E-Paper
Advertisement

BSNL Rs 1 Plan: అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా.. BSNL రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ మళ్లీ వచ్చింది!

BSNL Rs 1 Plan: అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా.. BSNL రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ మళ్లీ వచ్చింది!
Advertisement

BSNL Rs 1 Freedom Plan: ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL.. ప్రైవేటు కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్స్ ను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులతో పాటు కొత్త యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పోటీ సంస్థలకు సాధ్యంకాని రీతిలో చౌకైన ప్లాన్స్ తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే.. BSNL అత్యంత పాపులర్ రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, SMS, హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.

తొలిసారి ఆగష్టులో ప్రారంభం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఆగస్టులో BSNL ఫ్రీడమ్ ప్లాన్ ను ప్రారంభించింది. కానీ, అధిక డిమాండ్ కారణంగా కొద్ది రోజుల్లోనే తొలగించింది. ఇప్పుడు ఈ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ ప్లాన్ గురించి ప్రకటించింది. కొత్త కస్టమర్లకు సాధ్యమైనంత తక్కువ ధరకు రూ. 1 ప్లాన్‌ ను పరిచయం చేస్తున్నామని వెల్లడించింది.

కొత్త కస్టమర్లకు లిమిటెడ్ ఆఫర్!  

Advertisement

BSNL తన ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఈ లిమిటెడ్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ కొత్త BSNL సబ్‌స్క్రైబర్‌ లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే ఈ ఆఫర్‌ను పొందడానికి కొత్త BSNL సిమ్ కార్డ్‌ ను కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్ లో భాగంగా అన్ని నెట్‌వర్క్‌ లకు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేయబడిన రోజు నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు సంబంధించి పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు, ఈ ఎంట్రీ లెవల్ ప్లాన్ ఉపశమనం కలిగించనుంది.

కేవలం 1 రూపాయికే 60GB డేటా

BSNL ఫ్రీడమ్ ప్లాన్ లో భాగంగా రూ. 1కే 60GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది.  రోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం కల్పిస్తుదంఇ. డేటా అయిపోయిన తర్వాత నెట్ స్పీడ్ తగ్గుతుంది.మెసేజింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ చెల్లింపులు, బ్రౌజింగ్,   సోషల్ మీడియా చూసే వినియోగదారులకు ఈ డేటా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవాలనుకునే  విద్యార్థులు, గ్రామీణ వినియోగదారులు, BSNLకి మారే ఇతర వినయోగదారులకు ఈ ప్లాన్ చాలా అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Read Also:  సరికొత్త AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలిబాబా.. దిమ్మతిరిగే ఫీచర్స్, వర్త్ వర్మ వర్తు!

రూ. 1 ప్లాన్ ఎందుకు ముఖ్యమైనదంటే?

టెలికాం ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫ్రీడమ్ ప్లాన్ తో వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలని టెలికాం సంస్థ భావిస్తోంది. కొత్త సబ్‌స్క్రైబర్‌లకు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. దేశం వ్యాప్తంగా 4G సేవలను వేగంగా విస్తరిస్తున్న BSNL ఈ ప్లాన్ తో కస్టమర్ల పరిధిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ ప్లాన్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Read Also: గాలి నుంచి డ్రింకింగ్ వాటర్.. ఈ సరికొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×