E-Paper
Advertisement

Robots Make BMW: లగ్జరీ కార్లు తయారు చేస్తున్న రోబోలు.. జర్మన్ కంపెనీ ప్రయోగం

Robots Make BMW: లగ్జరీ కార్లు తయారు చేస్తున్న రోబోలు.. జర్మన్ కంపెనీ ప్రయోగం
Advertisement

Robots Make BMW| లగ్జరీ కార్లు తయారు చేసే BMW కంపెనీ కార్ల తయారీ ప్రక్రియలో హ్యూమనాయిడ్ రోబోలను పరీక్షిస్తోంది. జర్మనీలోని లిప్‌జిగ్ ఐప్లాంట్‌లో (Lipzig iFACTORY) ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇది అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో పెద్ద అడుగు. ఎలక్ట్రిక్ వాహనాల అసెంబ్లీలో ఎఫిషియెన్సీ పెంచడమే లక్ష్యం.

AEON రోబో పరిచయం

ఈ హ్యూమనాయిడ్ రోబో పేరు AEON. హెక్సాగాన్ రోబోటిక్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఫ్యాక్టరీలో రిపీట్ అయ్యే, శారీరకంగా కష్టమైన పనులకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పనులను మనుషుల కంటే రోబోలు ఎక్కువ కచ్చితత్వంతో, వేగంగా చేస్తాయి.

రోబో డిజైన్, ఫీచర్లు

Advertisement

AEON రోబో ఎత్తు దాదాపు 1.65 మీటర్లు, బరువు 60 కిలోలు. ఈ రోబో కాళ్లకు చక్రాలు ఉంటాయి. అందుకే నడిచే బదులు చక్రాలపై అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రాలు.. ఫ్యాక్టరీ ఫ్లోర్‌లో త్వరగా, స్థిరంగా తిరగడానికి సహాయపడుతాయి. దీని ద్వారా రోబో బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది.

రోబో చేసే పనులు

ఈ రోబో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ అసెంబ్లీలో సహాయం చేస్తోంది. భాగాలను హ్యాండిల్ చేయడం, స్క్రూలు టైట్ చేయడం వంటి పనులు చేస్తుంది. హై-వోల్టేజ్ బ్యాటరీల పనులు కచ్చితంగా, రిపీట్‌గా చేయాలి. ఇలాంటి పనుల్లో రోబోలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మనుషులకు శారీరక ఒత్తిడి తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది.

సెన్సార్లు, AI కెపాసిటీ

Advertisement

AEON రోబోలో 22 సెన్సార్లు ఉన్నాయి. కెమెరాలు, మైక్రోఫోన్లు ఉన్నాయి. చుట్టూ ఏముందో తెలుసుకుని, అడ్డంకులను తప్పించుకుంటుంది. NVIDIA Jetson Orin హార్డ్‌వేర్‌తో రన్ అవుతుంది. ఇది డేటాను త్వరగా ప్రాసెస్ చేసి, రియల్-టైమ్‌లో నిర్ణయాలు తీసుకుంటుంది. BMW ఈ రోబోలో ఉన్న ఏఐని “ఫిజికల్ AI” అని పేర్కొంది.

ముందుగా అమెరికాలో పరీక్షలు

ఈ టెక్నాలజీని ముందుగా అమెరికాలోని స్పార్టన్‌బర్గ్ ఫ్యాక్టరీలో పరీక్షించారు. 10 నెలల పాటు టెస్టింగ్ కొనసాగింది. ఆ సమయంలో ఈ టెక్నాలజీ రోబోలు 90,000 భాగాలు అసెంబుల్ చేసి 30,000 వాహనాల ఉత్పత్తికి సహాయపడ్డాయి. ఫలితాలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు యూరప్‌లో కూడా పరీక్షలు చేస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

BMW ఈ ఏడాది మొత్తం రోబోలపై టెస్టింగ్ కొనసాగిస్తుంది. త్వరలో పెద్ద స్థాయి పైలట్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఫ్యాక్టరీ ఉత్పత్తి లైన్లలో రోబోలు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తారు. అక్కడ రోబోలు విజయవంతమైతే ఫ్యాక్టరీలలో రోబోలు సాధారణ వర్కర్లుగా మారుతాయి. మనుషులతో కలిసి పనిచేస్తాయి.

Also Read: సగం ధరకే గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్, ఫ్రీ ఈఎంఐ కూడా.. అదిరిపోయే ప్రొగ్రామ్ లాంచ్ చేసిన శాంసంగ్

ఆటోమొబైల్ ఇండస్ట్రీపై ప్రభావం

హ్యూమనాయిడ్ రోబోలు ఉత్పత్తి వేగాన్ని పెంచుతాయి. తప్పులు తగ్గుతాయి. ప్రమాదకరమైన, రిపీట్ పనులు సురక్షితంగా చేస్తాయి. మనుషులకు సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్ వస్తుంది. AI, రోబోటిక్స్ ఉపయోగం త్వరగా పెరుగుతుంది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి టెక్నాలజీలు అమలు చేస్తాయి.

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×