E-Paper
Advertisement

BSNL Student Data Pack: జస్ట్ రూ. 251కే 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. ఎన్ని రోజులంటే!

BSNL Student Data Pack: జస్ట్ రూ. 251కే 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. ఎన్ని రోజులంటే!
Advertisement

BSNL Special Student Data Pack: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ.. ప్రైవేటు కంపెనీలకు ధీటు రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఉన్న వినియోగదారులను ఆకట్టుకుంటూనే, కొత్త వారిని ఆకట్టుకునేలా క్రేజీ ప్లాన్స్ ను పరిచయం చేస్తుంది. ఆయా అకేషన్స్ కు అనుగుణంగా.. ఆయా వర్గాలకు అద్భుతమైన ప్లాన్స్ ను పరిచయం చేస్తుంది. అందులో భాగంగానే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఓ అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది.

విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా..

విద్యార్థులకు వారి విద్యా అవసరాల కోసం  హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా BSNL రూ.251కు ప్రత్యేక స్టూడెంట్ డేటా ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 100 GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ఆఫర్ 2025 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ లో భాగంగా విద్యార్థులు BSNL దేశీయంగా అభివృద్ధి చేసిన 4G మొబైల్ నెట్‌వర్క్‌ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. చెల్లుబాటు వ్యవధిలో సజావుగా, అంతరాయం లేని డేటా కనెక్టివిటీని అందిస్తుంది. సరసమైన, పోటీతత్వంతో రూపొందించబడిన ఈ ప్యాక్, ముఖ్యంగా ఆన్‌ లైన్ లెర్నింగ్,  పరిశోధన, ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఎక్కువ డేటా ఉపయోగించుకునే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Read Also: 30 డేస్ వ్యాలిడిటీతో.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!

స్పెషల్ ఆఫర్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే?

BSNL తన 4G సేవలకు సబంధించి మెరుగైన కవరేజ్, మంచి నాణ్యతను విద్యార్థులకు వినియోగించుకోవాలని సూచించింది. ఈ ప్లాన్ కు  సంబంధించి సహాయం కోసం లేదంటే స్టూడెంట్ డేటా ప్యాక్ పొందడానికి, కస్టమర్లు BSNL సెల్ఫ్‌ కేర్ యాప్‌ను ఉపయోగించవచ్చని అధికారులు సూచించారు. సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్, ఏదైనా ఆథరైజ్ డ్ ఫ్రాంచైజీ అవుట్‌ లెట్‌ ను సందర్శించవచ్చన్నారు. లేదంటే BSNL టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-1503కు కాల్ చేయాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్ www.bsnl.co.inని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా పొందాలనుకునే వారికి ఆ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Advertisement

Read Also: ఫోన్ బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయాలా? ఎక్స్‌ పర్ట్స్ చెప్పేది వింటే మీ మొబైల్‌కు ఫుల్ లైఫ్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×