E-Paper
Advertisement

ఆ ఒక్క టీజర్‌తో పెరిగిన అంచనాలు.. యశ్ ‘టాక్సిక్’ డైరెక్టర్ బర్త్‌డే గ్లింప్స్ వైరల్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

ఆ ఒక్క టీజర్‌తో పెరిగిన అంచనాలు.. యశ్ ‘టాక్సిక్’ డైరెక్టర్ బర్త్‌డే గ్లింప్స్ వైరల్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?
Advertisement

Toxic Movie: యశ్…‘KGF’ సిరీస్‌తో ఈ కన్నడ రాకింగ్ స్టార్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో చెప్పక్కర్లేదు.ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలే యష్ కి వరల్డ్ వైడ్ గా మాంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.ఇక ఆ ఊపులోనే సెట్స్ పైకి మరో ప్రెస్టేజియస్ సినిమాని పట్టాలెక్కించాడు.అదే టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’.

మలయాళంలో డిఫరెంట్ ఫిలిమ్స్ తో సత్తా చాటిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇక KGF 2 తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.నిజానికి ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సాలిడ్ స్టార్ క్యాస్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కూడిన మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావడం వల్ల కనీసం జూన్ ఫస్ట్ వీక్ లో అయినా సినిమా వదులుదామని అనుకున్నా సమయానికి థియేటర్లలోకి రాలేకపోయింది.అయితే ఆ పోస్ట్ పోనే బాక్సాఫీస్ వద్ద ఒక క్రేజీ రేస్ కి తెరలేపింది.

గీతూ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్

Advertisement

అవును …టాక్సిక్ రావలసిన ఆ విండో ఖాళీ అవ్వడంతో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఆ స్లాట్‌ను సొంతం చేసుకుంది. జూన్ 4వ తేదీన థియేటర్లలోకి వచ్చిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ రకంగా యశ్ సినిమా పోస్ట్‌పోన్ కావడం రామ్ చరణ్ చిత్రానికి రూట్ క్లియర్ చేసినట్లయిందన్న మాట.

also read :పాపం ఆ అమ్మాయిని టార్గెట్ చేయొద్దు.. జాన్వీ కపూర్‌పై ట్రోలింగ్..ఘాటుగా స్పందించిన జగ్గుభాయ్

Advertisement

ఇదిలా ఉంటే, ఇవాళ టాక్సిక్ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో గీతూ మోహన్‌దాస్ లొకేషన్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారో, నటీనటుల నుంచి అవుట్‌పుట్ రాబట్టడానికి ఎంతగా కష్టపడుతున్నారో చూపించారు. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఆమె హ్యాండిల్ చేసిన విధానం చూస్తుంటే సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఆమె చూపిస్తున్న డెడికేషన్‌కు ఫిదా అవుతూ టాలీవుడ్, మోలీవుడ్, శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.

ట్రోలర్స్ కి స్టఫ్ ఇచ్చిన ఫస్ట్ గ్లిమ్ప్

అయితే ఈ సినిమా ప్రయాణం అంత సులభంగా సాగలేదనే చెప్పాలి.గతంలో విడుదలైన టాక్సిక్ గ్లింప్స్ లేదా టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది. ముఖ్యంగా ఆ టీజర్‌లో చూపించిన కొన్ని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ కాస్త ఓవర్‌గా ఉన్నాయంటూ ట్రోల్ చేశారు నెటిజన్లు.ఒక లేడీ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటి సీన్స్‌ను ఇంత ఘాటుగా తెరకెక్కించడం ఏంటంటూ కాంట్రవర్సీకి శ్రీకారం చుట్టారు కొంతమంది సోషల్ మీడియా వారియర్స్.

also read :ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!

కానీ కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన ఆ సీన్స్ అన్నీ స్టోరీకి తగ్గట్టే ఉంటాయని, ఒక దర్శకురాలిగా కథ డిమాండ్ చేసిన మేరకే ఆమె ఆ సీన్స్ డిజైన్ చేశారని, దీన్ని కేవలం సినిమా కోణంలోనే చూడాలని మరికొందరు గీతూ మోహన్‌దాస్‌కు సపోర్ట్ చేసుకొచ్చారు.ఏదేమైనా ఈ చిన్న వివాదం సినిమాకు నెగెటివ్ కంటే ఎక్కువ హైప్‌నే తీసుకొచ్చిందని చెప్పాలి. ఇక ఆ ఒక్క టీజరే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది కూడా.ఇక వాలకం చూస్తుంటే సినిమా 2026 చివరి నాటికి థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.చూడాలి కాంట్రవర్సీలకి కేరాఫ్ గా నిలుస్తున్న ఈ టాక్సిక్ ఎలాంటి రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలకి వేదిక అవుతుందో !

also read :జాన్వీ ఇన్‌స్టా చాట్ లీక్.. ఆ సీన్లపై అసహనం, బుచ్చిబాబుపై గుర్రు, చెర్రీ గురించి కూడా!

Related News

బన్నీ, రామ్ చరణ్, నా తర్వాత ఆ అదృష్టం అందుకున్న ఏకైక హీరో అతనే.. మహేష్ బాబు స్పెషల్ వీడియో!

Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

అఖిల్ సక్సెస్ పై స్పందించిన సుమంత్..

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?

ఇకపై ప్రతి పెళ్లిలో ఈ పాటే మోగాల్సిందే.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వెడ్డింగ్ వైబ్స్!

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?

వైష్ణవ్ తేజ్ – రీతూ వర్మ పెళ్లికి సాయి దుర్గ తేజ్, తల్లి నో చెప్పారా!

Big Stories

Advertisement
×