E-Paper
Advertisement

Gustavo Petro: ఇక్కడే ఉన్నా.. వచ్చి నన్ను తీసుకెళ్లు.. ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు పెట్రో స్ట్రాంగ్ వార్నింగ్..

Gustavo Petro: ఇక్కడే ఉన్నా.. వచ్చి నన్ను తీసుకెళ్లు..  ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు పెట్రో స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Gustavo Petro: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా డెల్టా ఫోర్స్ బలగాలు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘటన లాటిన్ అమెరికాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మదురో అరెస్ట్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తదుపరి లక్ష్యం కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోనేనని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలతో కొలంబియాలోనూ సైనిక జోక్యం చేసుకుంటామని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీనిపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో టీవీ ప్రసంగం ద్వారా తీవ్రంగా స్పందించారు.

అమెరికా హెచ్చరికలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా మండిపడ్డారు. గతంలో వెనెజువెలా అధ్యక్షుడు మదురో సవాల్ చేసిన తరహాలోనే పెట్రో కూడా స్పందించారు. తనను బంధించేందుకు రావచ్చని, తాను ఎక్కడికీ వెళ్లనని, అక్కడే వారి రాక కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనను తీసుకెళ్లాలని, అమెరికా బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆయన పరోక్షంగా సవాల్ విసిరారు.

Advertisement

అమెరికా సైనిక జోక్యాన్ని, బెదిరింపులను పెట్రో గట్టిగా తిప్పికొట్టారు. “మా దేశం ఇప్పటికే అసమానతల కారణంగా జరిగిన అంతర్యుద్ధాల్లో 7 లక్షల మందిని కోల్పోయింది. మాకు కొత్తగా ఆక్రమణలు, క్షిపణి దాడులు లేదా హత్యలు వద్దు. మాకు కావాల్సింది అంతర్జాతీయ చట్టాల పరిధిలో తెలివైన చర్చలు మాత్రమే.” అని పెట్రో స్పష్టం చేశారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతిస్తే, అవసరమైతే ఆయుధాలు చేపట్టి సాయుధ ప్రతిఘటన చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ఒకప్పుడు ఎం-19 (M-19) గెరిల్లా ఉద్యమంలో పనిచేసిన వామపక్ష భావజాలం ఉన్న పెట్రో.. ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం భయపడటం లేదు. మదురో అరెస్ట్ తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా పెత్తనంపై చర్చ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతుండగా, సార్వభౌమాధికారం వర్సెస్ అమెరికా ఆధిపత్యం అన్న కోణంలో పెట్రో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Related News

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

Big Stories

Advertisement
×