంగా ఇవి కరెంటు బిల్లును చాలా వరకు ఆదా చేస్తాయి. ఇందులో ఉండే హెపా (HEPA) ఫిల్టర్లు, యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్లు గదిలోని గాలిని శుద్ధి చేస్తాయి. ‘స్మార్ట్ వై-ఫై’ కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్ ఫీచర్లతో ఇది పనిచేయనుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా బ్లూస్టార్ ఏసీలు ఆకట్టుకుంటాయి. ఏసీ రన్ అవుతున్నప్పుడు అస్సలు శబ్దం రాదు. లాంగ్-టర్మ్ వాడకానికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే వోల్టాస్, క్యారియర్ లతో పోలిస్తే బ్లూ స్టార్ ధర కొంచెం ఎక్కువ. బడ్జెట్ తక్కువ ఉన్నవారికి ఇది కాస్త భారంగా అనిపించవచ్చు.

క్యారియర్ (Carrier)

కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో క్యారియర్ సంస్థ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. భారతీయ వాతావరణానికి అనుగుణంగా తమ ఏసీల్లో ఫ్లెక్సికూల్ (Flexicool) ఇన్వర్టర్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. క్యారియర్.. 6-ఇన్-1 కన్వర్టిబుల్ ఏసీలు గదిని క్షణాల్లో చల్లబరుస్తాయి. దీని ‘ఇన్‌స్టా కూల్’ ఫీచర్ రిమోట్ నొక్కగానే గాలి వేగాన్ని పెంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. తుప్పు పట్టకుండా ఉండేందుకు దీని కండెన్సర్ కాయిల్స్‌పై ప్రత్యేక ప్రొటెక్షన్ కోటింగ్ వేశారు. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నా స్టెబిలైజర్ లేకుండానే ఈ ఏసీ మేనేజ్ చేయగలదు. మెట్రో నగరాలు, టైర్-1 నగరాల్లో క్యారియర్ సర్వీస్ బాగున్నప్పటికీ.. చిన్న పల్లెటూళ్లు లేదా గ్రామీణ ప్రాంతాల్లో క్యారియర్ సర్వీస్ నెట్‌వర్క్ వోల్టాస్ అంత వేగంగా ఉండకపోవచ్చు.

Advertisement

Also Read: ఎవరికీ తెలియని 5 బెస్ట్ కూలర్ బ్రాండ్లు.. ధర తక్కువ, కూలింగ్ ఎక్కువ!

ఫైనల్గా ఏది కొంటే బెటర్?

మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఏసీ కావాలి అనుకుంటే వోల్టాస్ బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా మీరు చిన్న టౌన్లలో నివసిస్తుంటే సర్వీస్ పరంగా వోల్టాస్ వైపు వెళ్లొచ్చు. ధర ఎక్కువైనా పర్లేదు.. మంచి బిల్డ్ క్వాలిటీ, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు, తక్కువ నాయిస్ ఉండాలని భావిస్తే.. బ్లూస్టార్ ట్రై చేయవచ్చు. ఇవి పవర్ బిల్లును సైతం తగ్గిస్తాయి. అలా కాకుండా మీకు అడ్వాన్స్‌డ్ అమెరికన్ టెక్నాలజీ, సూపర్ ఫాస్ట్ కూలింగ్ కావాలి అనుకుంటే క్యారియర్ ఫ్లెక్సికూల్ సిరీస్ బెస్ట్ ఛాయిస్. నగరాల్లో ఉండేవారికి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ మోడల్ అని చెప్పవచ్చు. మెుత్తంగా మీ అవసరాలకు అనుగుణంగా ఉన్న బ్రాండ్ ను మీరే ఎంచుకోండి.

Also Read: విదేశాలకు వెళ్తున్నారా? ‘వీఐ’ నుంచి అదిరిపోయే రోమింగ్ ప్లాన్స్.. రూ. 649 నుంచే ప్రారంభం!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×