Jio 3599 Plan: ప్రముఖ రిలయన్స్ జియో తమ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కంపెనీ తమ పాపులర్ వార్షిక రీఛార్జ్ ప్లాన్ అయిన రూ.3599ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. రోజువారీ డేటా, అపరిమిత కాల్స్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లో మరిన్ని కొత్త సదుపాయాలను జోడించింది.
సాధారణంగా ఈ వార్షిక ప్లాన్ కింద రోజుకు 2.5GB చొప్పున ఏడాదికి మొత్తం 912.5GB లభిస్తుంది. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో Jio అదనంగా 120GB డేటాను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులకు మొత్తం డేటా పరిమితి 1032.5GBకి పెరుగుతుంది. ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే ఈ ఆఫర్ పొందవచ్చు.
వినోదాన్ని ఇష్టపడే వారి కోసం Jio TV ద్వారా 1000కి పైగా టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసే సదుపాయం ఇచ్చారు. వీటితో పాటు ఏడాది పొడవునా వినియోగించుకునేలా 12 Jio TV Pro వోచర్లను కూడా ఇస్తున్నారు. ప్రత్యేకంగా మొబైల్ వినియోగదారుల కోసం జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీనివల్ల సినిమాలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లను ప్రత్యేకంగా ఎలాంటి డబ్బులు పెట్టకుండానే చూసేయవచ్చు.
Also Read: పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!
ఈ ప్లాన్‌తో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. Google Gemini Pro సేవలు పొందవచ్చు. అర్హులైన కస్టమర్లకు దాదాపు 18 నెలల పాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు 500GB క్లౌడ్ స్టోరేజ్, అలాగే నానో బనానా ఏఐ ఫీచర్లను కూడా వాడుకోవచ్చు. ఈ సేవలకు ఉన్న విలువ ప్లాన్ ధర కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
కొత్త ప్రయోజనాలు వచ్చినప్పటికీ.. ప్లాన్ ప్రాథమిక సేవల్లో ఎలాంటి మార్పు లేదు. ఏడాది పొడవునా అంటే 365 రోజుల పాటు రోజుకు 2.5GB డేటా, రోజువారీ 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాలు యథాతథంగా ఉంటాయి. మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉండి, మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్ ఉంటే అపరిమిత 5G డేటాను కూడా ఉచితంగా వాడుకోవచ్చు.
ఈ ప్లాన్ మొత్తం ఖర్చును ఏడాదిలోని 365 రోజులకు లెక్కిస్తే రోజుకు రూ.10 కంటే తక్కువే పడుతుంది. మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా.. ఎక్కువ డేటా, ఎంటర్టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. My Jio App లేదా సమీపంలో ఉన్న జియో స్టోర్‌కు వెళ్లి ఈ ప్లాన్ వివరాలు చూసుకుని వెంటనే రీఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!