E-Paper
Advertisement

Mobile Battery Health: ఫోన్ బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయాలా? ఎక్స్‌ పర్ట్స్ చెప్పేది వింటే మీ మొబైల్‌కు ఫుల్ లైఫ్!

Mobile Battery Health: ఫోన్ బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయాలా? ఎక్స్‌ పర్ట్స్ చెప్పేది వింటే మీ మొబైల్‌కు ఫుల్ లైఫ్!
Advertisement

Phone Battery Health: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే, చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్య బ్యాటరీ త్వరగా అయిపోవడం. ఎక్కువ సేపు ఛార్జింగ్ చేసినా, ఇట్టే అయిపోతుంది. అయితే,  ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం పని చేయాలంటే కొన్ని కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఫోన్ ఛార్జింగ్ అనేది 85–90% వరకు పెడితే, కనీసం 3–4 సంవత్సరాల వరకు బ్యాటరీ హెల్తీగా ఉంటుంది. బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ చేస్తే ఎంత బాగా పని చేస్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్యాటరీ ఎంత ఛార్జ్ చేస్తే ఎలా పని చేస్తుంది?

⦿ ప్రతిసారి 0–100%  ఛార్జింగ్ చేస్తే 300 నుంచి 500 సైకిల్స్ తర్వాత బ్యాటరీ కెపాసిటీ 20–30% తగ్గుతుంది. అందుకే ఈ పద్దతిని రోజూ పాటించకూడదు. త్వరగా బ్యాటరీ చెడిపోతుంది.

Advertisement

⦿ ఇక 20–80% లేదంటే 85% వరకు ఛార్జింగ చేస్తే,  800–1,200 సైకిల్స్ వరకు ఆరోగ్యంగా ఉంటుంది. 2–4 సంవత్సరాలు చక్కటి కండీషన్ లో ఉంటుంది. ప్రతిసారి ఇదే పద్దతి పాటించడం మంచిది.

⦿ 30–90% చాలా మంచిదికొంచెం. ఇలా రోజూ చేయడం వల్ల బ్యాటరీ ఇంకా ఎక్కువ రేంజ్ వస్తుంది.

Advertisement

⦿ రోజువారీ యూసేజ్ కోసం 80% – 85% లిమిట్ పెట్టుకోండి. ప్రయాణం, గేమింగ్, లాంగ్ ట్రిప్ ఉన్నప్పుడు మాత్రమే 100% చేయండి. కానీ, ఎక్కువ సార్లు 100% చేయకపోవడం మంచిది.

100% ఛార్జింగ్ చేయడం ఎందుకు మంచిది కాదంటే?   

100% ఛార్జ్‌ లో వోల్టేజ్ గరిష్టంగా ఉంటుంది. బ్యాటరీ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది.  ఎలక్ట్రోలైట్ విచ్ఛిన్నం అవుతుంది.  కెపాసిటీ త్వరగా తగ్గుతుంది. 80% దగ్గర వోల్టేజ్ తక్కువగా ఉంటుంది. బ్యాటరీ చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.

Read Also: పెరగనున్న Jio, Airtel, Vi రీఛార్స్ ధరలు!

బ్యాటరీ హెల్త్ కోసం ఏం చేయాలంటే?  

ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత  ఛార్జింగ్ లిమిట్ అనేది  80% -85% పెట్టండి. నైట్ ఛార్జ్ చేస్తున్నా, ఆప్టిమైజ్డ్ / స్మార్ట్ ఛార్జింగ్ ఆన్ చేయండి. ఉదయానికి   90%- 80% దగ్గరే ఛార్జింగ్ ఉంటుంది. వారంలో 1–2 సార్లు మాత్రమే 100% చేయండి. బ్యాటరీ కాలిబ్రేషన్ కోసం అలా చేయాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల 3–4 సంవత్సరాల తర్వాత కూడా మీ బ్యాటరీ 85–90% హెల్త్‌ లో బాగా పని చేస్తుంది.

Read Also: దేశీ మార్కెట్లోకి iQOO 15.. ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×