E-Paper
Advertisement

VC Sajjanar: ఈ యాప్స్ తో జాగ్రత్త.. అందమైన అమ్మాయి వీడియో కాల్… తర్వాత షాక్! సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: ఈ యాప్స్ తో జాగ్రత్త.. అందమైన అమ్మాయి వీడియో కాల్… తర్వాత షాక్! సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
Advertisement

VC Sajjanar: స్వేచ్ఛ బ్యూరో:  ఆన్​ లైన్​ లోని డేటింగ్​ యాప్స్​ తో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్ సూచించారు. వీటి ద్వారా సైబర్​ క్రిమినల్స్ డబ్బు కొల్లగొడుతున్నారని తెలిపారు. అందమైన అమ్మాయిలతో వీడియోలు చేసి ఒంటరిగా ఉన్నారా?..ఇంకెందుకు ఆలస్యం..ఈ యాప్​ ఇన్​ స్టాల్ చేసుకోండి అమ్మాయిలు..ఆంటీలతో మాట్లాడండి అంటూ కేటుగాళ్లు లింకులు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా హనీ ట్రాప్​ చేస్తూ యాప్​ ను ఇన్​ స్టాల్ చేసుకోగానే అవతలి వారి మొబైల్ ఫోన్​ ను హ్యాక్​ చేస్తున్నారని చెప్పారు.

Also Read: Pearl Ring: ఈ రాశుల వారు ముత్యపు ఉంగరం ధరించడం ఏమాత్రం మంచిది కాదు

 1930 నెంబర్​ కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయాలి 

Advertisement

తద్వారా ఫోన్​ లోని కాంటాక్ట్స్ లిస్ట్, గ్యాలరీని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాత్రి వేళ సరదాగా మాట్లాడుదామని వీడియో కాల్​ చేస్తే స్ర్కీన్​ పై ఉన్న ముఖాన్ని రికార్డు చేస్తున్నారన్నారు. ఆ తరువాత మార్ఫింగ్​ ద్వారా అసభ్యకరంగా వీడియోలు తయారు చేసి కాంటాక్ట్​ లిస్టులో ఉన్న అందరికీ వాటిని పంపిస్తామని బెదిరించి డబ్బు గుంజుతున్నారని వివరించారు. ఇలాంటి యాప్స్​ ను డౌన్​ లోడ్ చేసుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే 1930 నెంబర్​ కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also Read: MLA KP Vivekananda: కాంగ్రెస్ తీసుకున్న ప్రతి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ : కేపీ వివేకానంద గౌడ్

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×